పూవుల రంగులన్నీ లాగేసుకొని
పారిపోతాడు సూర్యుడు
నల్లని రాత్రి!
పొద్దెక్కి లేచాను
చెల్లాచెదురుగా ఎండ
అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే
చీకట్లో నల్లపిల్లి మ్యావంది
తను కనిపించదని
దానికి తెలుసేమో !
ఆకులు రాల్చిన చెట్టు
క్రిందవికసించిన పూవు
అందరిచూపూ దానిమీదే..
ఏవి ఎక్కడ వుండాలో
అవి అక్కడే వున్నాయి
అదే ఇబ్బంది!
మళ్ళీ ఎదురుపడ్డానని
నవ్వుతోంది కుర్రది
నవ్వక తప్పింది కాదు