ఖాళీతనం

మీ కొళాయి..గరగర కసరదు

మొహం చిట్లించుకోదు

కోపగించుకోదు

ధ్యానముద్రలో..ఒకేధార!

నురగలు గిరగిర తిరిగే

నిండిన బిందెను ఎత్తుకోవడమే

మీకు తెలుసు

అసలు నిండని బిందె

సగం నిండిన బిందె

ఏనాడు ఎత్తుకొని ఉండరు!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...