మనుషులుగా మనం సంగీతం వినటం, చిత్రశిల్పాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం – ఒక సంస్కారం, సంస్కృతీ అని మనకు మనమే చెప్పుకోనిదే కళ గురించి మాట్లాడుకోవటం నిరర్థకం. ఇందుకే నోటికి వేమన, సుమతీ శతకాలు గడగడా వచ్చినట్టే కంటికి చిత్ర శిల్ప కళాఖండాలను చకచకా అప్పగించేట్టు చూడటం, చూపించటం అత్యవసర ప్రాథమిక చర్య, చికిత్స.
జూన్ 2017
అసలు ‘చూడటం’ మొదలుపెడితే ‘కనబడటం’ మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా మన కన్నే మనకు బోలెడు చెబుతుంది. అసలు ముందస్తుగా కళాత్మకమైనవాటిని, కళాఖండాలని, తరచుగా విరివిగా చూడటం అలవాటయితే సామాన్యులనే అసమాన్యులకి ‘కళ’ వీలయినంత దగ్గరవుతుంది – అంటూ ఈ సంచిక నుంచి చిత్రకళను పరిచయం చేస్తూ చిత్రకారుడు, కళావిమర్శకుడు అయిన తల్లావజ్ఝుల శివాజీ కళకాలమ్; సహజమైన బంధాన్ని సంకెళ్ళతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ సృష్టినే కోరుకోవడం గురించి వాయుగుండ్ల శశికళ కథ పునరావృతమ్; సంచారమన్నది మనిషి సహజ ప్రవృత్తి అయినపుడు, తమ ప్రయాణాల అనుభవాలను అక్షరరూపంలో నిక్షిప్తం చేయడమన్నది రెండువేల సంవత్సరాలుగా సాగిపోతున్నపుడు, యాత్రాసాహిత్యమూ సాహిత్యమే నంటూ తెలుగులో వచ్చిన యాత్రాచరిత్రలపై విహంగవీక్షణం చేస్తున్న దాసరి అమరేంద్ర సమీక్షా వ్యాసం తెలుగులో యాత్రాసాహిత్యం; కవిసమ్రాట్ మొదటి నాటిక నర్తనశాల శబ్దతరంగాలలో…
“హెచ్-508, ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావ్? యూ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, యెస్? హ్యూమన్స్ చాలా తక్కువగా ఉన్నాం. మనందరం మరింత ఎఫిషియెంట్‌గా ఉండకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. అందువల్లనే కదా చాలా అన్‌నెసెసరీ ఎమోషన్స్ రెగ్యులేట్ చేస్తున్నాం గ్రోత్ ఛాంబర్స్‌లో పెరిగేప్పుడే. ఐ నో, అందరు హ్యూమన్స్ ఒకేలా రెస్పాండ్ కారు వాటికి. ఇఫ్ యూ నీడ్, ఐ కెన్ సెండ్ యూ టు..”
ఒక శిల్పాన్ని నిర్మించడమంటే, మనిషి ముక్కు చెవులు తెలిసేట్టు ఏదో చెక్కుకుంటూ పోవడం కాదు. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. పద్యమైనా అంతే!
మేమూ పిల్లలలమే ఒకప్పుడు
మాకూ సమయం తెలియని కాలం ఉండేది
లోకం తెలియని నవ్వులు ఉండేవి
తడిసిన చెంపలు తుడిచే చేతులు ఉండేవి
తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటినుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.
మంగళవారమో, బుధవారమో సాయంత్రం మా పిల్లలు ఆడుతూ ఆ దీగుడు తలుపు తెరిచారు. అందులో రెండు అరలీటర్ పేకెట్లు కనబడినై, జున్నయిపోయి! అంటే, యాదయ్య ఆదివారం నాడు మాకు పాలు వద్దని చెప్పిన విషయం మరిచిపోయి వుంటాడు కాబట్టి వేశాడు. పైగా ఖర్మకొద్దీ ఆ రోజున ఓనరంకుల్ గేటు తీయకముందే వచ్చివుంటాడు. లేదంటే, మా ఓనర్ వాళ్ళయినా చెప్పివుండేవాళ్ళు.
మిగతా భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిటని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే).
మబ్బులన్నీ
చెదిరిపోతే
సంచి కోసి
జల్లినారో
మినుకుమినుకు
తారలేవో
అలా కాలిఫోర్నియాకు పోవడం బాగా కలిసొచ్చింది ఇద్దరికీ. ఇద్దరికీ ఉద్యోగాలు వెంటవెంటనే దొరికేయి. జీతం ఆరెంకెల్లోకి, హెచ్-1 వీసా గ్రీన్ కార్డులోకి, గ్రీన్ కార్డు సిటిజన్‌షిప్ గానూ మారితే, రెండు కార్లు, అయిదు బెడ్రూముల ఇల్లు, ఇద్దరు పిల్లలూ ఒకదాని మీద ఒకటి వచ్చి చేరేయి. రెండేళ్ళకోసారి వర్ష మొగుడితోటీ పిల్లల్తోటీ ఇండియా వచ్చి వెళ్తోంది.
తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజనపూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్షసాక్ష్యం.
ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!
పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.
గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో
మీ అమ్మాయి, పెద్దది కాబోలు, బిందెతో నీళ్ళు తీసుకొస్తోంది. వెనకాల అబ్బాయి రాగిచెంబుతో నీళ్ళు తెస్తున్నాడు. వీళ్ళ వెనుక మీ చంటిది ఎఱ్ఱటి లక్క పిడత నిండా నీళ్ళుపోసి తలమీద పెట్టుకుని రెండు చేతులూ పైకెత్తి అతి పొందికగా, ఒక్క చుక్క నీళ్ళు పడిపోకుండా తీసుకొస్తోంది. నేను పలకరిస్తే ఆ ఆరిందా అంటూందీ… ‘బాంది… ఎవలింట్లో నీల్లు వాల్లు తెచ్చుకోలూ?’
మెయిన్ స్ట్రీమ్ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి.
“నీదేకాదు. నీలాంటి చాలామందే ఉన్నారు మరి. నేనింతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడిక ఏమీ చేయలేం! అయిదేళ్ళు ఆగాల్సిందే. తప్పదు. అప్పుడు గెలువు నువ్వు! ఇంతకింత గెలువు! గుర్తుంచుకో! మంచిముక్కపై పందెం కట్టు! నాకు చాలా పనులున్నాయి. నేను అందరినీ హెచ్చరించాలి!” బనీను మేధావి వేగంగా వెళ్ళిపోయాడు.
ఎండా కాలం మా మద్దులేటి వాగు పక్కన
చిన్ని చేతులతో ఇసుక తవ్వి
తీసిన చెలిమ లోంచి కడవ లోనికి
లోటా లోటా తోడుకున్న చల్లని నీళ్ళలో
ఒకే ఒక్క లోటా చాలు
మరి అరవయ్యేళ్ళు బతికేస్తాను జీవనదినై
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
గడినుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు: 1. పం.గో.కృ.రావు, 2. రవిచంద్ర ఇనగంటి, 3. సుభద్ర వేదుల, 4. కె. వి. గిరిధరరావు, 5. సుధారాణి. ఒక తప్పుతో సమాధానాలు పంపినవారు: పి. సి. రాములు, సూర్యప్రకాష్. విజేతలకు అభినందనలు.
ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ కొంత కుదించారు.