పొగలో..

చలిలో పొగమంచులో
ఎన్నిసార్లు నీకోసం స్టేషన్లో
ఎదురుచూడలేదు, పచార్లుచేస్తూ, దగ్గుతూ
ఆ దిక్కుమాలిన దిన పత్రికలు  కొంటూ

గ్యూబా సిగరెట్లు కాలుస్తూ(తర్వాత వీటిని
తలలేని పొగాకు మంత్రి నిషేధించడమైనది)
రైలు పోయిందా ఇంకోటి వస్తుందా, రద్దయిందా?
కూలీలబళ్ళను పరిశీలిస్తాను, నీ సూట్‌ కేసు
కలసి వుందేమోనని, ఆ వెనుక నీవూ వస్తుంటావని
ఎలాగో చివరికి నీవు ప్రత్యక్షమవుతావు
ఎన్నో వాటి మధ్య ఒక్క జ్ఞాపకం
నన్ను కలల్లో కూడా వెంటాడుతుంది.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...