తనలో తాను

మొరపెట్టుకొన్నాను.

సముద్రం ఎదుట

నిలబడి

నురగలతో

పాదాలను నిమిరి

ఉప్పునీటి అలతో

చప్పున మొహాన్ని చరిచి

తనలో తాను

అనునిత్యం

కలహించుకొనే సముద్రం

చెలియలి కట్టను

తాకి చెప్పింది

చీకటి పడకముందే

దారి వెదుక్కో

తలవాల్చకు

నిలబడకు!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...