వంగిన కొమ్మల
నల్లని నిశ్శబ్దం
నీలికొండల
ఎ్తౖతెన ఏకాంతం
ఇసుమంత నవ్వని
ఇసుక గడియారాన్ని
విడిది మందిరంలో
తడిమి చూస్తావు
కదిలిపోయే రైలు
గాఢమైన పరిచయాలు
సాయంత్రం ఎండలో
సాగిపోయే నీడలు
శ్వేతాంబరధారి
చేతుల నిండా పూలు
బురద నిండిన పొలాలు
వరదలా వ్యాపించే సౌందర్యం
నెలపొడుపు
బలంగా వీచే గాలి
వాతావరణంలో తేమ
నీతోనే నివసిస్తాయి