అవ్యయం

లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి

నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది

చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి

మారు మూల స్టేషన్‌లో పోర్టర్లు కనిపించరు

వేళ్ళుకనిపించేలా కూలిన తర్వాతే వృక్షాలు అన్వేషణ ఆపుతాయి

ఎవరూ ఎగిరించలేని విమానాలు నిద్రలో రన్‌వేలను కలవరిస్తాయి

ఆహ్వాన పత్రికలు సకాలంలో కొందరికే అందుతాయి

నొప్పులతో కుమిలిపోయే రైళ్ళు తరచు పట్టాలు తప్పుతాయి


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...