ముందూ వెనుక

నీతో కలిసి పయనిస్తూ

వచ్చిన పెట్టెలను మోస్తూ..

నీ ముందు కూలీ

బరువెక్కిన పాదాలతో

ఆ వెనుక అనుసరిస్తూ నీవు

చేరవలసిన చోటువైపు

ఉరకలేసే ఆటో

లోపల మిణుకుమిణుకున

దారి తెలియని నువ్వు!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...