రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒక పాట – రెండు బాణీలు

రచన: పరుచూరి శ్రీనివాస్
మే 2017

ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, వాట్సాప్ కంటే ముందు, అసలు వెబ్ బ్రౌజర్లే లేని రోజుల్లో చర్చలన్నీ ఈమెయిల్ ద్వారానో, యూజ్‌నెట్ న్యూస్ గ్రూపుల్లోనో జరిగేవి. యూజ్‌నెట్‌లోనే recreation (rec.) విభాగం క్రింద శాస్త్రీయేతర సంగీతం, ముఖ్యంగా హిందీ సినిమా పాటలపైన చర్చలకు Rec.Music.Indian.Misc (RMIM) అనే గ్రూపు ఉండేది. తక్కిన భారతీయ చర్చావేదికలకంటే భిన్నంగా, ఉదాహరణకి తెలుగుకి సంబంధించిన స్కిట్ (Soc.Culture.Indian.Telugu – SCIT), ఇక్కడ చాలా మంచి చర్చలు జరిగేవి. (ఈ గ్రూపు ఈ మధ్యనే పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో ఏప్రిల్ 8-9తేదీల్లో చాలా మంచి సమావేశం కూడా జరిగింది.) 1996 ప్రాంతంలో ఒకసారి ఈ గ్రూపులోనే Tandem Songs అంటే ఒకే పాటని- సాహిత్యంలో కొద్దిగా మార్పులుండవచ్చు- వేర్వేరు గాయనీ గాయకులు, అదే బాణీలోనో లేక వేరే బాణీలోనే పాడటం పైన ఒక పెద్ద చర్చ నడిచింది. ఆ సందర్భంలో తెలుగు సినిమా పాటల్లో కంటే లలిత సంగీతంలో ఇలాంటి పాటలు చాలా యెక్కువగా కనిపిస్తాయి కదా అని నాకు తెలిసిన లలిత గీతాల్ని ఒక చోట రికార్డు చేయడం మొదలుపెట్టాను. ఆ సంకలనం లోనుంచి ఒక 5 పాటలు ఇక్కడ వినండి. ఇలాంటి లలిత గీతాలు కొన్ని వందలు వుండవచ్చు. బాగా ప్రచారం పొందిన పాటో (ఉదా. అమ్మదొంగా నిన్ను చూడకుంటే- పాలగుమ్మి విశ్వనాథం), లేక దేవులపల్లి లాంటి ప్రముఖ కవి రచనో (ఉదా. మ్రోయింపకోయి మురళి, ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది, ఆకులో ఆకునై, …) అయితే చాలా మంది పాడిన సందర్భాలు వున్నాయి.

ఈ క్రింది 5 పాటల్లో మల్లిక్, సుమిత్రగార్లు పాడిన ‘ఒదిగిన మనసున’ అన్నది చాలా అరుదైన రికార్డింగు. అందరికీ చిత్తరంజన్, కనకవల్లీ నాగేందర్‌గార్లు పాడిన వర్షనే తెలుసు. కానీ మల్లిక్, సుమిత్రల పాట ఆకాశవాణిలో అంతకుముందే రికార్డయ్యింది. అలాగే మల్లిక్ పాడిన ‘తందనాన’ (ఆయన స్వంత బాణీ) బాగా ప్రచారం పొందిన పాట. కానీ ఎం. ఎస్. రామారావు బాణీ ఆకాశవాణి టి.ఎస్. రికార్డుగా విడుదల చేసింది. సీత, సత్యవతి పాడిన ‘గోపీలోలుడు రమ్మన్నాడే’ కూడా అలానే టి.ఎస్. రికార్డుగా విడుదలయింది.


  1. ఆగుమా జాబిలీ సాగిపోయెదవు ఏలా – రచన: రావులపర్తి భద్రిరాజు.

    1. బి. వరహాలు //eemaata.com/Audio/may2017/aagumaa-jaabili_Ravulaparti-Bhadriraju_B.Varahaalu.MP3

    2. మల్లిక్ //eemaata.com/Audio/may2017/aagumaa-jaabili_Ravulaparti-Bhadriraju_Mallik.mp3

  2. గోపీలోలుడు రమ్మన్నాడే

    1. సీత-సత్యవతి //eemaata.com/Audio/may2017/gOpeelOluDu%20rammannaaDE_Sita-Satyavati.mp3

    2. గాయని? //eemaata.com/Audio/may2017/gOpeelOluDu%20rammannaaDE_Unknown_solo.mp3

  3. ఒదిగిన మనసున పొదిగిన భావమూ – రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.

    1. మల్లిక్-సుమిత్ర //eemaata.com/Audio/may2017/odigina-manasuna_Devulapalli_eemani_Mallik-Sumitra.MP3

    2. చిత్తరంజన్- కనకవల్లి //eemaata.com/Audio/may2017/odigina-manasuna_Devulapalli_eemani_Chittaranjan-Dr%20Kanakavalli%20Nagender.mp3

  4. తందనానా భళా తందనానా – రచన: అన్నమయ్య.

    1. ఎమ్. ఎస్. రామారావు //eemaata.com/Audio/may2017/tandanaana_annamayya_M.S.Ramarao.mp3

    2. మల్లిక్ //eemaata.com/Audio/may2017/tandanaana_annamayya_Mallik.mp3

  5. వచ్చెనదిగో వర్షసుందరి

    1. కె. శేషులత //eemaata.com/Audio/may2017/vacchenadigO-varshasundari_K.Seshulata.MP3

    2. గాయని? //eemaata.com/Audio/may2017/vacchenadigO-varshasundari_different-tune_Unknown-singer.mp3

    
   

10అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    SeelaSubhadradevi May 2, 2017 8:38 am

    మీ ఒకే పాట రెండు బాణీలు విన్నాను. మొదటిది నా దగ్గర మరో గాయని పాడిన మరో బాణీలో కూడా ఉంది. ఐదవ పాట మరో గాయని శ్రీరంగం గోపాలరత్నంగారు రాగమాలికలో పాడిన పాట. రెండవ పాట ఎందువలనో ఓపెన్ కాలేదు. ఇంత మంచి పోస్ట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు, పరుచూరి శ్రీనివాస్ గారు.

  2. 2
    విష్ణుభొట్ల లక్ష్మన్న May 9, 2017 1:35 pm

    శ్రీనివాస్:

    ఆద్భుతమైన లలితగీతాలు ఇవి! నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా బి. వరహాలు పాడిన “ఆగుమా జాబిలీ…” పాట ఒక 100 సార్లు విన్నాను. ఎంత చక్కని గొంతు ఈమెది? కొంచెం దగ్గర దగ్గరగా శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులా అనిపించింది.

    ఈ వ్యాసం టైటిల్ సరిగా లేదనిపించింది. ఇందులో కొన్ని పాటల్లో “ఒక పాట – రెండు బాణీలు” వినపడలేదు.

    1, 3 & 4 బాణీలు ఒకేలాగా ఉన్నాయి. మిగిలిన పాటలు కూడా జాగ్రత్తగా వినాలి.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. 3
    విష్ణుభొట్ల లక్ష్మన్న May 10, 2017 7:27 am

    “ఆగుమా జాబిలి…” పాట చాలా సార్లు విన్న తరవాత ఈ వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోతున్నా!

    ఈ పాటకి బాణీ ఇచ్చినవారు ఎవరో తెలియదు కానీ, “బేహాగ్” అన్న రాగంలో చాలా అందమైన బాణీ ఇది.

    జయభేరి సినిమా లో “యమునా తీరమునా, సంధ్యా సమయమున..” అన్నపాట బేహాగ్‌లో బాణీ కట్టబడింది.

    https://www.youtube.com/watch?v=C4fsDSxgOU0

    అలాగే ” తెరే సుర్ ఔర్ మేరే గీత్ ” అన్న ప్రముఖ హిందీ పాట కూడా బేహాగ్ రాగంలోనే కట్టడింది.

    https://www.youtube.com/watch?v=ljG6atDKyxo

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. 4
    Sreenivas Paruchuri May 15, 2017 4:52 pm

    సుభద్రాదేవిగారు: మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషించాను. మీరు గతంలో మాగంటి వంశీగారి వెబ్ సైట్ ద్వారా చాలా మంచి లలిత గీతాలు అందించారు. అందుకు మీకు కృతజ్ఞతలు! అలాగే ఐదవ పాట రెండవ వెర్షన్: “వచ్చెనదిగో వర్షసుందరి” పాడినది రత్నం గారని చెప్పినందుకు కూడా కృతజ్ఞతలు! “ఆగుమా జాబిలి” పాటను చాలామంది పాడారు. ప్రముఖ గాయని ఆరికరేవుల సునందాశాస్త్రి (మల్లాది సునంద)గారు పాడిన పాట ఇక్కడ వినవచ్చు.
    https://www.youtube.com/watch?v=qmC9vaOrO24

    లక్ష్మన్నగారు: వ్యాసం టైటిల్ సరిగా లేదన్న మాట నిజమే! నేను ఈ పాటలు పంపినప్పుడు Tandem Songs అని ఇంగ్లీషు మాటనే వాడాను. ఒకే పాట వేర్వేరు గొంతుకలు అనో ఒక పాట భిన్న గాయనీ గాయకులు అనో అనవలసిందేమో! . బి. వరహాలుగారి గురించి నాకు పెద్దగా వివరాలు తెలియవు. కానీ చిన్నప్పటినుంచీ విజయవాడ రేడియో స్టేషన్ నుండి ప్రసారితమయిన ఆవిడ పాటలంటే చాలా యిష్టం. ఆవిడ ఎక్కువకాలం విశాఖపట్టణం రేడియో స్టేషన్ లో పనిచేయడం వల్ల మరిన్ని పాటలు వినే అవకాశం లేక పోయింది. ఆవిడ పాటలు కొన్ని:
    ———
    అమ్మదొంగా నిన్ను చూడకుంటే (also Vedavati Prabhakar sang this, but I like this version even more)
    ఎక్కడివీ దరహాస చంద్రికలు ఎక్కడివీ మధుమాస గీతికలు
    ఎవరు మ్రోగించారు ప్రాంగణమ్మున గంట M.L.నరసింహంతో)
    కస్తూరి వాట్లను (కె.బి.కె మోహనరాజుతో)
    చరణాలు చరణాలు ముక్తిసోపానాలు
    దాసిగా నుంటకైనా తగనా (బసవరాజు అప్పారావు)
    స్వామిని ఎటులర్చించినచో!
    ———-
    మరో సంచికలో వినిపిస్తాను.

    — శ్రీనివాస్

  5. 5
    తః తః May 16, 2017 3:37 am

    శ్రీ పరుచూరి: “….ఆరికరేవుల సునందాశాస్త్రి (మల్లాది సునంద)….” వారు ముక్కామల సునందగా ‘చివరకు మిగిలేది’ సినిమా లో ఒక పాట పాడినట్టు గుర్తు.
    నమస్కారాలతో
    తః తః

  6. 6
    Sreenivas Paruchuri May 16, 2017 9:21 am

    ఆరికరేవుల సునందాశాస్త్రి (మల్లాది సునంద)….” వారు ముక్కామల సునంద

    Mea Culpa! Thanks for pointing the mistake, Vasudevarao gaaru! I guess you knew her (and her husband who taught at the AU engg. school) personally.
    Yes, she sang “చిన్నారి నీ మనసే …” in చివరకు మిగిలేది (1960). You also find her songs in కలిమిలేములు, కుంకుమరేఖ and పచ్చని సంసారం. She quit singing in films after marrying Prof. Sastry. You also find her on screen, in film: ChoriChori (RK, Nargis) playing వీణ for a థిల్లానా.

    Recently her grandson, who is into fusion music, has uploaded some of her songs to Youtube.

    Regards, Sreenivas

  7. 7
    తః తః May 17, 2017 12:26 pm

    “Mea Culpa!” — yes, Sri Paruchuri, and doubly so! For, Mukkaamala Sunanda is not Malladi Sunanda and తః తః is not Vasudeva Rao.

    regards
    తః తః

    Thanks for Chori – Chori info

  8. 8
    Gorusu May 20, 2017 7:02 am

    నేను విన్న మరో రెండు పాటల గురించి :
    1. రావు బాల సరస్వతిదేవి గారే “వినవే చెలి పిలుపు అల్లదిగో ” (బహుషా భుజంగరాయ శర్మ రచన కాబోలు ) అనే పాటని కొంత తేడాతో రెండు బాణీల్లో పాడారు. ఎందుకలా అని నేను ఎప్పుడో ఆమెను అడిగా – ఒకటి తెలుగు వారి ఆకాశవాణి కోసమని, మరొకటి బొంబాయి రేడియో కోసమని చెప్పిన గుర్తు. మీరు గమనిస్తే ఆ పాట రెండు బాణీలుగా ఉంటుంది.

    2. శ్రీ శ్రీ గారి “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములూ” పాట రేడియోలో ఒక బాణీతో, దూరదర్శన్ లో ఒక బాణీతో విన్నాను. శ్రీశ్రీ అభిమానులు కొందరు కట్టిన బాణీ కంటే నాకు దూరదర్శన్ లో వచ్చిందే నచ్చింది – వినడానికి శ్రావ్యంగా ఉంటుంది కూడా.

  9. 9
    విశ్వనాధ్ September 22, 2017 4:48 pm

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు,
    మంచి అనుభూతి కలిగించారు.

  10. 10
    విశ్వనాధ్ September 22, 2017 5:07 pm

    ముఖ్యంగా ‘ఒదిగిన మనసునా’ ఈరోజు ఎన్నిసార్లు విన్నానో. 70,80లలో రేడియోతో పరిచయమున్నవారికి గొప్ప అనుభూతి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేవి. ఏమైనా తిరిగి వాటిని అందుబాటులోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు
  • శ్రీమాన్ పుట్టపర్తి: నా జ్ఞాపకాలు
  • వేలూరిగారితో ఒక సంభాషణ
  • ఒక పాట – రెండు బాణీలు
  • సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు

ఇటువంటివే…

  1. రెండు కవితలు: ఆగిన పాట
  2. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర
  3. అజంతా రెండు కవితలు
  4. నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు
  5. బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు

మే 2017 సంచికలో ...

  • In Defence of Freedom
  • అదీ నేనే…
  • ఆవలి తీరం
  • ఒక పాట – రెండు బాణీలు
  • ఒకనాటి యువ కథ: కెరటాలు పలకరించాయి
  • గడి నుడి – 7
  • ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ
  • తెరచాటు-వులు: 4. మీరు సమర్ధులు గాన…
  • తెలుగు భాషా ప్రాచీనత
  • దేహి
  • నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస
  • నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం
  • పెంపకపు మమకారం: కాళీపట్నం రామారావు కథ గురించి
  • మే 2017
  • రామచంద్ర పుత్ర! రామభద్ర!
  • రామరసాయనము
  • రిటర్న్ పాలసీ
  • వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 5
  • సగమే పూర్తయిన ఓ కవిత
  • సరస్సు నవ్వు
  • సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఏప్రిల్ 2017
గడి-నుడి 6 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.