చా.సో. తో ముఖాముఖీ
మార్చ్ 2004 సంచికలో ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ వినిపించడం జరిగింది. కానీ అది అసంపూర్ణం. అప్పట్లో నా దగ్గర ఆ 15 నిమిషాల సంభాషణ మాత్రమే ఉండేది. ఈ మధ్యనే ఆ సంభాషణ పూర్తి నిడివిలో మిత్రుల సహకారంవల్ల లభించింది. అంతే కాదు, దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు కూడా దొరికాయి. రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.