రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

లలిత గీతాలు

రచన: పరుచూరి శ్రీనివాస్
ఏప్రిల్ 2018

ఈ నెలలో మరికొన్ని లలిత గీతాలు. ఇవన్నీ, ఒక్క పాట మినహాయిస్తే, విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు (live), వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.

మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. ‘స్వరముల తూగే ఘనరాగమవో’ అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) ఒకటి మాత్రం శ్రీకాంతశర్మగారు (ఎస్. బి. శ్రీరామమూర్తిగారి సహకారంతో) సంకలనం చేసుకున్న రెండు సి.డి.లలో జతపరచబడింది. కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే (అలాగే మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం) కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను. ఆయన పాడిన, సంగీతం చేసిన మరిన్ని పాటలు త్వరలోనే బయటికొస్తాయని ఆశిద్దాం.

తరువాతి రెండు పాటలు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుగారు రాసినవి. వీటిలో ‘మాటలే కవికి మూటలు’ అన్న పాట పాడింది పి. సుశీల. చివరిగా ఒక సంప్రదాయపు భజన పాట. నిజానికి ఈ పాట వెంకటరమణగారు తమ శోభనాచల బ్లాగులో ఆడియో సాహిత్యం పోస్టు చేశారు. అక్కడ లేని ఒక వివరం ఆ పాట పాడింది మల్లిక్, సుబ్బులక్ష్మి. ఇదే పాట హైదరాబాదు కేంద్రం నుండి పాలగుమ్మి విశ్వనాథంగారు బృందగానంగా రికార్డు చేశారు. దీన్ని నేను విశ్వనాథంగారి దగ్గర తీసుకున్నాను.


  1. బతుకు బరువు మోయలేక – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.

    //eemaata.com/Audio/apr2018/1.batuku%20baruvu_mOyalEka_NCVJagannadhacharyulu.mp3

  2. తొలికారు మేఘమా – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.

    //eemaata.com/Audio/apr2018/2.tolikaaru_mEghamaa_NCVJagannadhacharyulu.mp3

  3. ఆశలన్ని చుక్కలగుచు – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.
    //eemaata.com/Audio/apr2018/3.aaSsalanni_chukkalaguchu_NCVJagannadhacharyulu.mp3
  4. స్వరముల తూగే ఘనరాగమవో – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.

    //eemaata.com/Audio/apr2018/4.swaramula_tooge_NCVJagannadhacharyulu.mp3

  5. ఉన్నదిరా ఒకటున్నదిరా – గానం: ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు.

    //eemaata.com/Audio/apr2018/5.Vunnadiraa_OkaTunnadiraa_NCVJagannadhacharyulu.mp3

  6. వలపులు చిందగ వచ్చెనదే – గానం: శ్రీరంగం గోపాలరత్నం.

    //eemaata.com/Audio/apr2018/6.valapulu_chindaga_vacchenade.mp3

  7. మాటలే కవికి మూటలు – గానం: పి. సుశీల
    //eemaata.com/Audio/apr2018/7.%20maaTalE_kaviki_mooTalu_P.Susila.mp3
  8. శివుడు తాండవము సేయునమ్మ – గానం: మల్లిక్, సుబ్బులక్ష్మి.
    //eemaata.com/Audio/apr2018/8.Sivudu_taanDavamu_sEyunamma_subbulakshmi_Mallik.mp3
  9. శివుడు తాండవము సేయునమ్మ – గానం: కోరస్.

    //eemaata.com/Audio/apr2018/9.Sivudu_tanDavamu_sEyunamma_Chorus.mp3

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    వెంకటరమణ April 3, 2018 12:12 pm

    శ్రీనివాస్ గారు మంచి లలితగేయాలు అందించారు, ధన్యవాదాలు, వీటిల్లో 1,2,4 గేయాలకు సాహిత్యం “శోభనాచల” బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. మొదటి గేయం రచయిత బసవరాజు అప్పారావు గారు, రెండవ గేయం రచయిత కందుకూరి రామభద్రరావు గారు (“వేదన” పుస్తకం లోనిది).

  2. 2
    Chandana April 10, 2018 4:50 am

    ధన్యవాదములు. ఈ మాసపు పాటలు కూడా అందించాలని నా విన్నపము. సుశీల గారు పాడిన సంక్రాంతి పాట, ఋతువుల పాట మరియు అల నీల గగనాన అనే పాట post చెయ్యగలరని ఆశిస్తున్నాను.

  3. 3
    ACHARAM SHANMUKHA CHARY April 27, 2018 4:51 am

    ఈ లలితగీతాలను డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం లేదా ?

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వెంపరాల వారి సాహిత్య యాత్ర
  • మేఘసందేశం – ఆడియో రూపకం
  • మరికొన్ని అరుదైన పాటలు
  • చెలియలికట్ట: విశ్వనాథ
  • కొన్ని జానపద పాటలు

ఇటువంటివే…

  1. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు
  2. కృష్ణ: లలిత గీతాలు
  3. కరుణఁజూడు లలిత
  4. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి
  5. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం

ఏప్రిల్ 2018 సంచికలో ...

  • జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM
  • అందం
  • అది నాది
  • అద్దెకిచ్చి చూడు
  • ఆత్మావై పుత్రనామాసి
  • ఇంతులందఱు నింతయే
  • ఇదిగిదిగిదిగో నేను!
  • ఏప్రిల్ 2018
  • కొన్ని సార్లిలా…
  • గడి నుడి – 18
  • జ్వరగీతం
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం
  • నాకు నచ్చిన పద్యం: కవితాపానశాల మద్యం
  • పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి
  • బువ్వమ్మవ్వ
  • మంచు
  • లలిత గీతాలు
  • విమర్శ: ప్రచురణకు ముందు, తర్వాత
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16
  • సిలబస్: 3. ఊహ అనే ఇమాజినేషన్
  • స్మృతిలో…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16
అద్దెకిచ్చి చూడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.