రాజు తన జీవితం గురించి చెప్పిన తరువాత నాకు కూడా అదే పద్యం గుర్తొచ్చి వాణ్ణడిగాను. ‘ఇండియన్లు అమెరికా జేరడమంటే ఆకాశాన్నందుకోవడమేనని నిర్ధారిస్తే, నువ్వేమిటి ఇలా ఆకాశాన్నుంచీ మెట్లు దిగుతూ వచ్చి ఇక్కడ అడవుల్లో చేరావ్? ఒక యూనివర్సిటీ వాళ్ళు కాదంటే నీకున్న పేరుతో ఇంకో యూనివర్సిటీకి వెళ్ళచ్చు. అలాగే, ఒక కాలేజీ వాళ్ళు కాదంటే ఇంకొక కాలేజీకీ, ఒక హైస్కూల్ నచ్చకపోతే ఇంకొక హైస్కూల్ వెళ్ళి వుండచ్చు గదా?’

ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది. ‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.

పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.

సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు. సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

భాష తెలియడమంటే నిఘంటువులో పదాలు, వ్యాకరణ సూత్రాలూ తెలియడం మాత్రమే కాదు. వాక్యవిన్యాస రహస్యాలు తెలియాలి, నుడికారంలోని సొగసులు తెలియాలి, పలుకులోని కాకువు తెలియాలి. అవి తెలియాలంటే పండితుడయితే సరిపోదు, జనవ్యవహారంలో నిత్యం ప్రవహించే పలుకుబడి వంటబట్టాలి. అందుకే విశ్వనాథ ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అన్నది. పోతన కన్నా గొప్పగా తెలుగులోకపు పలుకుబడిని పట్టుకొన్న కవి ఎవరున్నారు!

బుడిబుడి అడుగులేసే
నా పద్యాన్ని ఎత్తుకుని,
పాలుగారే బుగ్గల్ని చిదిమి
రెక్కల కింద చేతులేసి ఎన్నిసార్లు ఎగరేశానో!
ఎన్ని నవ్వుల్ని మూటగట్టుకున్నానో!

సెయింట్ జార్జి కోటలో నున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పనిచేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలులో పని చేసినప్పటికీ, కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది.

ఆంధ్ర శబ్దం జాతివాచకంగా భాషావాచకంగా మనకు అర్వాచీనంగా సిద్ధిస్తే అంతకు ముందు మన భాషకు తెలుగు అనిగాని తెనుగు అనిగాని వ్యవహారంలో ఉండాలి. కాని ఈ శబ్దాల ప్రాచీనత మీద, వ్యుత్పత్తి మీద చాలా సందేహాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తెలుగు ప్రాచీనమన్నారు. మరికొందరు తెనుగు ప్రాచీనమని వాదించారు.

Many native speakers of Telugu are hardly aware that words such as chirunāmā (చిరునామా), chukkāni (చుక్కాని), darjā (దర్జా), maidānam (మైదానం), rahadāri (రహదారి), rangu (రంగు) and salahā (సలహా) like more than a 1000 others, are of Turkish, Arabic and Persian origin; and that Telugu is made up of 65% Sanskrit words.

ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాక, తానే ప్రియుని సంకేతస్థలమున కలసికొనునది రెండవ రకమైన అభిసారిక. గూఢముగా వెన్నెలరాత్రులలో నభిసరించు స్త్రీకి జ్యోత్స్నాభిసారిక యనియు, అట్లే చీకటిరాత్రులలో నభిసరించు స్త్రీకి తమోభిసారిక, లేక తమిస్రాభిసారిక యనియు పేర్లు.

తెలంగాణా పోరాటం, ప్రజల ఇక్కట్లు, తాను చదువుకొంటున్న సోవియట్ విప్లవ విజయాలూ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త్రుత్వం సోసును బాగా కదలించి వేశాయి. మార్పు కోసం, ప్రజలపక్షాన నిలవడానికి తన్నుతాను సిద్ధం చేసుకొన్నారు.

ఇటీవలే మరణించిన ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు అయిన ఆవంత్స సోమసుందర్ (1924-2016) జ్ఞాపకార్థం 1967లో వచనకవిత పై వీరు ప్రచురించిన ఒక వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాం.

ఇజాలు రాసే వాళ్ళంతా వాటిని పాటిస్తారని హామీ ఏదీ లేదు. నా వరకూ నేను మానవ ప్రవృత్తిని, స్వభావాన్ని పరిశీలించడాన్ని చిత్రించడాన్ని ఇష్టపడతాను. మనుషుల సహజ స్వభావం ఎలా ఉంటుందో కథల్లో యదాతథంగా చిత్రించడానికే నా ప్రాధాన్యం. నేను రాసింది కూడా అవే!

ఈ అరుదైన యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసినది.

20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా అబ్బూరి రామకృష్ణరావుగారి పేరు తెలియకుండా వుండదు. శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని ప్రశంసించేవాడు.

మీరు కూసి ఒక కోడిని లేపండి
భుజంమీద ఒక రామచిలుకతో
ఉద్యోగానికి వెళ్ళండి
మీతో అల్లరి ఆటలాడే పిల్లితో కలిసి
ఒక మధ్యాహ్నం భోజనం చెయ్యండి