ఆ ఇంటి రోడ్డు మలుపు తిరిగి పుస్తకం తెరిచి చదువుకుంటూ బడి దారి నడుస్తున్నానా. చదివే కొద్దీ ఒళ్ళంతా భయం, తిమ్మిరి. సల్లాడం వేడిగా, బిర్రుగా. ఒక్కసారి పుస్తకం మూసిపడేసి మా స్కూలు వెళ్ళే అడ్డదారి పట్టా. మనిషినంతా అదోలా అయిపోయా. అక్కడంతా కంపచెట్లు ఎక్కువ. భయంలో కూడా ఏదో గమ్మత్తు ఉంది ఆ రచనలో.
సెప్టెంబర్ 2024
నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన ప్రశ్నల లాంటి ప్రశ్న. ప్రతీవారికీ ఇబ్బంది కలిగించే ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ విలువలకు లోబడి జీవించాలి? ఏ ఆదర్శాలకు నిలబడుతూ జీవించాలి? ఎలాంటి వ్యక్తిగా జీవించాలి? దేని కోసం పాటుపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రతి మనిషికీ భిన్నంగా ఉంటాయి. ఆ జవాబులు ఏ మనిషికైనా వాళ్ళ మనసుల లోతులలోనుండే దొరకాలి, దొరుకుతాయి. ఈ రకమైన ఆత్మపరిశీలన చేసుకోని వ్యక్తి, సమాధానాలకై సంఘర్షణకు లోను కాని వ్యక్తి తనను తాను స్పష్టంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. తన పట్ల తనకే స్పష్టత లేని వ్యక్తికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా స్పష్టత ఉండదు. అటువంటి వ్యక్తిత్వంతో తన పట్ల తనకే లేని నిజాయితీ ప్రపంచం పట్ల చూపగల అవకాశమూ లేదు. ఎన్నో కోణాలనుంచి తనను తాను అర్థం చేసుకొని తన బలాలు, బలహీనతలు విచారించుకోలేని వ్యక్తి, ప్రపంచాన్ని కూడా అదే కురచ చూపుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతో సంక్లిష్టమైన మానవజీవితాన్ని, సామాజిక చలనాన్ని కేవలం కామెర్ల ఒంటికంటితోటే చూస్తాడు. తన చూపే నిజమని బుకాయించుకుంటాడు. మంచి చెడు అన్న ఒక అత్యంత బలహీనమైన కొలమానం మాత్రమే ఇటువంటి మనిషికి వాడటం తెలిసిన పనిముట్టు అవుతుంది, ఆ మంచి చెడు అన్నవాటి నిర్వచనాల పట్ల ఏమాత్రం స్పష్టత లేకున్నా, అవి స్వార్ధాన్ని, సందర్భాన్ని పట్టి మారుతునే ఉన్నా. వీటిని దాటిన ఆలోచన, ఆ ఆలోచనకు కావలసిన పరిశ్రమ, ఆ పరిశ్రమకు తోడు కావల్సిన సహానుభూతి, జీవితానుభవం ఇవేమీ ఈ తరహా మనుషుల నుండి ఆశించలేము. అందుకే, నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? అన్న ప్రశ్న జోలికి ఈ సమాజంలో అత్యధికులు ఎప్పుడూ పోరు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం నిర్ణయించిన నడతకు, నిర్దేశించిన విలువలకూ కట్టుబడి ఉండటంలో తృప్తిగా వుంటారు. సమూహంలో ఒకరుగా జీవిస్తారు. తోలుబొమ్మలలాగా సమాజం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. వారి వలన మార్పు, అభ్యుదయం ఉండదు. సమాజచైతన్యం ఉండదు. కానీ ఇవి లేనిదే మనిషికి మనుగడ లేదు, ముందడుగు లేదు. తార్కికమైన వివేచన విచక్షణలు ఒక సంపూర్ణజీవితానికి అవసరమని, ఆత్మపరిశీలన చేసుకోని బ్రతుకు బ్రతుకే కాదని ఎన్నో శతాబ్దాల మునుపే ప్రతిపాదించిన ఆ సోక్రటీస్ ప్రశ్నలు ఇప్పటికీ మనమధ్య సజీవంగా, ఒక అవసరంగా ఉండటానికి కారణం ఇదే. ఈ రకమైన పరిశీలన సమాజపు నడతకు లోబడినవారికి అనవసరం అనిపించవచ్చు. కాని, సమాజంలో మార్పు కోరేవారికి, అభ్యుదయాన్ని ఆశించేవారికి, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం కావడం అవసరం. సంగీతసాహిత్య చిత్రలేఖనాది కళలను అభ్యసించే కళాకారులకు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. తమకు సామాజిక బాధ్యత ఉన్నది అని నమ్మే తెలుగు రచయితలు ఈ రకమైన ప్రశ్నలతో తమను తాము పరిశీలించుకోవడం, తమ సాహిత్యాన్ని ఆ వివేచనతో సమీపించడం అత్యవసరం.
పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.
డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.
సుందరి దగ్గరికి వచ్చి నిల్చుంది. అరవడం మొదలుపెట్టింది. నేను నాన్న కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళు క్రూరత్వాన్ని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని ఏకకాలంలో చూపిస్తున్నాయి. నేను మాట్లాడకుండా ఉండడం గమనించిన సుందరి ఇంకా కోపంగా అరిచింది. నాన్న ఇప్పుడు ఉరిమి చూశాడు. ఆయన కళ్ళను చూసే ధైర్యంలేక నేను తలవంచుకున్నాను. ఒళ్ళంతా కరెంటు పాకుతున్నట్టు అనిపించింది. నాన్న కోపంగా లేచి నిల్చుని అరుస్తున్నాడు. సుందరి ఎడమవైపు నిలుచుని అరుస్తుంది.
ఆ గదిలో దీవాన్ వంటి దాని మీద తెల్లని పరుపు, పరుపుపై తెల్ల దిండు. పక్కన ఒక వార్నీష్డ్ చెక్కబల్ల, దానిమీద ఒక ఎర్రని పానాసోనిక్ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ కనబడేవారు కాదు. ఆ ఇంటిముందు నిలబడి నేను ఆ టేప్ రికార్డర్ కేసి ఇష్టంగా చూసేవాణ్ణి.
ఏం ఆశలని అడుగుతాడేమో అనుకున్నా. కానీ అడగలేదు. అతను మౌనంగా ఉండిపోవడం వెనుక నిరసన అర్థమవుతూనే ఉంది నాకు. వెళ్ళేదారిలో రోడ్ పక్కన కారు ఆపి మూర్తి టీ తెచ్చాడు. ఇద్దరం తాగాం. మూర్తి నా ఇష్టాయిష్టాలు ఒక్కటీ మర్చిపోకపోవడం ఎక్కడో కించిత్తు గర్వంగా అనిపించింది. కొద్దిగా మామూలు అయ్యాడు మూర్తి. నాలుగు గంటల ప్రయాణం. ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చాం.
ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక మీరు వెళ్ళిరండన్నాడు భార్యాపిల్లలను. జీవితంలో ఒక్క సరదాలేదు ఉత్త దద్దమ్మ అంటూ ఆవిడ సణిగింది, ఇప్పుడీ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి. అబ్బా, డాడీ, యూ ఆర్ యూస్లెస్ అన్నారు తొమ్మిదీ, పదేళ్ళ కూతుళ్ళిద్దరూ. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి ఏటా 50 లక్షల పాము కాట్లకి ప్రజలు గురి అవుతున్నారు. వీటిలో 27 లక్షలు విషసర్పాలు వేసే కాట్లు. దరిదాపు లక్షమంది మరణిస్తున్నారు. అమెరికాలో పాము కాట్ల వల్ల మరణించేది కేవలం ఐదు మందే! కానీ భారతదేశంలో వాటివల్ల ఏటా 58,000 చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానం!
పానవట్టం మీద
కిందనుంచి పైకి
పైనుంచి కిందికి
నీటి ఉత్థానపతనం
ప్రేమించడానికి పువ్వులెందుకు?
ఒంటినిండా దండలెందుకు?
తప్పించుకోడానికి సాధుజీవుల ముసుగేసుకుని
ఆకులు, అలములతో నోరు కట్టుకుంటారు
పొద్దుటి పోపు ఘాటుకు పొలమారిన గొంతులను
సంధ్యలో శృతి చేసుకుంటారు
అందుకే, నిగ్రహం విగ్రహం వదిలి
ఎప్పుడో నిమజ్జనమైపోయింది
ఇందులో ఎందరో మంచి మంచి స్నేహితులు, బంధువులు ఆత్మీయులుగా మారిన పరిచయస్తులు ఉన్నారు. చిన్న చిన్న సహాయాలు కూడా మర్చిపోని గొప్ప వ్యక్తులున్నారు. ప్రతిచోటా ఆదరించి అన్నం పెట్టిన తల్లులున్నారు, బీదరికంలో ఉంటూ కూడా. రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఇంటికి తీసికెళ్ళి సేదదీర్చిన ‘లఖ్నవీ అమ్మ’లున్నారు.
శరీరంబుట్టలో
మళ్ళీ తిరిగిరాని
పుట్టిన రోజులు
నిండుతూనే ఉన్నాయి
ఇంకెంత ఖాళీ ఉందో
ఎవరికి తెలుసు
అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకం మింగుడు పడకపోవచ్చు. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చివుకు కలిగించవచ్చు.
బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలినప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. నాకు నేనే ఆసరా, మనసును స్వాధీన పరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమవుతుంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: