నీషే

చీకటిగదిలో

ఆకలి చలిలో

ఏకాకివి

వికారంగా వాంతి

కీకారణ్యంలోకి

అడుగు పెడతావు

మనుషులతో పని ఏమి?

తనువును మోసే గాడిదలు

ఆదర్శాలు

గుదిబండలని

దేవుడు మరణించాడనీ

నీవే కదూ చాటింది?

ఆషామాషీ లోకం

నిషాలో శోకం!

నీషే

విషణ్ణ వదనం

విషాన్ని తాకం!

మతి చలించాక

అతిగా గాలిరాక

ప్రతిమలా

ప్రతినిమిషం

బ్రతుకుతావు


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...