కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కాని, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.
అక్టోబర్ 2019
ఈరోజు తెలుగుభాష ఏ స్థితిలో ఉన్నది అన్న ప్రశ్నకు పతనమవుతున్నది అన్నదొకటే సమాధానం ఎవరిచ్చినా. ఏ దేశంలోనైనా, కాలంతో పాటు భాష తీరుతెన్నులు మారడం సహజం. కానీ, ఈ మార్పులను ఏ తరానికాతరం గమనించుకోవాలి. భాషను నిలబెడుతున్నవేవో, పతనానికి గురిచేస్తున్నవేవో చర్చించుకొని వాటిని నమోదు చేయడం, భావి తరాలకు భాష పట్ల మెలకువను, జాగరూకతను మప్పుతాయి. తెలుగు భాష స్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోందని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి కారణాలు వెదికి విశ్లేషించే దిశగా ఎవరూ అడుగులు వేయలేదు. అందుకే, తెలుగు వచనం కాలక్రమేణా ఎలాంటి మార్పులకు గురైంది? వాటి నేపథ్యమేమిటి? అన్న మౌలికమైన ప్రశ్నలకు కూడా, కనీసం రెండు శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే గానీ సమాధానం దొరకదు. ఈ బృహత్కార్యాన్ని వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ తలకెత్తుకొని, సమగ్రమైన తమ పరిశోధనా సారాన్ని మూడు భాగాలుగా సాగిన వ్యాసరూపంలో విశ్లేషించారు. తెలుగు భాష చరిత్రలో మొదటగా వినవచ్చే ప్రముఖులు పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల అభిప్రాయాలలో వైరుధ్యాల వల్ల తెలుగు భాషా వ్యవహారాలలో కలిగిన మార్పుల గురించి మొదటి భాగంలోనూ; స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం, తెలుగు దగ్గరకు వచ్చేసరికి ఏ రూపు తీసుకుంది? లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పిన తెలుగు ఇప్పటికీ కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అనే విషయాలు రెండవ భాగంలోనూ వివరించారు. ఇక, బళ్ళలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో గ్రాంథిక భాషావాదులు గెలిచిన తరువాతి పరిణామాలు ఏమిటి? వ్యావహారిక భాషను సమర్థించిన గిడుగు రామమూర్తి వాదం మనకు ఏ అదనపు సౌకర్యాన్నిచ్చింది? ఈ భాషోద్యమం తరువాత, తెలుగులో వచ్చిన మార్పుల్లో రేడియో, పత్రికలు, పత్రికా సంపాదకుల పాత్ర ఏమిటి? ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని విశ్లేషిస్తూ, మెరుగుపరుచుకోగలిగే మార్గాలను సూచిస్తూ రాసిన ఆఖరి భాగం ఈ సంచికలో. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో ఎంతో కృషి చేసి, ఈ వ్యాసాన్ని మనకు అందించిన రచయితలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఈ సంచిక నుండీ మానస చామర్తి ఈమాట సంపాదక బృందంలో ఒకరవుతున్నారు. వారికి మా హార్దిక స్వాగతం.
నిబంధనల ప్రకారం అర్ధగంట ముందు మాత్రమే వదిలెయ్యడానికి వీలుంది. దానికోసం తొమ్మిది మంది కాచుకుని ఉన్నారు. చివరి పది నిమిషాల వరకూ ఆరుగురు మిగిలారు. గంట మోగిన తర్వాత కూడా రాస్తూ ఉండిపోయిన వాళ్ళు ఇద్దరు. అన్నీ తీసేసుకుని, హాల్‌టికెట్ల ప్రకారం ఆర్డరులో సర్దుకుని, కవర్లో పెట్టేసుకుని, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తును జాగ్రత్తగా చేతుల్లో మోస్తున్నంత బరువుగా గదిలోంచి బయటకు.
కేవలం శారీరిక సామర్థ్యం, సాధారణమైన తెలివితేటలూ మాత్రమే కాదు, విజయాన్ని సాధించాలనే తృష్ణ, తిరుగులేని పట్టుదల ఉంటే వాటితో మన భవిష్యత్తును పడుగూ పేకలుగా మనమే అల్లుకోవచ్చు. విధి అంటే మనచేతిలో ఉన్న ఈ అల్లికే. ఈ అల్లిక ఎంత కష్టంగా ఉంటే, ఆ విజయం అంత తీయగా ఉంటుంది.
ఆహ్!నా లిబిడో పసిగట్టిన శరీరం! అమ్మాయి మంచి పట్టుగా ఉంది. ఉంటే ఏంటటా? పదడుగుల వెనక అబ్బాయి. బాడీబిల్డరల్లే ఉన్నాడే! ఇద్దరూ నల్ల టీషర్టులే. కూడబలుక్కుని వేసుకున్నారా? మొగుడూ పెళ్ళామేమో. కాకపోతే మాత్రమేం? అమ్మాయి టీషర్టుమీద రాసుంది. మాంగో. ఓహో! అంటే? ఏమనుకోవాలి? పెద్ద పెద్ద తెల్లటి అక్షరాలు. కింద? ఛీ. ఛీ. మర్యాద మర్యాద. అదేంటి?
ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.
కళ్ళు వెలుతురుకి అలవాటుపడ్డాక రైన్స్‌ఫర్డ్ ముందుగా చూసింది తనకి ఎదురుగా, నడుముదాకా వేలాడుతున్న చిక్కని నల్లని గడ్దంతో, మునుపెన్నడూ చూడనంత మహాకాయుడిని. అతని చేతిలో ఉన్న పొడవైన తుపాకీ గొట్టం సరిగ్గా తన గుండెకి గురిపెట్టి ఉంది. దట్టమైన కనుబొమలూ, గెడ్దం మధ్యనుండి రెండు చిన్నకళ్ళు రైన్స్‌ఫర్డ్‌నే సూటిగా చూస్తున్నాయి. అతను నల్లటి రష్యన్ యూనిఫామ్‌లో ఉన్నాడు.
నూటయాభై అడుగుల పొడవూ పాతికడుగుల ఎత్తూ ఉన్న బృహత్తర విగ్రహమది. ఒకప్పుడు ఈ విగ్రహం గుడి లోపల ఉండేదట. మామూలే… దండయాత్రలు, విధ్వంసాలు, పునర్నిర్మాణాలు. ఈ రోజుకు ఇలా ఏ నీడా లేకుండా మిగిలిందా విగ్రహం. మహాపరినిర్యాణం భంగిమ అది. ఈ విగ్రహమూ, అది ఉండిన గుడీ పద్నాలుగో శతాబ్దం నాటివనీ, 1767లో అవి బర్మీయుల దాడికి గురయ్యాయనీ చరిత్ర చెపుతోంది.
మిట్టమధ్యాహ్నం
అన్ని కిరణాలు పోగుచేసుకుని
జమ్మి చెట్టు మీద పెట్టుకున్నా
ఎవడైనా
నా జోలికొస్తే
అస్త్ర శస్త్రాలు సిద్ధం
మొదటి దొమ్మీ ఆ సందు మొదట్లో ఉన్న హోటలు దగ్గర జరిగింది. వెంటనే అక్కడ ఒక సిపాయిని కాపలాకని పెట్టారు. రెండో దొమ్మీ రెండో రోజు సాయంకాలం పచారీ దుకాణం దగ్గర జరిగింది. సిపాయిని మొదటి సంఘటనా స్థలం నుండి తప్పించి, రెండో ఘటనా స్థలం వద్ద కాపలా ఉంచారు. మూడో కేసు రాత్రి పన్నెండింటికి లాండ్రీ దగ్గర జరిగింది.
ఇన్నాళ్ళ మౌనాన్ని వీడి
రెక్కలు విప్పుకోవాలనీ
తలపుల్ని తెరవాలనీ
ఆకాశపుటంచుల్ని తాకాలనీ ఉంది,
ఒకే ఒక్క అవకాశం నాకివ్వవూ!
ఒకే ఒక్కసారి ఈ నిప్పుని ఆర్పేయవూ!
అదే నీవై నీలోకి నువ్వు
ప్రవేశిస్తావు: తనను తాను
ఉంగరం లాగా
చుట్టుకున్న ప్రపంచంలా.
ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డును
ఎప్పుడూ కలుపుతూ నిలువెల్లా
వంపు తిరిగిన దేహం: ఒక ఇంద్ర ధనువు.
నిజానికీ అబద్ధానికీ మధ్య
సరిహద్దును గమనించలేనపుడు
నిజంగానే ఓ గట్టి ఆలోచన చేయవలసిందే
తల్లడిల్లే హృదయానికి
ఏ ఆలంబనా లేనపుడు
నిను బ్రతికించే నిర్ణయమూ తీసికోవలసిందే
[ఈ సంచికలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన మాట మౌనం (1988) అన్న సంగీత రూపకం సమర్పిస్తున్నాను. దీనికి సంగీతం కూర్చినది శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ రూపకంలో రజనీకాంతరావు, మల్లాది సూరిబాబు, బాలకృష్ణప్రసాద్, చదలవాడ కుసుమకుమారి, విద్యుల్లత గార్లు పాడిన పాటలు వినవచ్చు. – పరుచూరి శ్రీనివాస్.]
క్రితం సంచికలోని వినాయకచవితి ప్రత్యేకగడినుడి-35కి మొదటి అయిదు రోజుల్లోనే ఏడుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అగడి ప్రతిభ, అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, జి. ఎస్. బద్రినాథ్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, వైదేహి అక్కిపెద్ది, జి.బి.టి. సుందరి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-35 సమాధానాలు, వివరణ.
రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని
అడుగుతాడు మనుమడు
నీకు నాకూ తాతలకు తాతే అతను
చూసుకుందుకు మనకు ఒక ఇల్లే
అతనికి ఎన్ని ఇళ్ళో
నువ్వు లేచేసరికే వచ్చేస్తాడు కదా
అని సర్ది చెబుతాను
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.