ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయశర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగానికి అనుబంధంగా ఈ నాటకాన్ని జత చేస్తున్నాను.
ఈ నాటకం 1977లో శ్రీ నల్లాన్‌చక్రవర్తుల కృష్ణమాచార్యుల నిర్వహణలో ప్రసారమయ్యింది. ఇందులో పాల్గొన్న కొందరు ప్రముఖులు: ఏలూరిపాటి అనంతరామయ్య (విదూషకుడు), కె. చిరంజీవిరావు (అగ్నిమిత్రుడు), వి.బి. కనకదుర్గ (మాలవిక), ఎ. కమలకుమారి (ఇరావతి), ఎం.నాగరత్నమ్మ (పరివ్రాజిక), ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (కంచుకి), వెంపట మల్లికార్జునశాస్త్రి (గణదాసుడు), చావలి వామనమూర్తిశాస్త్రి (హరదత్తుడు).
- భుజంగరాయశర్మగారి రేడియో ప్రసంగం.
- మాలవికాగ్నిమిత్రమ్ – రేడియో నాటకం