నిశ్శబ్దం లో నీ నవ్వులు
గలగల వినిపిస్తాయి
ముసుగేసిన ఆకాశం
ముసురు పట్టిన సాయంత్రం
కిటికీ రేకులపై
కురిసే చినుకుల్లా
కరెంటులేని
నిద్రపట్టని రాత్రి
చమురుదీపం వెలుగు
సాగిన చువ్వల నీడలను
మాయం చేసే మెరుపుల్లా
నిశ్శబ్దం లో నీ నవ్వులు
గలగలా వినిపిస్తాయి
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:
తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »