ఉగాది కవిసమ్మేళనాలు

ఈ సంచికలో రెండు అపురూపమైన ఉగాది కవిసమ్మేళనాలను సమర్పిస్తున్నాను. ఇవి 1964, 1969 సంవత్సరాలలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డయినవి. తల్లావఝల శివశంకరశాస్త్రి, వెంపరాల, జరుక్ శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆరుద్ర లాంటి వార్ల గొంతుకలు, వారి కవితలు వినటం ఒక ఎత్తైతే విశ్వనాథ వారి పద్యపఠనం మరొక ఎత్తు. నాటకాల్లోను, సినిమాల్లోను పద్యాలు పాడే తీరే సరయినదని చాలామంది నమ్ముతున్న ఈ కాలంలో అసలు పద్యం ఎలా చదివేవారో, అసలు ఎలా చదవాలో విశ్వనాథగారి నుంచి మనం నేర్చుకోవచ్చు. 1964 సమ్మేళనంలో వేలూరి, జరుక్ శాస్త్రి, వెంపరాల, విశ్వనాథ, తుమ్మల; 1969 సమ్మేళనంలో, విశ్వనాథ, ఆరుద్ర, షేక్ దావూద్ సాహెబ్, సి. నారాయణ రెడ్డి తదితరులు తమ కవితలను చదివారు.

    • ఉగాది కవిసమ్మేళనం 1964.
    • ఉగాది కవిసమ్మేళనం 1969.