శరణుల గరిమ
గగన విస్తీర్ణ గరిమ చంద్రుడెరుగును గాని
గాలి తిరుగు గ్రద్ద లెరుగగలవే?
నదుల గంభీర గరిమ నళినమెరుగును గాని
దరిని పెరుగు దర్భ లెరుగగలవే?
పుష్ప పరిమళ గరిమ భ్రమరమెరుగును గాని
చెట్టు చెరచు చెదలు ఎరుగగలవే?
చెప్పవయ్యా, చెన్నమల్లికార్జున!
నీదు శరణుల గరిమ నీవెరుంగుదువు గాని
గేదె పైన వ్రాలు ఈగ లెరుగగలవా?
గగనద గుంప చంద్రమ బల్లుదల్లదె,
కడెయలిద్దాడువ హద్దు బల్లుదె అయ్యా?
నదియ గుంప తావరె బల్లుదల్లదె,
కడెయలిద్ద హొన్నావరికె బల్లుదె అయ్యా?
పుష్పద పరిమళవ తుంబి బల్లుదల్లదె,
కడెయలిద్దాడువ నొరజు బల్లుదె అయ్యా?
చెన్నమల్లికార్జునయ్యా,
నిమ్మ శరణర నిలవ నీవె బల్లిరల్లదె,
ఈ కోణన మైమేలణ సొళ్ళెగళెత్త బల్లవయ్యా?
(187)
కాల్వల నీరాడునా కలహంస?
గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?
గిరియలల్లదె హుల్లుమొరడియల్లాడువుదె నవిలు?
కొళక్కల్లదె కిరువళ్ళక్కెళసువుదె హంసె?
మామర తళితల్లదె సరగైవుదె కోగిలె?
పరిమళవిల్లద పుష్పక్కెళసువుదె భ్రమర?
ఎన్న దేవ చెన్నమల్లికార్జునంగల్లదె
అన్యక్కెళసువుదె ఎన్న మన?
పేళిరె, కెళదియరిరా.
(189)
పరపురుషులు నాకు తుమ్మముళ్ళేనవ్వా!
పరపురుషులు నాకు తుమ్మముళ్ళేనవ్వా!
ముట్టలేను, వారి చుట్టు తిరుగలేను
నమ్మి, మెచ్చి మాట్లాడలేనవ్వ!
చెన్నమల్లికార్జునుడు గాక
కంటకదేహులు నాకు కంటగింపేనవ్వ!
ఎరద ముళ్ళినంతె పరగండరెనగవ్వా.
సోంకలమ్మె సుళియలమ్మె
నంబి నచ్చి మాతాడలమ్మెనవ్వా.
చెన్నమల్లికార్జుననల్లద గండరిగె
ఉరదల్లి ముళ్ళుంటెందు నానప్పలమ్మెనవ్వా.
(105)
చెరకు తీపి వీడి చేదెక్కునా?
అగరుచెక్కను నరికి అరగతీసిన గాని
నొగలి సువాసనను వదులుకొనునా?
చొక్కబంగారమును ముక్కలుగ కాల్చిన
వడలి వన్నె వీడి నలుపెక్కునా?
చేరి గానుగ త్రిప్పి చక్కెరగ మార్చిన
చెరకు తీపి వీడి చేదెక్కునా?
చెన్నమల్లికార్జునయ్య, నేను మునుపు చేసిన
చెడుగులెంచుటవలన హాని నీకేనయ్య!
నను పొలియించినను నీ పొందు వీడనయ్య!
చందనవ కడిదు కొరెదు తేదడె
నొందెనెందు కంప బిట్టిత్తె?
తందు సువర్ణవ కడిదొరెదడె
బెందు కళంక హిడియిత్తె?
సందుసందు కడిద కబ్బను
తందు గాణదల్లిక్కి అరెదడె,
బెందు పాకగుడదె సక్కరెయాగి
నొందెనెందు సిహియ బిట్టిత్తె?
నా హిందె మాడిద హీనంగళెల్లవ
తందు ముందిళుహలు నిమగే హాని.
ఎన్న తందె చెన్నమల్లికార్జునయ్యా,
నీ కొందడెయూ శరణెంబుద మాణె.
(199)
దేవుడున్నాడా?
పాలు లేక నెయ్యి ఉండునా లోకమందున?
సూర్యకాంతి లేక అగ్ని ప్రబలునా లోకమందున?
సర్వమహిమాన్వితుడు చెన్నమల్లికార్జునుడు
లేక నా ప్రాణముండునా, లోకమందున?
హాలు తుప్పవ నుంగి బేరాగబల్లుదె?
సూర్యకాంతద అగ్నియనారు భేదిసబల్లరు?
అపారమహిమ చెన్నమల్లికార్జునా,
నీనెన్నొళడగిప్ప పరియ
బేరిల్లదె కండు కణ్దెరెదెను.
(415)
ఆలించుము నా విన్నపము
ఆలించుము నా విన్నపము, లాలించుము నా విన్నపము
పాలించుము నా విన్నపము, చెన్నమల్లికార్జునా!
ఏలనయ్య నా మొరలు వినవేమయ్యా?
నీవుగాక వేరెవరూ లేరు నాకు, లేరు, లేరు, లేరు!
నాకు నీవే గతి, నీవే నాకు మతి, చెన్నమల్లికార్జునయ్య!
ఆలిసెన్న బిన్నపవ, లాలిసెన్న బిన్నపవ,
పాలిసెన్న బిన్నపవ.
ఏకెన్న మొరెయ కేళెయయ్యా తందె?
నీనల్లదె మత్తిల్ల మత్తిల్ల.
నీనె ఎనగె గతి, నీనె ఎనగె మతియయ్యా,
చెన్నమల్లికార్జునయ్యా.
(64)
భయపడుటే ఏలనయ్యా?
కొండ మీదనే ఇల్లు గట్టి
మృగములకే భయపడుటే ఏలనయ్యా!
సముద్ర తీరమందు ఇల్లు గట్టి
నురగలకే భయపడుటే ఏలనయ్యా!
సంతలోనే ఒక్క ఇల్లు గట్టి
శబ్దముకే భయపడుటే ఏలనయ్యా!
చెప్పవయ్యా, చెన్నమల్లికార్జునా!
లోకములో పుట్టిన పిదప
స్తుతినిందలకే భయపడుటే ఏలనయ్యా?
బెట్టద మేలొందు మనెయ మాడి,
మృగగళిగంజిదడెంతయ్యా?
సముద్రద తడియలొందు మనెయ మాడి,
నొరెతెరెగళిగంజిదడెంతయ్యా?
సంతెయొళగొందు మనెయ మాడి,
శబ్దక్కె నాచిదడెంతయ్యా?
చెన్నమల్లికార్జునదేవ కేళయ్యా,
లోకదొళగె హుట్టిద బళిక
స్తుతినిందెగళు బందడె
మనదల్లి కోపవ తాళదె
సమాధానియాగిరబేకు.
(302)