ఇస్మాయిల్ అవార్డు – 2014

ఇస్మాయిల్ అవార్డు – 2014

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్‌,బండ్లమూడి స్వాతికుమారి గార్లకు ఈ అవార్డ్ లభించింది.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...