జర్మన్ మూలం రైనెర్ మారియా రిల్కే
రిల్కే (1875-1926)
ప్రేగ్ లో జన్మించాడు.బాల్యం కష్టాలతో గడిచింది.ఇష్టం లేని మిలిటరీ స్కూల్ లో విద్యాభ్యాసం.రెండు పదులు నిండక మునుపే కవితా సంకలనాలు తెచ్చాడు.పలు దేశాలు తిరిగాడు.రష్యా పర్యటన మైలురాయి.టాల్ స్టాయి ని కలిశాడు.తనకంటే 14 సం.పెద్దదైన “లౌ” వైపు ఆకర్షితుడయ్యాడు.తత్వవేత్త నీషే మొదలుకొని ఎందరినో తన అందంతో విచలింపచేసిన ఆమె అప్పటికే రచనా వ్యాసంగంలో వేళ్ళూనికొని వుంది.లౌ పరిచయం సాహిత్యపరంగా రిల్కే కు లాభించింది. ఆమరణాంతం గొప్ప స్నేహితులుగా మిగిలిపోయారు.రిల్కే తన తర్వాతి జీవితంలో ఎక్కువకాలం ఫ్రాన్స్ లో గడిపాడు.ప్రఖ్యాత శిల్పి రోడిన్ కు సెక్రటరీ గా పనిచేశాడు.రోడిన్ శిష్యురాలు క్లారా ను పెళ్ళాడాడు.కానీ ఏకాంతోపాసకుడు కావడం మూలాన సంసార జీవితాన్ని త్యజించాడు.ఫ్రాన్స్ సాహిత్య వాతావరణం తనకు ఎంతగానో ఉపకరించింది. దృశ్యకళలతో ప్రభావితమై గొప్ప రచనలు చేశాడు.ఏది ఏమైనా విమర్శకులు రిల్కే చివరికాలంలో రచించిన Duino Elegies, Sonnets to Orpheus లను గొప్ప రచనలుగా భావిస్తారు.పోతే ఇతని డైరీలు ఉత్తరాలు కూడా ప్రసిద్ధి గాంచాయి.లోతైన ఈ జర్మన్ మహాకవి అయిదుపదుల వయసులో తనువు చాలించాడు.
Orpheus Sonnets
వినుతించడమే అసలంతా ,శ్లాఘించువాడు
ఖనిజంలా,శిలా మౌనం నించి వెలికివస్తాడు
అనిత్యం , హృదయం, చింది మధురసం
అనంతంగా ఉబికివస్తుంది,అనేకులకోసం
అతీత స్ఫురణ అధీనంలోకి తీసుకొన్నాక
అతని స్వరం సదా నిలుస్తుంది అవనిరాలక
ప్రతిదీ ద్రాక్షవనంగా,ప్రతిదీ గుత్తిగా మారి
అతని దక్షిణాన అతిసున్నితంగా పలుమాగి
ఆ రాచసమాధిలోని మృత్తిక ఆతని
బిరుదాలు అబద్ధాలని కొరతవేయదా
పరలోకపు నీడలను పడవేయదా
వదిలి వెళ్ళని దూతల్లో వాడొకడు
సుదూర మృత్యు ద్వారాల నిలుస్తాడు
పదిలంగా, ఉజ్వల ఫల పాత్రలు పూని
——————-German—–Original——
VII (ERSTER TEIL)
Rühmen, das ists! Ein zum Rühmen Bestellter,
ging er hervor wie das Erz aus des Steins
Schweigen. Sein Herz, o vergängliche Kelter
eines den Menschen unendlichen Weins.
Nie versagt ihm die Stimme am Staube,
wenn ihn das göttliche Beispiel ergreift.
Alles wird Weinberg, alles wird Traube,
in seinem fühlenden Süden gereift.
Nicht in den Grüften der Könige Moder
straft ihm die Rühmung lügen, oder
daß von den Göttern ein Schatten fällt.
Er ist einer der bleibenden Boten,
der noch weit in die Türen der Toten
Schalen mit rühmlichen Früchten hält.