రజనితో రేడియో ఇంటర్‌వ్యూ

[రజని 1988లో ఆకాశవాణి వారికిచ్చిన ఈ ఇంటర్‌వ్యూ నా దృష్టిలో చాలా అపురూపమైనది. (ఇక్కడ unedited రూపంలో!) రజని సంగీత, సాహిత్య, వ్యక్తిగత వికాసాల గురించిన ఎన్నో వివరాలు వినవచ్చు. అంతకంటే, 1920-30ల నాటి తెలుగు సాహిత్య, సంగీత చరిత్రల గురించిన ఎంతో ఆసక్తికరమైన సమాచారం, ఉదాహరణకు భామనే సత్యభామనే అన్న ‘గొల్ల కలాపం’ లోని పాట ఒకప్పుడు ఆహిరి రాగంలో ఎలా పాడేవారో తెలుసుకొనవచ్చు. అలాగే, తొలినాటి రేడియో ప్రసారాల గురించి, ‘ఓహో పావురమా’ పాట (స్వర్గసీమ-భానుమతి-1945) పుట్టుక గురించి, ఈనాడు మనకు అందుబాటులో లేని కామదహనం (బాలమురళికృష్ణతో), హేమంత రాత్రి లాంటి రూపకాల గురించి, ఇంకా పదవీ విరమణ తరువాత చేస్తున్న పరిశోధనల గురించి కూడా ఈ ఇంటర్‌వ్యూలో మంచి సమాచారం ఉంది. – శ్రీనివాస్]

  1. మొదటి భాగం

  2. రెండవ భాగం