జ్ఞాపకాలు కవితల్లాగో తీయని కలల్లాగో దుఃఖాంతపు నిర్వేదంలాగో మరెలాగో వుండటం ఒక ‘సంగతి’. కానీ జ్ఞాపకాలు పరిశోధకులకు పనికివచ్చే పాఠాలుగా వుండటం మాత్రం కవిత్వ ప్రయోజనాన్ని మించిన ఆవశ్యకం. మోహన్ గీసిన రేఖలూ క్రోక్విల్ గీతలూ సౌందర్య సమీక్షకు సిసలైన సుబోధకాలు.

డాక్టర్‌తో నీ సంభాషణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు. ప్రిస్క్రిప్షన్ కోసం హేండ్‌బేగ్ అంతా తిరగతోడుతావు. చివరకు దొరుకుతుంది. అందులో పైన నీ పేరు, వయసు రాసుంటుంది. ఒక పక్కగా నీ ఎత్తు, బరువు, బిపి వగైరా వివరాలు. పేజీ మధ్యలో నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ వుంటాయి. డాక్టర్‌కు కాఫెటేరియాలో నువ్వు విన్నవి కూడా చెప్పావు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా విన్నది గుర్తొస్తుంది నీకు.

అది ఆరవయ్యో దశకం. నేను టీనేజర్ని, పిల్ల విద్యార్థినాయకుణ్ణి ప్లస్ కార్యకర్తని. నేను కృష్ణశాస్త్రి కవితలకీ బొలీవియన్ జంగిల్ వార్‌కీ టెట్ అఫెన్సివ్‌కీ బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకులనుంచీ జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

గంభీరముద్రతో కదులుతున్న ఒంటరితనాలు
చిక్కగా కమ్ముకుంటున్న మబ్బుల గుంపులై,
చివరికి ఎప్పుడో, ఎక్కడో నిష్పూచిగా కురిసేందుకు
సమాయత్తమవుతున్నట్టే ఉన్నాయి!

‘సావిత్రి మంచిదనుకున్నాను. దొంగముండన్న మాట! తాతనాన్న చెప్పులు దొబ్బుకొచ్చేసింది. అందుకేనేమో… నేను రాగానే భయపడి చస్తంది! దాచెయ్యమనేమో అమ్మా అమ్మా అని చీరుకుంటోంది. నాదగ్గరా నీ దొంగేషాలు… హన్నా! ఎవరూ చూడకుండా ఈ చెప్పులు ఇంట్లో వేసుకుని తిప్పుకుంటూ తిరుగుదామనా? పాపం తాతనాన్న చెప్పుల్లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో… ఎన్ని ముల్లు గుచ్చూ పోయాయో ఏంటో!

‘సార్, మీరు కూడా ఏమన్న చెప్పదలిస్తే చెప్పండి సార్!’- సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు, మ్యూసిక్ సిట్టింగ్ గదిలోకి కాఫీలు అందించ పోయిన బోయ్‌తో- అప్పటికి గదిలో కూర్చున్న నిర్మాత తాలూకూ బంధు గణం తమ వాడు నిర్మించబోయే సినిమా సంగీతం ఎలా ఉండాలన్న విషయంలో ఆయనకు తమకు తోచిన సలహా ఇతోధికంగా అందచేస్తున్న నేపథ్యంలో.

మారిషస్ వంటి బహుభాషీయ దేశంలో భాషా సంపర్కంవల్ల ఇక్కడి తెలుగు భాషలో అనేక మార్పులు వస్తున్నాయి. భాషలో మార్పులు రావటం సహజం. కాని, వివిధ భాషల సంపర్కంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో, లేఖనంలో ఎన్నో దోషాలు వస్తున్నాయి. సాధారణంగా ఒకభాషలో శిక్షణ పొందేవాళ్ళకు ఆ భాషాప్రయోగం ఎటువంటి సమయ సందర్భాలలో చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఆ భాషా ప్రయోగం ఏ విధంగా చేయాలో స్పష్టంగా తెలియదు.

చద్దరు నాలుగు మూలలు
సరిగ్గా వచ్చేలా మడతపెట్టడం కూడా
చాలా పెద్ద విషయం అయినప్పుడు,
ఎంత చిన్న విషయానికైనా
నూటా ముప్పైరెండోసారి బాధపడటం

కొనండి. కొనండి. బొమ్మలు. కిచెన్ వేర్. సైకిళ్ళు. దుప్పట్లు. రగ్గులు. బొగ్గులు. డీల్స్! డీల్స్! భలే మంచి చౌక బేరము. ఆలసించిన ఆశాభంగము. మోడల్స్ ఓసారి ఉంచినవి ఇంకోసారి ఉంచరండీ ఇక్కడ. తర్వాత కొనుక్కుందాం అంటే మళ్ళా దొరకవండీ. మాయావిడ ఇదే పని మీదుంటాది. ఎక్కడెక్కడ ఏం డీల్స్ ఉన్నాయా అని. షీ ఈస్ వెరీ ఇంటెల్లిజెంట్ యూ నో?

ఆయన అన్నగారు ఇప్పుడెలా అని అడిగితే, కంగారు అవసరం లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకొని శారదాపీఠం ముందు కూర్చొని సరస్వతీ ధ్యాన నిమగ్నుడయ్యాడట పినవీరన. అతను ధ్యానంలో ఉండగా సరస్వతి ప్రత్యక్షమై శతఘంటాలతో కావ్యాన్ని వ్రాయడం మొదలుపెడుతుంది. ఇంచుమించు పూర్తి అవుతోందనగా, ఆ గదినుండి వస్తున్న దివ్యకాంతులను చూసి అన్న తలుపు సందునుండి చూసేసరికి, ‘బావగారు వచ్చారు’ అంటూ సరస్వతి అదృశ్యమవుతుంది.

ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా? గత ఏడెనిమిదేళ్ళుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్ళని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్ళను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహ అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.

డాక్టర్ వీళ్ళు లోపలికి నడిచి రావడాన్ని శ్రద్ధగా గమనించాడు. అతని వృత్తిలో పేషంట్ల నడకనీ బాడీ లాంగ్వేజ్‌నీ గమనించడం అతి కీలకమైన విషయం. కొన్ని సార్లు వచ్చినవాళ్ళ సమస్య ఏంటన్నది కూడా అందులోనే అర్థం అయిపోతుంటుంది. భర్తకి నలబైయేళ్ళుంటాయి. భార్య నాలుగేళ్ళు చిన్నదైయుండచ్చు అనిపించింది. వాళ్ళు వేసుకున్న ఓవర్‌కోట్ తియ్యలేదు. వాటిమీద మంచు ఇంకా పూర్తిగా కరిగిపోలేదు.

కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది.

వేశ్య అంటే వైశికీకళలో నిష్ణాతురాలైనట్టి స్త్రీ అని అర్థం. వైశికీకళ వాత్సాయన కామసూత్రాలలో వివరించబడిన ఒక ప్రత్యేక అంశం అంటూ రచయిత పేర్కొంటూ అదే పేరా చివరలో ‘ఇలాంటి ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానం ప్రాచీన కాలంలో వేశ్యలకు విశేషంగా ఉండడం వలన ఈ కళ వైశికీ కళగా ప్రసిద్ధి చెందింది’ అంటారు.

ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోనిది. కోరస్‌లో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు.

గడినుడి 11ఎంతో సులభంగా కనిపిస్తూనే ఎంతో కష్టంగా అయింది పూరకులకు. ఎవరూ చివరిదాకా పూర్తిగా చేయలేకపోయారు, సరిచూపు ఆప్షన్ ఇచ్చేదాకా. చివరకు గడి పూర్తిగా చేసి పంపిన రవిచంద్ర ఇనగంటి, శ్రీవల్లీ రాధిక, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల – ఈ నలుగురు విజేతలకు మా అభినందనలు.

గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.