దాసరి అమరేంద్ర

దాసరి అమరేంద్ర
పూర్తిపేరు
దాసరి అమరేంద్ర
సొంత ఊరు
విజయవాడ
ప్రస్తుత నివాసం
ఢిల్లీ
ఇష్టమైన రచయితలు
కొ. కు., సోమర్‍సెట్ మామ్
హాబీలు
ప్రయాణాలు, పుస్తకాలు, మనుషులు

జీవిత విశేషాలు

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంలో. పెరిగిందీ చదువుకుందీ బంటుమిల్లి, విజయవాడ, కాకినాడ, బొంబాయిలలో. ముప్ఫై ఏడేళ్లపాటు BEL లో ఉద్యోగం చేసింది ఘాజియాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పూణేలలో. ఉద్యోగానంతరం గత పదిహేనేళ్లుగా ఢిల్లీ. మొదటి ముప్ఫై ఆరేళ్ళూ చదవడమే తప్ప పెద్దగా రచనల జోలికి వెళ్ళలేదు. గత ముప్ఫై ఏడేళ్ళుగా కథలు, వ్యాసాలు, అనువాదాలు, ట్రావెలాగ్స్: అంతా కలసి పంతొమ్మిది పుస్తకాలు. ప్రయాణాలకూ సాహిత్యానికీ జీవితానికీ తేడా లేదనీ, అవి పరస్పరాధారితాలనీ స్పష్టత ఉంది. ప్రపంచమన్నా మనుషులన్నా శృతిమించిన అనురాగం, నమ్మకం. ‘నేనెప్పుడూ ఒంటరిని కాదు – నాకు నేనే తోడు’ అనే ఏకాంత జీవి.

దాసరి అమరేంద్ర రచనలు