గదిలో ఫాన్‌తిరగదు
బల్లి నాలుకపై జిగురు ఆరదు
పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు
మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు
చీమలు ముద్దుల పరామర్శలతో తిరుగుతాయి
స్నానాలగదిలో గచ్చుమీద ప్రతిబింబాలు నర్తిస్తాయి
నెప్య్టూన్‌చందమామలో అగ్నిపర్వతాలు పేలి మంచులావాను కక్కుతాయి
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.