నిద్రించని జలపాతం
రాత్రి సమయాల్లో
చెవులొగ్గిన శిలల మీద
పడి గెంతడంఎవరు చూస్తారు?
వడి తగ్గిన దేవాంగ్‌నది
శిగపూవులతో
చీకటిలోయల్లోకి
పయనించడంఎవరు చూస్తారు?
నడినెత్తిన సూర్యుణ్ణి
సరిగా చూడనివ్వని
పొడవైన గుబురువృక్షాలు
రాల్చిన ఆకులనుఎవరు చూస్తారు?
కొండ పూవులపై వాలే
పెను సీతాకోక చిలుకను
నది ఒడ్డున చెక్క ఇంట్లో
మిణుకుమనే దీపాన్నిఎవరు చూస్తారు?
దట్టమైన నామ్‌ధపా అడవుల్లో
సెలయేరులను నదిజాడలను
కదిలే నీడలను
ప్రియురాలి కన్నుల్లోఎవరు చూస్తారు?