బోనులో సింహం నిదురిస్తుంది
తపస్సు చేసుకొనే విత్తనం కదలదు
ఇంకే బురదలో కత్తులు లోతుగా దిగుతాయి
కూలే వంతెనలు పాదస్పర్శకోసం పరితపిస్తాయి
గుబురాకుల్లో దాగిన గూబ రాత్రిని ప్రార్థిస్తుంది
వీధిదీపం మసక మంత్రాలు ఉచ్చరిస్తుంది
పుస్తకాలు చింపే పిల్లలతో రిక్షాలు జీవిస్తాయి
కిరణాల అల్లిక నేర్చిన సాలీళ్ళు మరణిస్తాయి.