హిందూస్తానీ సంగీతకారులు చాలామంది ప్రతి ఏడాదీ తమ గురువుల పేర సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ ఆనవాయితీ కర్ణాటకసంగీతంలో కనబడదు. తెలుగువారిలోనే ద్వారం, పారుపల్లి, […]
మే 2003
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !
ఈ సంచికలో అనుబంధ కావ్యాలుగా శ్రీ ఇస్మాయిల్ “రాత్రి కురిసిన రహస్యపు వాన”, “కప్పల నిశ్శబ్దం”, శ్రీ గుఱ్ఱం జాషువా “గబ్బిలం” కావ్యం తొలిభాగం, ఇస్తున్నాం. ఇస్మాయిల్ గారి రచనల్ని చక్కగా టైప్ చేసి ఇచ్చిన శ్రీ గట్టు వినీల్ కుమార్ కి, శ్రీ ఇస్మాయిల్ గారి అనుమతి పొందిన శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్ కి కృతజ్ఞతలు. ఒక తరం కవితారసజ్ఞుల్ని ఉర్రూతలూగించిన శ్రీ జాషువా గారి గబ్బిలం, ఎంతోమంది యువకులకు మార్గదర్శకాలైన శ్రీ ఇస్మాయిల్ గారి రచనలు “ఈమాట” పాఠకులకు ఆలోచనామృతాలౌతాయని మా ఆకాంక్ష.
శ్రవ్య విభాగంలో శ్రీ రమణమూర్తి, జె. వి. సోమయాజులు, తదితరులు పాత్రపోషణ చేసిన “కన్యాశుల్కం” ఆకాశవాణి నాటికను, తెలుగునాట విస్తృత ప్రచారం పొందిన రంగస్థల నాటకం “చింతామణి” (అర్వపల్లి సుబ్బారావు, చీరాల సుబ్బయ్య, తదితరులు నటించినది) ని అందిస్తున్నాం.
శ్రీ విన్నకోట రవిశంకర్ రచన “కానుక” అనే నాటిక సరదాగా చదువుకోవటానికే కాకుండా చక్కగా ప్రదర్శించటానికి కూడ ఎంతో అనుకూలమైనది. ఔత్సాహిక కళాకారులు దీన్ని ఆదరిస్తారని, ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం.
ఇక ఈ సంచికలోనూ కథలు, కవితలు, వ్యాసాలు మీకు నచ్చే స్థాయిలో అందించగలుగుతున్నామని భావిస్తున్నాం. ఐతే, రచయిత్రు(త)లు రాయనిదే, మాకు పంపనిదే, మంచి మంచి రచనలు వాటంతటవే పుట్టుకురావు కదా! ఈ పత్రిక వున్నది విదేశాంధ్రుల రచనావ్యాసంగాన్ని ప్రోత్సహించటానికి. ఈ అవకాశాన్ని వినియోగించుకొమ్మని మరొకసారి మా ఆహ్వానం!
రాసే శక్తి వున్న ప్రతివారికీ రాయవలసిన బాధ్యత కూడ వున్నది. వారు ఆ విషయం గుర్తించి తమ బాధ్యతని నిర్వహిస్తారని మా నమ్మకం. ఆ నమ్మకమే ఈ పత్రిక పుట్టుకకు, ఉనికికి పునాది.
ఇక్కడ కనిపించే ఒక కథ గురించి కొంత నేపథ్యం ఇవ్వటం అవసరం అని నేను అనుకుంటున్నాను. దాదాపు ఐదేళ్ళ క్రితం Syllables of Sky (Edited by David Shulman, in honor of Prof. Velcheru Narayana Rao) అన్న వ్యాస సంకలనం చూసినప్పుడు అందులో ఒక వ్యాసం నన్ను బలంగా ఆకట్టుకుంది. అది తొలినాళ్ళ యూరోపియన్ల దృష్టిలో తిరుపతిి గురించిన భావాలు ఎలా వుండేవి అనే విషయం మీద శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం రాసినది. ఆ వ్యాసంలోని కొన్ని విషయాల్నిఓ కథగా తయారుచేస్తే బాగుంటుందన్న అప్పటి ఆలోచన ఇప్పటికి కార్యరూపం ధరించింది. ఐతే, నేను చేసింది కేవలం కొంత నాటకీయతను ప్రవేశపెట్టే ప్రయత్నం. పాత్రలూ, సంఘటనలూ అన్నీ వాస్తవాలే, కల్పితాలేవీ లేవిందులో!
నవయుగకవి చక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా రచనల్లో అగ్రగణ్యం “గబ్బిలం”. ఆయన కవిత్వంలో కనిపించే ముఖ్యగుణాలు భావనాపటిమ, సామాజికస్పృహ, మానవతాదృక్పథం ఇందులో విస్తృతంగా దర్శనమిస్తాయి. తేలిక భాషలో లోతైన భావాల్ని చెప్పే ఈ కావ్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాక అవశ్యపఠనీయం కూడ.
(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన […]
ఏర్ పోర్టుకి వచ్చాక నూట పదిహేనోసారి పాస్‌పోర్టు చూపిస్తున్న విసుగుతో, ఇదే ఆఖరిసారి కదా అన్న ఊరటతో, తన చేతిలోని నీలం పుస్తకాన్ని సెక్యూరిటీ […]
నూతిలో తాబేలు నూతిలో తాబేలుందంటే కోతిమూకలా పరిగెత్తాం పిల్లలమంతా. తొంగి చూస్తే మా తలకాయలూ నింగి నీలిచట్రమూ కనిపించాయి. రాళ్ళూ గెడలూ ఏరుకొచ్చి నీళ్ళన్నీ […]
క్రిస్టోవో డి కాస్ట్రో ది రాతకోతల్లో అందె వేసిన చెయ్యి. ఎక్కడి దాకానో ఎందుకు, అతని డైరీ చూస్తే చాలు అతనెంత మాటల పుట్టో […]
“ఈమధ్య జీవితం చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోయింది. ఈ 911 ఏమోగాని ప్రతిదానికీ భయపడాల్సి వస్తున్నది” అన్నాడు సయీద్ దీర్ఘంగా నిట్టూరుస్తూ. “నిజమే. ఈరోజుల్లో అమెరికాలో […]
సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు. హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్కువ సేపు నిద్ర పోదామంటె […]
హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్ పరిస్థితి. అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై ఏళ్ళ వయసు దాకా పెరిగిన […]
(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్ మీద ఉన్న పెళ్ళి ఫొటో […]
గుబురు తగ్గని చెట్లు
ఖాళీ పాత్రల్లా
ఆకాశాన్ని ప్రశ్నిస్తాయి
నా కవితల్లా
ఈ నాలుగు నల్లని మరకలు దోసిట్లో ఇమిడిపోయే ఈ కాసిని ఇంకు చారికలు ఎప్పుడు ఏ లోకాల్లో ఏ అమృతాలు త్రాగేయో ఆలోచనలకి అస్తిత్వం […]
(ముందు మాట చాట్ రూం లో మొదలైన పరిచయం ప్రణయమైంది. పెళ్ళి సంబంధాలువెదుకుతున్న తనవారికి, ఓ అమ్మాయి యీ విషయం చెప్పవలసి వచ్చింది. ప్రేమ […]
పొద్దున బస్సుకు పోవాలె పట్నంల పరీక్ష సదివిందాని మీద మనసు లేదు అంతా ప్రయాణం గురించే టికెటు కొట్టే బక్క కండక్టరు ముందు సీట్ల […]
కవాఫి(Constantine P. Cavafy)ఒక గ్రీకు కవి.కుటుంబ వ్యాపార రీత్యా ఈజిప్ట్ లోని అలెక్సాండ్రియాలో నివాసం. మన గురజాడకు సమకాలికుడు.అప్పుడు మన తెలుగులాగే గ్రీకులో కూడా […]
చిన్నప్పుడు ఒక సరదా ఉండేది. సినిమా పాటల్లో ఎక్కడైనా ఒక లైన్లో “సన్నిధి” అనే పదం వస్తే, వెంటనే తరువాతి లైన్లో “పెన్నిధి” అని […]
శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళి వాదంలో డిండిమభట్టుని ఓడించి అతని కంచుఢక్కని పగలగొట్టించిన సందర్భంలో ప్రౌఢదేవరాయల గురించి ఓ పద్యం చెప్పాడు “జోటీ భారతి! […]