ఎలియట్ ఎక్కడనుండి ఎవరినుండి దేనిని గ్రహించినా యథాతథంగా గ్రహించడు కదా. అంతేకాదు, తిరిగి యివ్వకుండా ఏదీ తీసుకోడు. ఈ ఉపనిషత్తులోని ‘దత్త దామ్యత దయధ్వమ్’ వరుస మార్చి, ‘దత్త దయధ్వమ్ దామ్యత’ చేశాడు. అంతే కాదు. ఆ ఉపదేశాలకు తన స్వీయభాష్యం కూడా చెప్పాడు, కవితారూపంలో.

“నా భయాలు, బలహీనతలు, ఇష్టాలు, కోరికలు, నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను. నువ్వేం చెప్పవు!” బుంగమూతి పెట్టింది. ఆమెకి నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. “ఏం చెప్పను?” “ఏదయినా నీ చిన్నప్పటి జ్ఞాపకం.” “ఫొటోగ్రఫీ కోర్స్ చేయాలని ఆశ. ఫ్రెండ్స్ అంతా చేరారు. ఇంట్లో గొడవ. డబ్బుల్లేవని నాన్న. ఆయనకి తాగుడు అలవాటు. బార్లో బాకీ కట్టి రమ్మని ఆరోజు డబ్బులిచ్చి పంపాడు. నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను…”

మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది.

సావిత్రి కథను ఇంగ్లిష్‌లో చెప్పిన మొదటి కవయిత్రి ఈమే. తొరూ దత్ రచనలో సావిత్రి కథ ప్రణయభావనలతో అందమైన కావ్యమైంది. అరవింద ఘోష్ ఈ కథకు తాత్వికరూపమిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మోడర్న్ క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు.

నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను. – ఈమాట సంపాదకుడు. 06 నవంబర్ 2023.

శివరాత్రి శివరాత్రికీ ఇంట్లో సాయంత్రం వరకూ ఉపవాసం, రాత్రి జాగారం ఉంటారు బామ్మా, చిట్టి బామ్మగారూనూ. అమ్మా పిన్నీ అమీను తాతయ్యగారు ఉపవాసం ఉండరు. జాగారం మాత్రం చేస్తారు. మేం పిల్లలం తాతయ్యగారిలా జాగారం మాత్రమే ఉంటాం. వాళ్ళు పడుకోమన్నా పడుకోం.

దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది రాళ్ళమెట్ల అంచులో ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీపురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, తిరగాడుతున్నారు. నటరాజ్ హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.

స్త్రీలో ప్రాకృతికంగా వచ్చిన దేహం వెనుక విలాసమయ శరీరం ఒకటుంటుంది. ఇది భౌతికమైనదే గానీ శరీరసౌష్ఠవాన్నీ, అశ్లీల ప్రదర్శననూ అపేక్షించేది కాదు. ఆ విలాసానికి ప్రేమే హేతువు. వేరేది ఉండే ఆస్కారం లేదు. అటువంటి ప్రేమమయ స్త్రీవిలాసం చాలా గొప్పది. అందుకే అది కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణింపబడింది. ప్రణయకోపంలో ఒక స్త్రీ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో చెప్పే పద్యమిది. ఈ పద్యంలోని నాయిక తన నాయకుడిపై కినుక వహించింది.

కొన్నిటిలో పేజీకి ఒకటి, కొన్నిటిలో పేజీకి మూడూ నాలుగు కూడా. అన్నీ శృంగార భంగిమలే. కూచున్న, పడుకున్న, నిలబడ్డ, ఎత్తుకున్న, సోలిన, వాలిన, పేలిన కామకేళి విన్యాసాలే ఆ బొమ్మలు. వాత్సాయనుడు కూడా కనిపెట్టలేని సూత్రాలు అన్నిటిని మోహన్‌గారి పెన్సిల్ పని పట్టింది. వాటిని చూడటానికి ముందస్తుగా నాకు సిగ్గేసింది.

ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి కాకుండా ఆంగ్లానువాదం నుంచి అనువాదం చేయడం క్షమించరాని నేరం. అందుకే సంస్కృత మూలం నుండి ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.

ఒక విధంగా ఆలోచిస్తే భౌతిక శాస్త్రం యొక్క గమ్యం వాస్తవం యొక్క నిజ స్వరూపం కనుక్కోవడమే. ఈ వాస్తవాన్నే మనం వేదాంత తత్త్వంలో బ్రహ్మము, బ్రహ్మ స్వరూపము అని అంటాం. మన ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ బ్రహ్మము గురించి చేసిన అన్వేషణ అనే చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల గమ్యమూ ఒక్కటే; వారు ఎంచుకున్న మార్గాలు వేర్వేరు, వారి పరిభాషలు వేర్వేరు. వేదాంత తత్త్వంలో అన్వేషణ కేవలం తర్కం, మీమాంసల ద్వారా జరుగుతుంది.

ఆయన ఆర్ధికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమానభారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్‌కు కలిగించింది.

ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయం ఉన్న గురజాడ అప్పారావు తన కన్యాశుల్కంలో బయటకి ఈ పేకాటని వర్ణిస్తున్నట్టు కనిపించినా, దీనిని ఆసరాగా చేసుకుని పోలీసులకీ కొన్ని వర్గాలకీ మధ్య నడిచే అనుబంధాలని కథాగమనానికి, అందులో కొన్ని కీలకమైన మలుపులకీ చాలా చక్కగా వాడుకున్నారు.

నా దాహం తీరడం లేదు. లోలోపల దహించి వేస్తున్న దాహం. అంచెలంచెలుగా పెరిగిపోతున్న దాహం. చివరకు నిద్ర కూడా కరువైంది. ఏమీ చేయాలో తోచలేదు. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. అతడు నాకు పాలీడిప్సియా ఉందని, నాలో ఒక రకమైన స్క్రిజోఫినిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారించాడు. నాకు భయం వేసింది. నాకు దాహం తప్ప ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించా. కానీ అతడు వినలేదు. మెదడు మగతలో జారుకోవటానికి అంటూ కొన్ని మందులు ఇచ్చాడు.

వారం ఎలా గడుస్తుందో మీరూ చూశారు. వారాంతంలో తప్ప మాకు సొంత పనులకు టైముండదు. అందుకే శనాదివారాల్లోనే మా షాపిం‌గ్ అంతా చేసుకుంటాం. మీరు గుళ్ళూ గోపురాలూ తిప్పమంటే నేను కాదనలేదే. మా మేనేజరుతో మాట్లాడి, సెలవు తీసుకుని వెళ్దాం అని అన్నాను. అక్కడ లాగా అలా అనుకుని ఇలా వెళ్ళిపోవడం కుదరదు. అందుకని ఆపై వచ్చే శనాదివారాలు వెళ్దామని అన్నానే కాని వద్దని అనలేదుగా! ఆ మాత్రం దానికే అంత మాట అనాలా?

అక్కడ! వెలసిపోయినా పాత చీరలో
కళ్ళు చికిలించి
పగుళ్ళిచ్చిన అరిపాదంపై పెగిలిన

చర్మాన్ని, నీ వొణికే వేళ్ళతో లాగుతూ
గేటు వంకా, ఆపై
వీధి వంకా, మాటి మాటికీ చూస్తూ

హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టు‍గా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.

ఊరికే ఉండడం కన్నా
క్షేమమైన దారేదీ లేదనుకుంటా ఇక్కడ.
క్షేమం అంత అవసరమా అని ప్రశ్న
జవాబు తెలిస్తే
వెయ్యి లోకాలకి ఒకేసారి తెరుచుకుంటావు
స్వేచ్ఛ లోకి వెళ్ళటం ఉన్మాదమా
అంటావు భయం భయంగా

చూపుడు వేలుకు గోరునామ
తడ తడ పెట్టినట్టు బాధ పడడం ఎందుకు
ఇంతకీ ఏమైంది అనడిగాను.

మా చిన్నన్న చేయించి
తీసుకొచ్చి ఇచ్చిన వస్తువు
విరిగిపోయిందంది.

మొసళ్ళ వంటి మనుషులకు
కట్టుకథల చేపలు విసిరి ఇద్దరం
సాయంత్రాలు పూచే పసుపు ఎండలో
తడిసినప్పుడు
నిరీక్షలు చొక్కాల్లా ఆరేసి
చలి నీడల కంబళిలో తలలుంచి దాక్కున్నప్పుడు

నువ్వొక పల్చని కాగితమై వస్తావు
నేను కుంచెనై
నీకు వేవేల రంగులద్దుతాను

నువ్వొక మట్టి ప్రమిదై వస్తావు
నేను చమురై
నిన్ను దేదీప్యమానంగా వెలిగిస్తాను

రోజువారీ జీవితం
నీ ఊహల్ని చెదరగొట్టకముందే
ఆ రాత్రికో తర్వాతరోజు ఉదయానికో
వేళ్ళు ప్రసవించనీ

అప్పుడిక మళ్ళీ నువ్వు
నీ చెట్టురూపంతో సహా అదృశ్యమైపోవచ్చు

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

ఇక్కడ నేనిస్తున్నది మక్కికిమక్కి అనువాదం కాదు. ముఖ్యమైన భాగాలను సరళీకరించి మూలం నాటకరూపంలో వున్నా ఇక్కడ కథారూపంగా ఇచ్చాను. ఇది చదివాక ఇంకా వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగినవారు మూలాన్ని గాని లేక తమకు నచ్చిన అనువాదాన్ని గాని చదువుకోవచ్చు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మంగళకైశికి రాగంపై చేసిన ప్రసంగం; లలిత సంగీతం అంటే ఏమిటి? నలుగురు ప్రముఖుల – రజని, మంగళంపల్లి, ఈమని, ఎమ్. ఎన్. శ్రీరాం – అభిప్రాయాలు, ఆలిండియా రేడియో ప్రసారం; మరికొన్ని లలితగీతాలు, ఈ ప్రత్యేక సంచికలో మీకోసం.