(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. ) కవిత కాలజల సమన్వితమైన […]
మార్చ్ 2000
“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం!
క్రితం సంచికలో కొన్ని భాగవత పద్యాలను వినిపించాం. వాటికి అనూహ్యమైన అభినందనలు అందేయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు మాకెంతో ఆనందంగా ఉంది.ఇప్పుడు అన్ని పద్యాలను వినవచ్చు.
సాలూరు రాజేశ్వరరావు గారి గురించిన రెండు వ్యాసాలు ఆయన సంగీత జీవితాన్ని రెండు విభిన్న కోణాల్నుంచి చూసేవి ప్రచురిస్తున్నాం. వీటికి అనుబంధంగా శ్రీ సాలూరి యాభై ఏళ్ళ వెనుక పాడిన రెండు లలిత గీతాల్ని వినిపిస్తున్నాం. రసికశ్రోతలకు ఇవి శ్రవణపేయాలౌతాయని మా భావన.
“ఈమాట” ప్రారంభించటంలో ఒక ముఖ్యోద్దేశ్యం ఇంటర్నెట్ వల్ల కలుగుతున్న అద్భుత పరిణామాల్ని ఉపయోగించుకుని తెలుగు లలిత కళా వ్యాసంగాల్ని ప్రోత్సహించటం. కనుక ఇకనుంచి పాఠ్యరచనలతో పాటుగా శ్రవ్యరచనల్ని కూడ ఆహ్వానిస్తున్నాం. ఉదాహరణకు, కవితలు పంపేవారు వ్రాత ప్రతినే కాకుండా వారే కాని మరెవరి చేతనైనా గాని చదివించి / పాడించి పంపవచ్చు. అలాగే వ్యాసాలు, కథలు కూడా పాఠ్యరచనలుగానే కాక శ్రవ్యరచనలుగా కూడ ప్రచురించాలని మా ఆశయం. దీనికి స్పందించి రచయిత(త్రు)లు ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం.
ఆడియో పంపదలుచుకున్న వారు RealAudio format లో పంపితే బాగుంటుంది. అది వీలుకాని వారు మెయిల్లో కేసెట్ పంపవచ్చును. అలా కేసెట్ పంపదలచిన వారు ముందుగా ee_maata@yahoo.com అనే అడ్రస్‌కు ఈమెయిల్ పంపితే పోస్టల్ అడ్రస్ తెలియజేస్తాం.
ఈ సంచికలో ఎందరో ప్రముఖ రచయితల రచనలు ఉన్నాయి. సాహిత్య విమర్శ రంగంలో నిష్ణాతులైన శ్రీ యుతులు వెల్చేరు నారాయణరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ద్వా.నా. శాస్త్రి వంటి దిట్టలు వారి రచనల్ని ఇచ్చి “ఈమాట” ను సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. ఐతే కథకులు మాత్రం ఎందుకో ఇంకా మందకొడిగానే ఉంటున్నారు. ఇది విచారణీయమైన విషయం. ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడ మన భాష, సంస్కృతి బతికి ఉండాలంటే రచయిత(త్రి)లకు రచనలు చెయ్యవలసిన బాధ్యత మామూలుకన్నా ఎక్కువ ఉంటుంది మన అనుభవాల గురించి, సమస్యల గురించి, అన్వేషణల గురించి, ఆవేదనల గురించి మనం కాకపోతే మరెవరు రాస్తారు? రాయగలరు? ప్రవాసాంధ్రుల్లో రచయిత(త్రు)లే చాలా తక్కువ. వీళ్ళలోనూ రాయాలనే కోరిక ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ. ఆ కొద్దిమంది లోను సమయం చేసుకుని రాసేవాళ్ళు ఇంకా తక్కువ. భాషను, అనుభవాలను గుర్తుంచుకునే మార్గం ఇది కాదు. రచనాశక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఇది.
తెలుగు వారు సాధారణంగా ఏ విషయమైనా బాగున్నదని చెప్పటానికి ఎంతో సంకోచాన్ని, బాగు లేదని చెప్పటానికి పట్టలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, ఇది మన నైజం. ఐతే మనం ఉంటున్నది తెలుగునేల బయటగనక మనం ఉంటున్న ప్రాంతాల అలవాట్లు కూడ కొన్ని నేర్చుకోవటంలో తప్పులేదు. అలా, ఉత్సాహంగా చెప్పవలసింది ఏమీ కనిపించకపోయినా అప్పుడప్పుడు మీ అభిప్రాయాలు చెప్తుంటే అవి మాకు మార్గదర్శకాలుగా ఉంటాయి. మీ constructive criticism ను ఎప్పుడూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం.
(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మదనపల్లి కళాశాలలో ఉపన్యాసకులు. కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. “నవలా శిల్పం”, “కథాశిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” […]
(వెల్చేరు నారాయణరావు గారు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్ , మేడిసన్‌లో కృష్ణరాయ చైర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడిగా ఎన్నో గొప్ప రచనలు […]
(సాహితీ విమర్శకులుగా పరిశోధకులుగా, కవిగా ద్వానాశాస్త్రి తెలుగు వారికి చిరపరిచితులు. ఇకనుంచి “ఈమాట” సంపాదక వర్గంలో ఉంటూ ఇండియాలోని రచయిత(త్రు)ల మేలైన రచనల్ని “ఈమాట” […]
(కన్నెగంటి చంద్రశేఖర్ డల్లాస్ వాసులు. కవిగా, కథకుడిగా అందరికీ చిరపరిచితులు. కొత్త తీరాల్లో సరికొత్త ద్వారాలు తెరుస్తున్నారు తన రచనల్తో!) “మంచి సినిమా వస్తుంది […]
ఇప్పటి వరకు మనం దత్తపది, సమస్య ఈ రెండు అంశాల్ని సాధించటానికి వాడే పద్ధతుల గురించి కొంత విపులంగా చర్చించాం. ఈ పద్ధతుల్ని గట్టిగా […]
అనిల్ కుమార్! ఆఫీసులో స్టాక్‌మార్కెట్ గురించిన చర్చలన్నిట్లో అతనే లీడర్! కంపెనీ సియీవో దగ్గర్నుంచి గెరాజ్‌లో జానిటర్ల వరకు అతని సలహాలు తీసుకోని వాళ్ళు […]
(“నాసీ” గా జగమెరిగిన శంకగిరి నారాయణ స్వామి గారు కథకుడిగా తనకో ప్రత్యేక స్థానాన్ని తయారుచేసుకుంటున్నారు. అమెరికా జీవిత కథనంలో లోతుపాతులు చూపిస్తున్నారు.) కళాకారుడికి […]
(కె.వి. గిరిధరరావు గారు శాన్ డియేగో లో ఉంటారు. ఇండియాలో పత్రికలలో కవితలు, కథలు ప్రచురించారు. ) “ప్లీజ్ మరోసారి జాగ్రత్తగా వెదికించండి. ఆ […]
“ఈమాట” పాఠకుల కోసం ఈ శ్రావ్యమైన “భాగవత గానం” అందజేస్తున్నాం. పాడటానికి ఎంచుకున్న పద్యాలు, వాడిన రాగాలు ఇక్కడ ఇస్తున్నాం. Audio files శ్రీ శివరాం గారి copy righted material. కనుక దయచేసి వాటిని కాపీ చేసుకోకండి
(శ్రీ ఎ. వి. మురళి పాటలు, నృత్య నాటకాలు రాసిన వారు. హ్యూస్టన్‌లో ఉంటారు. ఆంధ్ర సాహిత్యంలో మంచి ప్రతిభ ఉన్న వారు. శ్రీమతి […]
(కాశీ విశ్వనాథం గారు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో పనిచేస్తారు. సాహిత్యం, సంగీతం, కూచిపూడి నాట్యాల్లో అభిరుచి, ప్రవేశం ఉన్నవారు.) ఒక ఐదు ఆక్షరాల పదం […]
“వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” వారు ఈ క్రింది రెండు ప్రకటనలను “ఈమాట” పాఠకులకు అందించమని కోరేరు. ఈ సమాచారం మా పాఠకులకు ఉపయోగకరంగా […]
(విన్నకోట రవిశంకర్ గారు “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. ప్రఖ్యాత కవి. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితా సంకలనం ప్రచురించారు. మరో సంకలనం సిద్ధం చేస్తున్నారు. […]
[పరుచూరి శ్రీనివాస్ నివాసం యూరప్ ఐనా SCIT ,తెలుసా లాటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందరికీ చిరపరిచితులు. తెలుగు భాష, సంస్కృతులకు సంబంధించిన అనేకానేక […]
ఈ సంచికలో శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి రెండు వ్యాసాలు — ‘షికారు పోయి చూదమా..’, ఓహో యాత్రికుడా..’– ప్రచురిస్తున్నాం. తియ్యటి బాణీల […]
(వాడవల్లి చక్రపాణిరావు గారు అమలాపురం S.K.B.R. కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. “మహాభారతంలో ద్రౌపది” అన్న అంశం మీద పి. ఎచ్. డి. చేశారు.) “పుట్టలోని […]
(వేమూరి వెంకటేశ్వరరావు గారు University of California, Davis లో పనిచేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథల్లోనూ, అందరికీ అందుబాటులో ఉండే “నిత్యజీవితంలో సైన్స్” రచనలు […]