1.
సోబాన క్రొత్తయేటికి
నేఁ బాడగ బిలుచుచుందు రేదెసనైనన్
నా బాస నాదు కూతయు
లేఁబరమని మార్చబోనులే ఏటేటన్.
నేఁ బాడగ బిలుచుచుందు రేదెసనైనన్
నా బాస నాదు కూతయు
లేఁబరమని మార్చబోనులే ఏటేటన్.
2.
ఆమని కూతకే పిలుతు రాపయి నా బ్రతుకెట్టులున్నదో
ఏమయిపోతినో ఎరుగరిన్నియు గింజలు చల్లబోరు నా
మామిడి చెట్టుకున్ చిగురుమాయును కూయును కోయిలంచు నే
సామియు వీనులుంచడు కసాబిస మామిడిపండ్లు మెక్కుచున్

3.
క్రిందటి క్రొత్తయేడులకు కెవ్వున కూసిన తల్లిదండ్రులా
ముందరి తాత తాతలును బోయిన తెన్నున నేను బోయదన్
పెందలకాడ కూత విని పెంపుడు తల్లియు నన్ను ద్రోసినం
గొందలమందబోను కనుగొందును కూయుచు క్రొత్తయేటికై

4.
నలుపని కాదు గొప్పలకు నల్గురి ముందుకు రాము మాకునై
తల పయికెత్తి చూచినను దాగియె మావి గుబుళ్ళనుండి మే
తలకయి పోక లేఁజివురు తప్పక తిందుము మేలు కూతకై
అల వలికొండకూతుకు రవంతగ వెన్బడి కొల్తు మెప్పుడున్

5.
తొలి మలి సాలు పళ్ళెముల తూకపు ముల్లుగ నేను చూపగన్
విలువలు తప్పుచూపనని పెద్దరికంబును నాకొసంగి కూ
తలకయి నన్నె పిల్చెదరు దాటగబోయెడు సాళ్ల క్రిందు మీ-
దులె నడిపించుగా నడిమి తోచెడివారల యెచ్చుతగ్గులన్