ప్రజల పాట, ప్రజల బాధ, ప్రజా ఉద్యమానికి ఇంతకన్నా పెద్ద కవిత్వం ఇంకేం ఉంటుంది? శివసాగర్ ప్రతీ కవిత వెనుకా ఒక నేపథ్యం ఉంది, ఒక వీరుడి మరణమో విజయమో ఉంది, ఒక ఆకలి బాధ ఉంది. ఏ పలుకూ ఊహామాత్రం కాదు, మరే పోలికా సత్యదూరం కాదు. ఒక్క కవిత కూడా జనసామాన్యపు నాల్కలమీద ఆడటానికి ఇబ్బందిపడిందీ లేదు.
మే 2019
ఏ కొద్దిమందో ఉంటారు. వారి భావాలు, ఆశయాలు, ఎంచుకున్న దారులు వంటివాటితో మనకు మమేకత ఉండకపోవచ్చు. పైపెచ్చు విరోధమూ ఉండవచ్చు. కాని, వారిని మనస్ఫూర్తిగా గౌరవించకుండా ఉండలేం. తమ ఆశయం పట్ల వారికున్న నిబద్ధత, అది సాధించడం కోసం చేసే నిరంతర పోరాటం, అహోరాత్రాలు జ్వలించిపోయే తపన, ప్రాణాలైనా అర్పించగల త్యాగశీలత, వారిని ప్రత్యర్థులు కూడా గౌరవించేట్టు, అభిమానించేట్టు చేస్తాయి. అలాంటి కొద్దిమందిలో ఒకరు శివసాగర్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కంభం జ్ఞానసత్యమూర్తి (15 జులై, 1931 – 17 ఏప్రిల్, 2012). సమాజపు అసమానతల పట్ల అసహనంతో విప్లవోద్యమ మార్గాన్ని ఎంచుకున్న ప్రతీ యువతీయువకుడి నోటా కదను తొక్కే కవితా పంక్తులు ఇద్దరు కవులవి. ఒకరు శ్రీశ్రీ, మరొకరు శివసాగర్. అయితే కేవలం కవిగా కలమే కాకుండా సైనికుడిగా ఆయుధమూ పట్టినది, ‘ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ కవి నేడు’ అంటూ విప్లవకవిత్వానికి దారి వేసినది శివసాగర్ మాత్రమే. వయోవిద్యాప్రాంతీయభేదాలనేవి లేకుండా జనవాహినిలో నినాదస్థాయికి చేరుకున్నది ఆయన కవిత్వం మాత్రమే. కవిత, పాట రెండు దారులుగా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో మొదటగా 1983లో ప్రచురించిన ఉద్యమం నెలబాలుడు ఎందరినో ప్రభావితం చేసింది. ప్రజలను కదిలించడంలో పాటకున్న బలాన్ని తెలుసుకున్న శివసాగర్ కలంనుంచి నరుడో భాస్కరుడో, చెల్లీ చెంద్రమ్మా, నల్లాటి సూరీడూ, ఓ విలుకాడ! వంటి పాటలు ఇప్పటికీ ప్రముఖంగానే ఉన్నాయి, ఇక ఎప్పటికీ ఉంటాయి. భూమీ ఆకాశం కలిసే చోట/ పొన్నపూలు రాలిపడిన చోట/ వీధిదీపాలు ఉరిపోసుకున్న చోట/ నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట/ తిరిగి వస్తాను/ తిరిగి లేస్తాను/ నాకోసం ఎదురు చూడు/ నాకోసం వేచి చూడు అని చాటిన ఆ విప్లవకవి వర్ధంతి సందర్భంగా ఈ సంచిక ఆయన స్మృతిలో వెలువరిస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అడగగానే నివాళి రాసి పంపిన నరేష్కుమార్ సూఫీ, బొమ్మ పంపిన అన్వర్, అరుదైన శివసాగర్ జైలు డైరీ ప్రతి పంపి సహాయం చేసిన గుర్రం సీతారాములుగార్లకు మా కృతజ్ఞతలు.
ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ…
ఉద్యమాన్ని నెలబాలుడుగా ఊహించటంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతున్నది. అలలపై కలలు కంటాడు. అలల పైనుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు. మిత్రద్రోహంచేత శత్రు చేజిక్కి తన ప్రజలకు చందమామ చేత సందేశం పంపిస్తాడు. ఏమని? ‘జీవితాంతం వరకు ప్రజలకు సేవలు చేయ విఫలమైనందుకు తన్ను క్షమించమ’ని.
ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.
మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.
ఇక మన ఇష్టాయిష్టాలను బట్టి ప్రాచీన సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంచుకోవచ్చుగాని, భీష్మించుకుని అవే ఆనాట వాస్తవరూపాలని మొండికెత్తడాన్ని ఏమనగలం? కాలగతిలో కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, తాత్త్విక గంధకం వీటిలోకి చేరడంలో ఆశ్చర్యంలేదు – మొత్తం ప్రతి అక్షరం పరమపవిత్రం అనుకోవడం, కాదు, మొత్తం అంతా చెత్త అని నేలకేసి కొట్టడమూ ఒకే రకపు జ్ఞానం.
పెద్దోడు ఆ ఎర్రరంగు బాల్‌ను గట్టిగా తన్నాడు, ఈ చిన్నోడు దాన్ని ఆపలేక దాని వెనకాలే పరుగెత్తాడు. ఇద్దరూ నైట్‌ప్యాంట్లు వేసుకున్నారు. ఇద్దరి కాళ్ళకూ బూట్లు ఉన్నాయి. పెద్దోడు నల్లచొక్కా తొడుక్కుంటే, చిన్నోడు టీ షర్ట్ వేసుకున్నాడు. చిన్నోడికి మొన్న మొన్నే హెయిర్ కట్ చేసినట్టుగా కొంత మొండి తల కనబడుతోంది. పెద్దోడి బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. వాడు పరుగెత్తినప్పుడు వాడి నల్లటి జుట్టు కూడా వాడిలాగే గంతులేస్తోంది.
కరుణను ఎన్నో విషయాలు బాధపెట్టేవి. తను ఒక్కతే కూతురు. చిన్నతనం చాలా వరకూ ఒంటరిగానే గడిచింది. వాళ్ళ నాన్నకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రోజు రోజూ చావుకు దగ్గరవుతూ చివరికి ఒకరోజు చచ్చిపోయినప్పుడు, తనకు ఎవరూ తోడు లేరు. తనకు అన్న, తమ్ముడు అంటూ ఎవరూ లేరు. ఆ లోటు పూరించడంలో తనకు బాగా దగ్గరగా వచ్చింది నేను, శ్రీనివాస్ మాత్రమే.
నెత్తురు కక్కుతోన్న
నాగేటి చాళ్ళ మీద
కాలం కసితో పెట్టిన నిశాని
పిచ్చివాడి పాదముద్ర
నీ దగ్గరకు రహస్యంగా వస్తున్న నాయకుల పేర్లు చెప్పమని హింస పెడుతున్నారు. నేను గదిలోంచి చూస్తూ ఉంటే ఉదయం అతని తల్లి, భార్య, పోలీస్‌స్టేషన్ గేటువద్ద నుంచుని ఏడుస్తున్నారు. ఉదయం నాకు వచ్చిన రొట్టెలు కూడా అతనికి పంపాను. నన్ను కోర్టుకు తీసుకొని పోతూవున్నప్పుడు అతనికి రహస్యంగా ధైర్యంగా వుండమని సైగ చేశాను.
నుదుటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి
గాలి ఈల నుండి, నీరెండ నుండి
మట్టివాసన నుండి, అట్టడుగు నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
వనవాసం చేయడానికి వస్తానన్న సీతను నివారించడంతో సీతకు రామునిపై కోపం వచ్చి స్వేచ్ఛగా ఇలా అన్నది: “రామా, నీవు పురుష శరీరంగల స్త్రీవి. నా తండ్రి నిన్ను ఏమనుకుని అల్లుడుగా చేసుకున్నాడో తెలియదు! నీవు ఏ దశరథాదుల హితం మాట్లాడుతున్నావో వారికి నీవు విధేయునిగా వుండవచ్చు గాని నన్ను వారికి విధేయురాలుగా వుండమనటం యుక్తం కాదు.”
అఫ్సర్ మనకు కవిగా తెలుసు. కవిగా మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ముస్లిమ్‌ల ఉనికి పట్ల మిగతా ప్రపంచం యే విధంగా స్పందిస్తున్నదో తెలిసిన సందర్భాలలో తన ధర్మాగ్రహాన్ని కవితల్లో కూడా చాలా పదునుగా వ్యక్తపరిచాడు. అయితే అది సరిపోలేక, బహుశా అతను కథలను ఆశ్రయించవలసి వచ్చింది. యెందుకంటే కవిత్వమూ, వచనమూ రెండు వేర్వేరు పనులు చేస్తాయి.
భగవానుడి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్న నందుడికి మొదటగా కనిపించినది, కాలుతున్న ఇనప స్తంభం. దానిమీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కోతి. స్తంభం మీద చేయి వేసినప్పుడల్లా కోతి చేయి కాలుతోంది. చేయి వెనక్కి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కోతి కాళ్ళూ చేతులూ నోరూ చెవులూ కాల్తున్నాయి.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్యతో 1995లో ‘వ్యాపకాలు జ్ఞాపకాలు’ అన్న శీర్షిక తో విజయవాడ రేడియో కేంద్రం 1995లో దంటు పద్మావతిగారు నిర్వహించిన సంభాషణ వినండి.
క్రితం సంచికలోని గడినుడి-30కి మొదటి మూడు రోజుల్లోనే ఏడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. జిబిటి సుందరి 2. కోడీహళ్ళి మురళీమోహన్ 3. బండారు పద్మ 4. అనూరాధా శాయి జొన్నలగడ్డ 5. వైదేహి అక్కిపెద్ది 6. అగడి ప్రతిభ 7. హరిణి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-30 సమాధానాలు, వివరణ.