అలారం మోగుతుంది
అందరూ లేచిపోతారు
దీపాలు మౌనం వహిస్తాయి
చీకటి తడుముకొంటుంది
మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి
మంచును ప్రేమించిన పర్వతారోహకులు,హిమకౌగిలిలో..మరిలేవరు!
పొరుగుదేశం కలహప్రీతి ముసుగు ధరిస్తుంది
సరిహద్దుల్లో మృతదేహాలు నిదురిస్తాయి
కొత్తది
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:
తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.
...
పూర్తిగా »