నిఖార్సైన పద్యం

పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి

మళ్ళల్లో ఎగిరే పక్షులు

మెరవని రావి ఆకు వుందా?

వరికంకుల యవ్వనం వాలిపోతుంది.

ఎంగిలి చేయని నీరు

వణుకుతు పారే వాగు

తంగెడు పూవులు పూచాయి

మిణుగురు పురుగులు చలిలో!

వికారంగా పాకుతుంది

వకే వక సర్పం

నిఖార్సైన పద్యం

సుఖాన్నిస్తుందా?

ఊరి పొలిమేరల్లో

దారి తప్పిన తీతువు

ఆకాశాన్ని ఆక్రమించి

కకావికలు చేస్తోంది చీకటిని!

తప్పుకోదు వేగుచుక్క

చిప్పిల్లే కాంతులతో

నిప్పు కణికెలా

ఎప్పుడొస్తాడు సూర్యుడు?

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...