ప్రతీక్ష

ఏటి ఒడ్డున

మేటలు వేసిన ఇసుక

తేటగ పారే నీరు

పరాచికాలాడే

ప్రతిబింబాల వైపు

పరీక్షగా చూస్తుంటే

హఠాత్తుగా లేచి

తటాలున వంగి

లావాటి రాయి ఒకటి విసిరి

నాజూకు చేతులు దులుపుకొని

నీ ప్రతిబింబాన్ని వెంటబెట్టుకొని

హుటాహుటిగా

నీ వెళ్ళిపోతే..

చెదిరిన ప్రతిబింబాన్ని

చేజిక్కించుకొనేందుకు

గాలం వేస్తూ..

మసక చీకటిలో

కదిలే నీటిలో..

నేను.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...