పొడి ఆకులను
నడిచే పాదాలను
పాకే నీడల గోళ్ళతో
తాకుతుంది ఎండ.
తిండి వనాల్లో
తిరుగాడే జంతువులు
అంతా బాహిరమైతే
ఆత్మకు చోటెక్కడ?
వట్టిపోయిన ఆవులా
తట్టిలేపుతుంది వెన్నెల
కుమ్మరించే వాన
నిమ్మళించింది.
పాచిపట్టిన బండరాళ్ళపై
విచ్చలవిడిగా దూకే జలపాతాలు
విచలించే జ్ఞాపకాలు
తచ్చాడుతాయి తడిచేతులతో!
నగరాన్ని చుడుతుంది
డ్రాగన్‌లా ఈ రైలు
బడలికతో చాచి
మెడతిప్ప లేదు జిరాఫి.