మలబారు !

ఎగురలేని

గాలిపటం తోకలా

కొబ్బరి చెట్టు

నదిపై ఎండ

భూతద్దంలో దూరిన

కిరణం

నీ తలను కాలుస్తుంది

పీతలను తరుముతుంది!

గుబురు తోపు వెనుక

మసక మసక

వెలుతురు..

కిటికీ తెరిచే వుంది!

విశ్రమించిన

చెక్కపడవ

ఎక్కడికి పోగలదు?

విసుగనిపించదు వెన్నెల

ఇసుక రేణువు

స్థాణువు!

కొండకు దిగువున

కొలనులో

తేలే పూవు!!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...