కరెంటు తీగలకు అడ్డొచ్చానని
కరుగ్గా నరికేశారు కొమ్మలని
రంపం పెట్టి కోస్తుంటే
కంపించింది వళ్ళంతా
అడ్డొచ్చిన ప్రతిదాన్ని తొలగిస్తారా?
గడ్డుకాలం దాపురించింది మీకు.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »