ఆదికావ్యావతరణం

ఈ ఆదికావ్యావతరణం గురించి: ఇలాంటి ప్రయోగం ఇంతకూ ముందు, తరువాత కూడా ఎవరూ చేయలేదు. రామాయణ అవతరణ కథను వాద్యగోష్ఠిలో వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతో మొదలుపెట్టి కొన్ని ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. చాలా పరిమితమైన సాంకేతిక సదుపాయాలతో (క్రౌంచపక్షి పడిపోతున్న ధ్వనిని N.Ch. కృష్ణమాచార్యులుగారు వయలిన్ పైన) రికార్డు చేయబడింది. ఇక్కడ వినబోయే రూపకం ఆకాశవాణి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయ్యింది. దీని సృజన లేక సృష్టి వెనుకనున్న కొన్ని వివరాలను రజనీకాంతరావుగారే (ఇంగ్లీషులో) వివరిస్తారు.

ఆంధ్రీ కల్యాణి, దేవసాళగం లాంటి వాద్యబృంద ప్రయోగాలు, కొండ నుంచి కడలి దాకా (1972) నుండి మేఘసందేశం (1978), ఆదికావ్యావతరణం (1992?) విశ్వయానం (1994?) వరకు చేసిన సంగీత రూపకాలలోని అనేక ప్రయోగాల గురించి వివరణాత్మకమైన వ్యాసం ఒకటి రావలసిన అవసరం ఉంది.