శీతాకాలం

ఆకులు రాల్చే చెట్టు

ఊరక మొరిగే కుక్క

చలి రంగులు వదిలి

మునిగిన సూర్యుడు

చితుకుల మంట చుట్టూ

చేరిన పిల్లల జట్టు

చిటపట మాటలతో

సెగపొగ నవ్వులతో..

ముడుచుకు పడుకున్న కుక్క

బూడిద రాశిలో నిప్పు

మంచులో తడిచే ఆకులు

తల్లి ఒడిలో పిల్లలు


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...