ఊహలన్నీ ఊచలుగా
మారిపోయిన వైనాన్ని
సిరల్లో, ధమనుల్లో
పారే రక్తంలో
కలిసిన విషాన్ని
నీ నీలి కన్నుల దైన్యాన్ని
రచయిత వివరాలు
పూర్తిపేరు: తమ్మినేని యదుకులభూషణ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.
తమ్మినేని యదుకులభూషణ్ రచనలు
ఈమాటలో అక్టోబర్ 2017 సంచికలో, సి. ఎస్. రావ్ కవి తిలక్‍పై రాసిన వ్యాసం గ్రంథచౌర్యానికి లోనయింది. యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున తిలక్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాల సంకలనం తిలక్ సాహిత్యం – సందేశంలో, ఎస్. పి. యూసుఫ్, ఎం. సి. జె. అన్న రచయిత ఈమాటలో వచ్చిన వ్యాసాన్ని కొన్ని మార్పుచేర్పులు చేసి ప్రకటించారు.
సుదర్శనంగారి సతీమణి, స్వయానా పేరుపొందిన రచయిత్రి వసుంధరాదేవిగారు శ్రమకోర్చి ప్రేమతో పూనుకొని ఉత్తరాలన్నీ పద్ధతిగా పోగు చేసి, తగిన వివరాలు పొందుపరిచి ప్రచురించారు. గతాన్ని తెలుసుకొని భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకునే జిజ్ఞాసువులందరూ ఓపికగా ఒకటికి రెండు సార్లు తిరగేయవలసిన పుస్తకం.
సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు. సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వై. ముకుంద రామారావు గారికి ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైనారు. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి వీరిని ఎడంగా నిలబెడతాయి.
యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.
నాయన లేని ఊరిలో భయభయంగా అడుగు పెడతాను ఏ యాడికో అనంతపురమో కాదు ఖాయంగా నాయన ఇక రాడు. లెక్కలేనన్ని గూళ్ళతో ఎక్కి దిగిన […]
2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ ఆవార్డ్లు ప్రకటించాము. వీటికి గాను ఆలూరి భుజంగరావు గారు, రామినేని లక్ష్మి తులసి ఎంపికైనారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనతో పాటు తులసి కవిత్వ తత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పద్మలత కవితా సంకలనం “మరో శాకుంతలం” ఎంపికైంది. భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి పరిశోధనకు గాను బ్రౌన్ పురస్కారానికి కోరాడ మహాదేవ శాస్త్రి గారిని ఎంపిక చేసాము. పద్మలతతో మాటామంతీ.
గాలి వీచినప్పుడల్లా
పసిపిల్లల్లా
రోడ్డుకటూ ఇటూ
పరుగులు తీస్తాయి
రాలిన ఆకులు
వికృత నామ సంవత్సరానికి గాను ఇస్మాయిల్ అవార్డుకు గండేపల్లి శ్రీనివాస రావును, బ్రౌన్ పండిత పురస్కారానికి దీవి సుబ్బారావుని ఎంపిక చేశాము.
2009 బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని, ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ గారిని ఎంపిక చేశారు.
పరాయి భాషలో
పరిశీలకులకు
వివరిస్తున్నాడు
జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.
ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.
ప్రేమిస్తున్నాడో లేడో
నిమిషం గడిచేలోగా
ఉపపత్తి కావాలి !
నిరంతరం నిన్నే చూస్తుంటా
వృక్షాల కొమ్మల్లోంచి–
కళ్ళు చికిలించే సూర్యునిలా
పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్ అవార్డ్ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పూవొకటి” అనే కవితా సంకలనాన్ని ఎంపిక చేశారు. అక్టోబర్ లో విడుదల కాబోయే ఈ పుస్తకం నుండి రెండు చిన్న కవితలు.
చతికిల పడటానికే తప్ప
నిన్నెటూ తీసుకు వెళ్ళవు
బిగదీసి కళ్ళెం ఉరికించు గుర్రం పులికన్ను రక్తం ఒలికించునేమో.. ముదురు చీకటి క్షణకాల మాత్రం పొదరింట నేత్రం పసిగట్టునేమో.. వదులు కురులు సవరించు హస్తం […]
ఓడ కదులుతుంది ఓడి పోలేదు. కలలో కనిపించిన నామ క్కల్ ఏమని నమ్మ పలికింది? చెంత చేరిన చీకటి లాంతరు నీడలు పలుసార్లు తుడిచిన […]
కవిత రాయడం తోటి కవి బాధ్యత తీరిపోదు.. రాసిన ప్రతి ఒక్కటి కవిత ఐపోదు. ఇదో జీవసంకటం!రాసిన కవితకు ఎలాంటి మార్పుచేర్పులు అవసరం? కవిత […]
ఆనందంగా ఆడే పిల్లలను ఏనాడైనా చూశావా? తపతపమని నేలను తాకే వాన ఎప్పుడైనా ఆ చప్పుడు విన్నావా? గిరికీల సీతాకోకచిలుకను సరదాగా అనుసరించావా? మునిగిపోయే […]
ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, […]
గుబురు తగ్గని చెట్లు
ఖాళీ పాత్రల్లా
ఆకాశాన్ని ప్రశ్నిస్తాయి
నా కవితల్లా
కవాఫి(Constantine P. Cavafy)ఒక గ్రీకు కవి.కుటుంబ వ్యాపార రీత్యా ఈజిప్ట్ లోని అలెక్సాండ్రియాలో నివాసం. మన గురజాడకు సమకాలికుడు.అప్పుడు మన తెలుగులాగే గ్రీకులో కూడా […]
వంటగదిలో ఎన్ని తంటాలు ఎండతో! ఏటవాలు కిరణాలు వేటగాని చూపులా! వెలిగిపోయేవి ధూళికణాలు.. జ్ఞాపకముందా? ఊపిరాడేది కాదు పొగలో పదునెక్కని కిరణాలు సదయగా కిటికీ […]
చల్లబడి పోయింది అల్లాడని ఆకు వెన్నెల దర్పణం ప్రతిబింబాన్ని వెదుక్కునే ఆత్మ అలల మీద తెప్ప నల్లటిజ్ఞాపకాన్ని తుడిచివేసే సూర్యుడు వేకువ ఝామున కాకుల […]
ఎక్కడో వర్షాలు ఏటికి నీళ్ళొచ్చాయి. ఎండిపోయినా నిండుగా పారిన రోజులను మరచిపోదు ఏరు. కదిలిపోయిన నీరు ఎగుడుదిగుడు దిబ్బలను నిమిరి వెళ్ళింది.
పదాన్ని పట్టితెచ్చి.. పెడరెక్కలు విరిచికట్టి నల్లటి ముసుగు తొడిగి ఉరి తీసెయ్. మరణిస్తూ మరణిస్తూ గొంతు పెగల్చుకొని.. తన అర్థం చెప్పి జారుకొంటుంది. శవపేటిక […]
తడిచేతుల సముద్రం తడిమి తలబాదుకొంటుంది శిలలపై.. బడితెలేని బడిపంతులు పొడవాటి ఒడ్డు అదిలిస్తోంది చదవలేని కెరటాలను పచార్లు చేసేవారిని విచారం లేని చలిగాలి వీచి,పరామర్శిస్తుంది. […]
ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? నివారించలేను, సవారి గుర్రముసకిలించె నురగతో!! ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను. చేవ్రాలు చేయలేను! ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? […]
ఇసుకను మోసుకపోయే నది ఎండిపోయింది బండరాళ్ళు బయటపడ్డాయి. శబ్దం ఆగిపోతుంది ఆలోచనకు మొదలు అక్కడే.
అన్నీ మింగిన సముద్రం అలల చేతులతో పొట్ట సవరించుకొంటే ఒడ్డున ఒంటరి కుక్క ఎవరిని పిలుస్తుంది? హోరున కురిసే తుఫాను వర్షం పొగ చిమ్ముతు […]
ఏదో స్టేషన్ ఆగింది రైలు. ఇరువైపులా ఎరుపు దీపాలు. చలిగాలిలో కంకర రాళ్ళ మీద వంకర కాళ్ళతో పరిగెత్తే కుక్క. నిదురమత్తు వదలని వనిత […]
రంభలతో నిండి వున్న ముంబయికో నమస్కారం స్తంభంలా నిలుచున్న నన్ను చూడు పిండి వేసే విచారం. సరదాలకు హద్దుండదు పరిచయం లేని లోయల్లోకి పరికిణీ […]
నిశ్శబ్దం లో నీ నవ్వులు గలగల వినిపిస్తాయి ముసుగేసిన ఆకాశం ముసురు పట్టిన సాయంత్రం కిటికీ రేకులపై కురిసే చినుకుల్లా కరెంటులేని నిద్రపట్టని రాత్రి […]
విడిపోయే పొగమంచు రూపం సన్నని సన్నని రవం లీలగా దూరంగా వీణ శ్రుతి చేస్తున్న సవ్వడి.. ఇటురావా?ఇటురావా.. అన్న పిలుపులు గూటిలో వడిగిన పక్షులు […]
కాకి అరుపులు వినరావు ఇక ఈ గూడు ఖాళీ ఎటు పడితే అటు ఎగిరి పోతుందీ ఆకు ఏ గాలి దెబ్బకు కూలిందో ఈ […]
పాడుబడిన బావి తడి ఆరని నేల అడుగు నున్నది తాబేలు విడిపించు. గడచిపోయింది పగలు నడవనీదు నన్ను తొడలు కొరికే తోడేలు విడిపించు.
ప్రతిబింబం కదలదు నీ వంకే చూస్తుంటుంది అద్దాన్ని బద్దలు కొట్టినా.. అతుక్కున్న ఏదో ముక్కలో తొంగి చూస్తూనే ఉంటుంది. శిల్పంగా మారిన ప్రతిబింబం కదలక […]
చదరంగం బల్ల పరచుకొన్న నలుపూ తెలుపు గళ్ళు పెనవేసుకొన్న రేబవళ్ళు ఆట మొదలైన తర్వాత కదపకూడని పావును కదిపి నిలపకూడని గడిలో నిలిపితే పావే […]
మొరపెట్టుకొన్నాను. సముద్రం ఎదుట నిలబడి నురగలతో పాదాలను నిమిరి ఉప్పునీటి అలతో చప్పున మొహాన్ని చరిచి తనలో తాను అనునిత్యం కలహించుకొనే సముద్రం చెలియలి […]
నీవేదో పాట పాడుతుంటావు లేదా ఓ లెక్కతో కుస్తీ పడుతుంటావు కారులైటు చీకటిలో కనురెప్పను తెరచినట్టు రోడ్డంతా బురద కప్పను మింగుతుంది పాము నేను […]
మంచుకప్పిన కొండశిఖరం ఎక్కలేనిక ఎదురుగాడ్పులు చెప్పిరాదుగ చేటుకాలం లోయదాగిన ఎముకలెన్నో! ఒక్క కిరణం నక్కి చూడదు ఉడుకు నెత్తురు పారుటెప్పుడు? కునుకు పట్టదు నడుమ […]
నీ గదిలోకి ఎవరూ రారు టేబుల్‌సొరుగును తెరవరు ఆకుపచ్చని ఏకాంతాన్ని అనుభవించు. పొద్దుతిరుగుడు పూలు నిద్దురలో,కలలో సద్దు చేయవు. అరాచక ఆకాశాన్ని విరిగిన చంద్రుని […]
ఒక మధ్యాహ్నం ఎండ కనురెప్పలు కాల్చినట్టు గుండ్రని నవ్వుల గోళీలు రాచుకున్నట్టు ఎర్రని మెట్లపై ఎపుడూ పాకే నీరు పలక పగుల గొట్టే బాలుడు […]
ఎగురలేని గాలిపటం తోకలా కొబ్బరి చెట్టు నదిపై ఎండ భూతద్దంలో దూరిన కిరణం నీ తలను కాలుస్తుంది పీతలను తరుముతుంది! గుబురు తోపు వెనుక […]
ఘడియఘడియకూ నన్ను చూడకు అప సవ్యదిశలో తిరిగే గడియారాన్ని నేను గడచిన కాలాన్ని వడగట్టి రేడియం కళ్ళతో నడచిపోతాను.
ఏ సబబు లెరుగని సర్పం విసర్జించి కుబుసాన్ని గడ్డిచేలలో అడ్డంగా పడి పారిపోయింది. అతి తెలివైన సర్పం నీతి నియమాలు ఆలోచిస్తూ కుబుసాన్ని వదలక […]
ౖజెలుగోడలు జలదరింపగ గూబలన్నీ కలిసి కూయగ తాచుపాములు తలలు తిప్పగ పెద్దగా విలపించె ఖైదీ తెరలు తెరలుగ వేడి ఊపిరి కాలి గొలుసులు ఒరుసుకొనగా […]
రంగులు మార్చే కొండను వీడి, నిదురలోయలోకి జారిపోయే రాయిని నేను అలసిపోని సెలయేరు పరుగులెత్తే వేళ్ళతో అరగదీస్తుంది నన్ను
ఒక్కరోజా పూవును చేతబట్టుకొని తప్పకవస్తాను నీ చెంతకు విచారించకు నేస్తం ఊపిరిని ఏ ఉమ్మెత్తపూవుల వాసనలో కలిపేసి నీ ఇంటిముందు..ఏ నీపతరుచ్ఛాయలోనో నిశ్చలంగా నిదురిస్తున్న […]
పేరు తెలిసిన చేపను నే పట్టలేను ఆకొన్న జాలరులు ఆ చేపలపై వలలు పన్నుతారు తిమిరాలు కప్పుకొన్న తిమింగలాలు బరువు నే మోయలేను. ఈదేటి […]
పనికిరాని మాటలతో ప్రపంచం మూగదైపోయింది భరించలేని వెలుగులతో ప్రపంచం చీకటైపోయింది ఊహించలేని వేగాలతో ప్రపంచం చిన్నదైపోయింది . నిదురపో చిన్నీ..నిదురపో వలసకొంగల్లా చుట్టూవాలిన మనుషులను […]
చిరునవ్వు చారల చొక్కాని తిరగేసి తొడుక్కుని రోజూ అందరూ తిరిగే రోడ్డును దాటుకు వెళిపోయావు. గిరికీల నీ పాట ఎరలేని గాలంలా వేలాడుతుంది.
తేనెటీగలు లేచిపోతాయి… కబోదికళ్ళతో మైనం తుట్టె మిగిలిపోతుంది విందు ముగిసిపోతుంది… ఖాళీగాజు గ్లాసు స్వగతం వినిపిస్తుంది బస్సూ బయలుదేరి వెళ్ళిపోతుంది… అరటితొక్క కాలుజారి పడే […]
చీకటిగదిలో ఆకలి చలిలో ఏకాకివి వికారంగా వాంతి కీకారణ్యంలోకి అడుగు పెడతావు మనుషులతో పని ఏమి? తనువును మోసే గాడిదలు ఆదర్శాలు గుదిబండలని దేవుడు […]
రక్తసిక్త వదనాలు రాబందుల శిల్పాలు చీకటి మేడలు అంతుచిక్కని కూపాలు వెనుదిరిగి చూస్తావేం ? పగిలిన గాజును తాకకు గాజు కన్నును పెకలించకు చీలిన […]
అలారం మోగుతుంది అందరూ లేచిపోతారు దీపాలు మౌనం వహిస్తాయి చీకటి తడుముకొంటుంది మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి మంచును ప్రేమించిన పర్వతారోహకులు,హిమకౌగిలిలో..మరిలేవరు! పొరుగుదేశం […]
పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి మళ్ళల్లో ఎగిరే పక్షులు మెరవని రావి ఆకు వుందా? వరికంకుల యవ్వనం వాలిపోతుంది. ఎంగిలి చేయని నీరు వణుకుతు పారే […]
ఎన్ని నాళ్ళ అనంతరం గురుతుకు వస్తుంది తిరువనంతపురం ఏ రుతువులోనైనా ఛాయలేని తరువుంటుందా ? చిరుకప్పలా ఎగిరి దూకి.. ఎన్ని నాళ్ళ అనంతరం గురుతుకు […]
1. ఎంతగా తడిపి వెళ్ళావు! నిత్యమూ ఎండలో నిలుచున్నా ఆరని తడి 2. చేతిలో వేడెక్కిన లాంతరు అలసట నీడలు ఎక్కడ ఆగను?
ఒక్క రాత్రిలో పర్వతాలను కదిలించకు మహావృక్షాలను పెకలించకు నిశాగానం విను అరమూసిన కన్నులతో నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు నురగల అంతరంగం..అలల సద్దు మెరిసే […]
వర్షం వచ్చి నిలువునా నన్ను తడిపి వెలిసిపోయింది. తెప్పరిల్లిన ఆకాశం కింద నీ నవ్వులు కాగితప్పడవలై తేలిపోసాగినయ్ .
నిద్రించని జలపాతం రాత్రి సమయాల్లో చెవులొగ్గిన శిలల మీద పడి గెంతడంఎవరు చూస్తారు? వడి తగ్గిన దేవాంగ్‌నది శిగపూవులతో చీకటిలోయల్లోకి పయనించడంఎవరు చూస్తారు? నడినెత్తిన […]
నీతో కలిసి పయనిస్తూ వచ్చిన పెట్టెలను మోస్తూ.. నీ ముందు కూలీ బరువెక్కిన పాదాలతో ఆ వెనుక అనుసరిస్తూ నీవు చేరవలసిన చోటువైపు ఉరకలేసే […]
ఆకురాలు కాలమని మరిచాను నీ కుమారుణ్ణి నేను సుకుమారంగా చూడలేను కాకులరుస్తున్నాయి. మృత్యుపేటికలో మెరిసే ముత్యం యుద్ధం!! భూమిలో బిగుసుకొనే వేళ్ళ పిడికిళ్ళు.. నిటారుగా […]
భూమ్యాకర్షణలేని శూన్యావరణం చేరి భారరహిత స్థితిలో బాసిపట్టు వేయగలను. మోయలేని బరువుతో మోకాలి నొప్పితో మూలనున్న మంచమెక్కి ముసుగు తన్ని పడుకొంటాను.
ఎండిన చెట్టు నీడన రాలిన శిథిల పత్రాలు నగ్న పాదాలతో చప్పుడు చేస్తూ నడుస్తూ వెళ్ళకు అవి నీ ప్రతిబింబాలు ఏరుకొని భద్రంగా గుండెమీది […]
మీ కొళాయి..గరగర కసరదు మొహం చిట్లించుకోదు కోపగించుకోదు ధ్యానముద్రలో..ఒకేధార! నురగలు గిరగిర తిరిగే నిండిన బిందెను ఎత్తుకోవడమే మీకు తెలుసు అసలు నిండని బిందె […]
మాటలన్నీ ఆపి గదిలోకి ప్రవేశిస్తాను. రైలు పట్టాల మీద ఒకటే ఆలోచన మీసాలు దువ్వుతుంది బొద్దింక అలమరాలో చదవని పుస్తకం ఉత్తరాలు రాయడం మానేశాను […]
భారీ వాహనాలను అనుమతించకు కూలే వంతెనల మీద.. బలహీనంగా ఊగే వంతెనల మీద భారీ వాహనాలకు ఎదురు నిలువకు.. వేగ నిరోధాలు మరీ అన్ని […]
వినలేను చేదబావి గిలక మోత! పూర్తిగా మునిగిన బిందె తల ఎగురవేస్తూ.. నిలువుగా పయనం! చేతుల్లో వాలదామని.. అందుకోలేను. వినలేను స్టీలు పాత్రల మోత […]
నీలంగా బయలుదేరి..పసుపుగా ఉబ్బి..నల్లగా కొనదేలి కదులుతున్న దీపాన్నిచూస్తున్నా ఏదో గొణగి సణగి బరబరా టప్ మని ఆరిపోయిన దీపాన్ని చూస్తున్నా ఉఫ్ మని ఊదినా […]
చీకటిలో ఆడదాని కన్ను పారదర్శకంగా ఆరక మండుతోంది! ఏపాటి వెలుతురున్నా ఈపురుగులు ఎగిరివచ్చి దీపాన్ని ఢీ కొడతాయి! కాపాడ ఎవరితరము?
భిక్షువు.. నీ ఇంటిముందు నిలబడి బిగ్గరగా యాచిస్తే.. పెళ్ళి ఊహల్లోనో అల్లిక పనిలోనో మునిగి వెళిపో.. వెళిపో అని అరవకు..కసరకు పాదాలకు పనిచెప్పి సోపానశ్రేణి […]
తలుపు తీసి చూడు కళ్ళల్లో తెల్లవారుతుంది ఇసుకనేల దాహం సముద్రమే తీరుస్తుంది తీగ కదిపి చూడు రాత్రి కన్నీరు రాలుతుంది పొగలు పోయే ఆకలి […]
ఏటి ఒడ్డున మేటలు వేసిన ఇసుక తేటగ పారే నీరు పరాచికాలాడే ప్రతిబింబాల వైపు పరీక్షగా చూస్తుంటే హఠాత్తుగా లేచి తటాలున వంగి లావాటి […]
తీపి పదార్థాలకు నోరూరదు షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ […]
రాలేనేమో చిన్నీ రాలేనేమో మళ్ళీ అయినా సరే రాత్రి మాత్రం దీపం ఆర్పేయక నా రాకను నీవు గుర్తించగలవు చిన్నీ పరిమళ యామిని పరవశించి […]
సుడిగాలి నెదిరించి వడగళ్ళ వానలో తడిచే వృక్షాన్ని వడలని సూర్యుని విడిది నుండి విడివడ్డ కిరణాన్ని
ఇంకిపోయిన నదిని లేచిరమ్మని కోరకు రాలిపోయిన నవ్వులను తిరిగి జీవించమని కోరకు ఏదో చప్పరిస్తూ..ఏ తీపి మిఠాయినో గుర్తుచేసుకోకు.. బావిలో కదిలే ప్రతిబింబాలను చిత్రించకు […]
మైదానమంతా ఎగిరి ఎగిరి అలసిన బంతి ఎండిన గడ్డి మీద ఆయాసం..వగర్పూ చెమటలా ఆరి పోయే ఆట కబుర్లు దెబ్బలతో నొప్పులతో బయటికి ఇక […]
వచ్చే వెళ్ళే రైళ్ళను చూస్తున్నా ..మధురంగా..కాస్త బాధగా సంగీతులు వినిపిస్తున్నాయి ఏదో సాయంత్రం సరిగా ఎండ చొరని..గుబురు వృక్షాల ఆకుల వెనుక దాగిన బరువూ […]
చీకటి తెరలు తొలగి పోతున్నాయి. జ్ఞాపకాలతో మూపురం బరువెక్కగా మరో మజిలీ కై వేచి చూస్తోంది అమాయకపు ఒంటె. ఒయాసిస్సులో నీరు వేడెక్కింది. చల్లబడ్డ […]
చెలమ..లో నీరు చేతులతో ఎత్తిపోసినకొద్దీ, చెమ్మ ఇసుకను విరుస్తూ ఊరతాయి. విశ్రమించిన గవ్వలు సూర్యరశ్మిని పీలుస్తాయి. అల్లరిపిల్లల మోకాళ్ళు దోక్కుపోయిన ప్రతిసారి, దుమ్ముకలిసిన రక్తంతో […]
రసమయ ఘడియల్లో రహస్యవీణ శ్రుతిచేసింది నీవేనా చిన్నీ? మెరిసిపోయే కన్నులలో మల్లెపూలు దాచుకొంది నీవేనా చిన్నీ? తేలిపోయే మాటలతో తీపితీపి కాలాన్ని రచించింది నీవేనా […]
దినపత్రికలు.. తెల్లవారగనే అక్షరాలు సింగారించుకొని వాకిట్లో కొచ్చిపడుతూ ఉంటాయి రోజు గడవగానే..అటకమీద..అలమరాలో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతుంటాయి సంవత్సరం పూర్తిగానైనా గడవకముందే తప్పు చేసినట్లు తలవంచుకొని కొత్త […]
జిగురు కన్నీళ్ళు కార్చే చెట్టు చిరిగిన పుస్తకాలతో పరిగెత్తుకు వచ్చే బాలుడు ఛాయాసింహాసనాన్ని వేసి స్వాగతించే చెట్టు రెండు చేతులా కాండాన్ని కౌగలించుకొని ఊరడిల్లే […]
ఆకులు రాల్చే చెట్టు ఊరక మొరిగే కుక్క చలి రంగులు వదిలి మునిగిన సూర్యుడు చితుకుల మంట చుట్టూ చేరిన పిల్లల జట్టు చిటపట […]
లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి మారు […]
వంగిన కొమ్మల నల్లని నిశ్శబ్దం నీలికొండల ఎ్తౖతెన ఏకాంతం ఇసుమంత నవ్వని ఇసుక గడియారాన్ని విడిది మందిరంలో తడిమి చూస్తావు కదిలిపోయే రైలు గాఢమైన […]
తుఫాను లెన్నో చూసి శిథిలమై తీరాన్నిచేరి, ఏకాంతంలో సాగరపవనాలు నేర్పిన చదువు ఇసుక రేణువులకు విసుగులేని కెరటాలకు అవిశ్రాంతంగా బోధిస్తోంది ఈ సముద్రనౌక
గదిలో ఫాన్‌తిరగదు బల్లి నాలుకపై జిగురు ఆరదు పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు చీమలు […]
బోనులో సింహం నిదురిస్తుంది తపస్సు చేసుకొనే విత్తనం కదలదు ఇంకే బురదలో కత్తులు లోతుగా దిగుతాయి కూలే వంతెనలు పాదస్పర్శకోసం పరితపిస్తాయి గుబురాకుల్లో దాగిన […]
పొడి ఆకులను నడిచే పాదాలను పాకే నీడల గోళ్ళతో తాకుతుంది ఎండ. తిండి వనాల్లో తిరుగాడే జంతువులు అంతా బాహిరమైతే ఆత్మకు చోటెక్కడ? వట్టిపోయిన […]
ఊరి బయట ఆరుతున్న కుంపటి బొగ్గులన్నీ ప్రార్థించిన పిమ్మట నివురుగప్పిన నిప్పు జీరలేని గొంతుకతో ధీరంగా చెప్పింది “చలించక జ్వలించండి”
అదేపనిగా తదేక ధ్యానంలో బూడిదరంగు గాడిద పిల్ల! చిందులు వేసే దీనికి ఎందుకు ఇన్ని ఆలోచనలు? ఏ భారమూ లేని ఈ వయసులో గాభరా […]
కాంతి కిరణాలు చిమ్మబడ్డాయి. నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ? చీకటి సాలెగూళ్ళలా వేలాడుతున్న ఈ ఇంట్లోనేనా? కిటికీ చువ్వలు..ప్చ్. కాలం తినేసింది.గాలి తినేసింది.నీరు […]
ఎండల్లో ,వెన్నెల్లో తడిచాం ,నడిచాం పంచుకొన్నాం కలలు ,కవిత్వాలు ! అరచేతుల గరకు స్పర్శ చాలు.. పోదాం పద నేస్తం వేయి కన్నుల వేయి […]
గడ్డి యంత్రాలు గీమని రొద పెడుతున్నాయి..అదే చప్పుడు..చెవులు దిబ్బెళ్ళు పడేలా ! తృళ్ళిపడి లేచాడు శ్రీధర్.బాటిల్‌లో నాలుగు గుటకల నీరు మిగిలివుంది. ఖాళీచేశాడు.తనను వెంబడించిన […]
అనువాదంతోనే ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగింది.మన ప్రాచీన కవుల్లో చాలామంది అనువాదంలో నిష్ణాతులు.నీ డు ము వు లు నీవు తీసుకొని మా సంస్కృతాన్ని […]
1 మెలకువలో మత్తు మెలికతోవ తప్పి నిలుస్తాను నీడలా ఖయ్యాం!నాపని ఖాళీ 2 మంచురెల్లు పూలు కంచుచేతుల తడిమినా ఇంచుక లేదు తడి ఖయ్యాం!నాపని […]
పాల్ సెలాన్(Paul Celan) జర్మన్‌యూదు.కష్టాలు పడ్డాడు.నాజీలు కడతేర్చారు కన్నవాళ్ళని. కాన్సంట్రేషన్‌కాంపుల్లో మగ్గి ఫ్రాన్స్‌చేరుకొన్నాడు.అక్కడ ఒక విదుషీమణిని పెళ్ళిచేసుకొన్నాడు.ఆమె కడదాకా,అంటే తను నీట మునిగి చనిపోయేదాకా […]
శబ్ద కవిత్వమంతా అకవిత్వమా ? ఖచ్చితంగా కాదనే సమాధానం దాన్ని మించిన కవిత్వానికి కళ్ళు తెరిపించే ఒక ప్రయత్నమే ఇదంతా !
కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది. “చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను […]
లోతు కొలను ఈత రాదు చేతులాడవు పాచిబట్టిన రాళ్ళు నాచు మొక్కలు పలుకరించే చేపలు జలపాతం కింద చూడలేను అడుగున లీలగా బుడగలతో వేడిసోకిన […]
స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]
” పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.సర్వం పోగొట్టుకున్నాను.” గట్టిగా అరవాలనిపించింది వేణుకు.ఏమీ పట్టనట్టు ట్రాఫిక్!కరెంట్‌పోల్ ఖాళీగా నిలబడుకొని వుంది.ఎండిన చెట్టు ఏమరుపాటుగా తననే గమనిస్తున్నట్టనిపించింది వేణుకు.”ఏమిటా […]
రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీ బ్రాడ్‌స్కీ(194096) కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో ఎంతో వేదన అనుభవించాడు బ్రాడ్‌స్కీ. ప్రభుత్వం “పరాన్నభుక్కు”గా జమకట్టి వెలివేస్తే అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు.పిన్న వయసులోనే […]
ఆంగ్లమూలం జోసెఫ్ బ్రాడ్‌స్కీ నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా […]
ఎవరేమి చెప్పినా వినదలుచుకోలేదు. ఎన్నిసార్లు వాయిదా వేసుకొన్నానో నాకే తెలియదు. ప్రతిసారీ ఇండియా వచ్చినప్పుడల్లా అమర్ నాథ్ చూడాలనిపించడం, చివరికి చూస్తుండగానే రోజులు తరిగిపోవడం, […]
అరుస్తోంది కొండల్లో
తప్పిపోయింది
మేకపిల్ల
జర్మన్ మూలం రైనెర్ మారియా రిల్కే రిల్కే (1875-1926) ప్రేగ్ లో జన్మించాడు.బాల్యం కష్టాలతో గడిచింది.ఇష్టం లేని మిలిటరీ స్కూల్ లో విద్యాభ్యాసం.రెండు పదులు […]
(జనవరి 2002 సంచిక లో వచ్చిన “కవిత్వ మీమాంస” అనే వ్యాసానికి ఇది కొనసాగింపు లాటిది. అక్కడ కవిత్వం గురించిన విశాలమైన చర్చ జరిగింది. […]
ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, […]
నేనెప్పుడూ బందీనే. ఎంత స్వేచ్ఛగా ఉందామనుకొన్నా ఏదో ఒక తీగ కాలికి చుట్టుకొంటుంది. అండమాన్ ఆకాశం నీలంగా మెరిసిపోతుంది.సముద్రం నాలాగే అశాంతిగా కదులుతోంది. బీచ్ […]
[యుజీనియొ మొంటాలే (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. […]
చలిలో పొగమంచులో ఎన్నిసార్లు నీకోసం స్టేషన్లో ఎదురుచూడలేదు, పచార్లుచేస్తూ, దగ్గుతూ ఆ దిక్కుమాలిన దిన పత్రికలు కొంటూ గ్యూబా సిగరెట్లు కాలుస్తూ(తర్వాత వీటిని తలలేని […]
“ఆకులోఆకునై” కాలమ్ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన […]
అనువాదం ప్రాముఖ్యం తెలియని జాతికి విమోచన లేదు. దీవి సుబ్బారావు శ్రమకోర్చి, బసవ, అక్క మహాదేవి, అల్లమప్రభు, తదితర కన్నడ వచన కవులను(12 వ […]
“You are fair” అన్నాడు పెదనాన్న. మరణించేవాడి కృతజ్ఞతాభావం నాకు అవసరమా? ఆస్తి తగాదాల్లో విడిపోయాం.తర్వాత నేను పెదనాన్న మొహం చూడలేదు. చావు బ్రతుకుల్లో […]
1. నేటి కవిత్వం తీరుతెన్నులు “ఈ మాట” సంపాదకులు నేటికవిత్వం గూర్చి రాయమని ఒకసారి సూచించారు. ఇండియా నుండి స్నేహితుడు వస్తుంటే, విశాలాంధ్రలో కనిపించిన […]
అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదురుచూసింది. కానీ అతనిలో ఏమీ కదలిక లేదు. […]
ఎందరో వచ్చారు ఎందరో పోయారు. గుడి బయట ఏ మాత్రం వడలిపోని తామరపూలు సవ్వడి చేయకుండా నవ్వడం మానలేదు.
కరెంటు తీగలకు అడ్డొచ్చానని కరుగ్గా నరికేశారు కొమ్మలని రంపం పెట్టి కోస్తుంటే కంపించింది వళ్ళంతా అడ్డొచ్చిన ప్రతిదాన్ని తొలగిస్తారా? గడ్డుకాలం దాపురించింది మీకు.
జుట్టును చెరుపుతుంది వర్షానికి ముందు గాలి ప్రియురాలు రంగురంగుల బంతులు పచ్చిక మీద పిల్లలు అలసిపోయారు. కుండీలో విరబూశాయి ఒకేరంగుపూలు బడిపిల్లలు ఎర్రని రోజాలను […]
ట్రంబుల్ స్టిక్నీ(Trumbull Stickney: 1874 – 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో పెరిగాడు.హార్వర్డ్,పారిస్ లలో విద్యాభ్యాసం. సకల శాస్త్రాలను,సాహిత్యాలను పుక్కిటపట్టాడు. ప్రత్యేకించి […]
పూవుల రంగులన్నీ లాగేసుకొని పారిపోతాడు సూర్యుడు నల్లని రాత్రి! పొద్దెక్కి లేచాను చెల్లాచెదురుగా ఎండ అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే చీకట్లో నల్లపిల్లి మ్యావంది తను […]
అన్నీ వదులుకోక తప్పదని చిన్నపాటి చెట్టుక్కూడా తెలుసు విలవిలలాడిపోతారు మీరు గలాభా చేయడం మాని పగటి ఎండను, రాత్రి వెన్నెలను నిగర్వంగా ఆహ్వానించి చతికిలపడిపోకుండా […]
సిగరెట్టును తగలేస్తారు పొగరంతా తగ్గి పొగయిపోగానే పీకను నలిపేస్తారు నాకుమాత్రం బ్రతకాలని ఉండదా? సుతారంగా, కొంత సున్నితం పాటించి నన్నిలా వదిలేయండి!
ప్రసిద్ధ ప్రపంచకవితల పరిచయం ఇటీవలి కాలంలో ఇతర భాషల్లో వచ్చిన గొప్పకవిత్వాన్ని పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం. అలజడి,సంఘర్షణా,జీవితాన్ని అతలాకుతలం చేసే అనుభవాలు,అన్నీ […]