oneటరి

వచ్చే వెళ్ళే రైళ్ళను చూస్తున్నా

..మధురంగా..కాస్త బాధగా

సంగీతులు వినిపిస్తున్నాయి

ఏదో సాయంత్రం సరిగా

ఎండ చొరని..గుబురు

వృక్షాల ఆకుల వెనుక దాగిన

బరువూ తేలిక స్మృతులు!

చీకటి కమ్ముకొస్తుంది..

పచ్చగా ఎర్రగా మారే

సిగ్నల్‌లైట్‌లా స్టేషన్‌లో

నేనొక్కడినే మిగిలిపోయాను.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...