కానీ ఒక్కసారి కృష్ణశాస్త్రి కవిత్వంలోనికి గాని మనం తొంగి చూసినట్లయితే అది నిత్యనవీనమని ఆ కవిత్వం నిత్యవసంతమని ఆ పువ్వులు ఎప్పటికీ వాడవని ఆ కవిత్వాన్ని మనం సమీపించకపోవడం ఒక్కటే మనం ఆ కవిత్వం తాలూకు వెలుగుకి దూరం కావడానికి కారణమని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారి ఆ కవిత్వాన్ని పునఃపరిశీలించడం ద్వారా, ఆ కవిత్వాన్ని చేరడం ద్వారా, ఆ కవిత్వానికి కైమోడ్చడం ద్వారా మనం మరొకసారి ఆ మహాకవికి నివాళిని అర్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాససమర్పణ.
నవంబర్ 2025
తెలుగు నేలమీద సాహితీ సమావేశాలు కొత్త కాదు. 1975లో మొదలు పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలనుండి అమెరికానుండి వచ్చే ప్రవాసాంధ్రుల సాహితీ సమావేశాల దాకా ఎన్నో సాహిత్యోత్సవాలు యేటేటా జరుగుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ తెలుగు భాషకే పరిమితమయ్యాయి. తెలుగు నేలమీద దక్షిణ భారత భాషలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చే, ఒక ఉమ్మడి వేదికను సృష్టించే ప్రయత్నం బలంగా జరగలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు కేవలం ఉమ్మడి ద్రావిడ భాషామూలాలు మాత్రమే కాదు, శతాబ్దాలుగా అల్లుకుపోయిన సాంస్కృతిక బంధాలు, విజయనగర సామ్రాజ్యంనుండి మద్రాస్ ప్రెసిడెన్సీవరకు ఉన్న ఉమ్మడి చారిత్రక అనుభవాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం మన సాహిత్యాలలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మనందరి సమస్యలు, సంస్కరణోద్యమాలు, ఆకాంక్షలు, పోరాటాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి.
తెలుగువారికి, తమ ఇరుగుపొరుగు భాషలైన తమిళ, కన్నడ, మలయాళ భాషలతో, వారివారి సాహిత్యాలతో పరిచయం చాలా తక్కువ అనేది తరచుగా వినిపించే విమర్శ. మన తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి మన పొరుగు భాషల సాహిత్యప్రియులకు తెలిసినంతగా, తెలుగువారికి కన్నడ, తమిళ, మలయాళ సాహిత్యాల గురించిగానీ, ఆ భాషా రచయితల గురించిగానీ అంతగా తెలియదన్న విమర్శలో కొంత నిజం లేకపోలేదు. అందుకు కొన్ని బలమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. విజయనగర రాజుల కాలంనుండి నాయకరాజులు, పీష్వాల పాలనాకాలం దాకా తెలుగే రాజభాషగా ఉండేది. మైసూరు రాజాస్థానంలోనూ తిరుమలరాయవంటి అనేక తెలుగు కృతికర్తలకు ఆదరణ లభించింది. అలాగే, కేరళ రాజైన స్వాతి తిరునాళ్ స్వయంగా తెలుగులో కీర్తనలు రాయడమే కాకుండా, త్యాగరాజు శిష్యుడైన కన్నయ్య భాగవతార్కు తన ఆస్థానంలో ఆశ్రయం కల్పించాడు. అంటే బ్రిటిష్ వారి రాకకు పూర్వం దక్షిణ భారతదేశంలో రాజభాషగా, సాంస్కృతిక భాషగా విశిష్టవైభవాన్ని గడించిన కారణంగా, దక్షిణ భారతదేశమంతటా తెలుగు మాతృభాష కాని వారికి కూడా తెలుగు అర్థం అవుతుంది. అందుకే తెలుగు వారి సాహిత్యం, కీర్తనలు, గేయాలు యథాతథంగానో అనువాదంగానో శతాబ్దాలుగా పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలలో తెలుగులోకి కొంత అనువాదం జరిగినా, తెలుగునేల మీద మన పొరుగు దక్షిణ భారతీయ సాహిత్యం గురించిన అవగాహన తక్కువేనని చెప్పుకోవాలి.
దక్షిణ భారతదేశంలో ఉన్న సాహితీ ఉద్దండులను తెలుగు వేదిక మీదకు ఆహ్వానించి, ఒక ఉన్నత స్థాయిలో, మేధోపరమైన సాహిత్య ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం సాధ్యమేనా? మన సాహితీకారుల మధ్య ఉండే సహజమైన భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, కేవలం సాహిత్యం కోసం, కొత్త గొంతుకలను వినడం కోసం అందరూ ఒకే వేదికపైకి రాగలరా? ఈ ప్రశ్నలకు కొద్ది రోజుల క్రితంవరకు చాలామందినుంచి “అది మనవల్ల కాదు, మనకు ఆ ‘సామూహిక సంస్కారం’ ఇంకా అలవడలేదు” అనే నిరాశాజనకమైన సమాధానమే వినిపించేది. కానీ, ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, హైదరాబాద్ వేదికగా గత నెలలో జరిగిన ‘ఛాయ లిటరరీ ఫెస్టివల్’ ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. ఇది కేవలం తెలుగు ఉత్సవంలా మిగిలిపోలేదు. దక్షిణ భారత భాషల ప్రఖ్యాత రచయితలనెందరినో ఒకే వేదికపైకి తెచ్చింది. విభిన్న భాషల మధ్య, ముఖ్యంగా అనువాదాల ద్వారా బలపడుతున్న సాహిత్య సంబంధాల గురించి అర్ధవంతమైన చర్చలకు ఇది వేదికైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాకూడదు. ఈ ఉత్సవం ప్రదర్శించిన సామూహిక విజ్ఞత, నిర్వాహణా కౌశలం, భవిష్యత్తులో జరగబోయే మరెన్నో సాహిత్య కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలి. తెలుగు సాహిత్యానికి, దక్షిణభాషా సాహిత్యాలకు, ఇది నిజంగా ఒక కొత్త వెలుగు ‘ఛాయ’.
“ప్రకృతి సూత్రాలన్నీ దేవుని ఆలోచనలే (The laws of nature are the thoughts of God)” – Orsted
తెలుగు రచయితలు చలం, గోపీచంద్వంటివారు క్రమేపి ఆధ్యాత్మికత వైపు, ఆశ్రమజీవనం వైపు వెళ్లారు. కానీ వారి ఆధ్యాత్మిక రచనలు వివాదాస్పదం కాలేదు. అయితే భైరప్పలో వచ్చిన మార్పు ఆధ్యాత్మికమైనది కాదు, మతపరమైనది కాదు, రాజకీయపరమైనది; చారిత్రక వాస్తవికతను అర్థం చేసుకోవడంలో వచ్చిన మౌలిక మార్పు. ‘ఆవరణ’ నవల దీనికి స్పష్టమైన ఉదాహరణ.
‘మనిషైతే మనసుంటే, కనులు కరగాలిరా! కరిగి, కరుణ కురియాలిరా! కురిసి, జగతి నిండాలిరా!’ అన్న మానవతావాదం ఆ కలానిది. ‘వాడ వాడల వాడే! జాడలన్నిట వాడే! ఇంటి ముంగిట వాడే! ఇంటింటిలో వాడే!’ అని దైవాన్ని అన్నిచోట్లా చూస్తూ ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అని విశదీకరించింది ఆ కలమే.
నాకు తెలిసేనాటికే ఆయన కవిత్వంలో సువర్ణమేరుశిఖరాన్ని అధిరోహించి, యుగనేతగా గౌరవపదాన్ని అలంకరించినవారు. అప్పటికే గొంతు మూగపోయింది. రవీంద్రుని 1927లో కలుసుకొన్ననాటి అనుభూతులను పదేపదే నెమరువేసుకొనేవారు. కాళిదాసు, భవభూతి, షెల్లీ, కీట్సు, బైరన్, తమ తండ్రి పినతండ్రులు, రాయప్రోలు, అబ్బూరి అంటే ఉపాసనతో కూడిన ఆరాధనాభావం ఉండేది.
ఇవన్నీ నన్నయ్యకన్న ముందు ఆవిర్భవించినవే. ఇక మిగిలినది చమత్కార మొక్కటే. అది తెలుగువారికి దక్కింది. ‘చమత్కారచంద్రిక ద్వారా విశ్వేశ్వరుడు దానిని సాధించి మనముందు నిలిపాడు. పరిణామక్రమంలో ప్రకృతవ్యాసంలో మనం అలంకారశాస్త్రానికి తమదైన వరివస్యను అందించిన తెలుగువారి గురించి-తెలుగువారి గ్రంథాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు.
కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధానంగా కనిపించే భావధారలు రెండే. మాధుర్యం, దుఃఖం.
ఆ విధంగా అతడి దాంపత్యజీవితం అపహాస్యం పాలై, దుఃఖాంతమయింది. ఆమె దూరం కావడం పిరాండెలోకు జీవితకాలమంతా దుర్భరమైంది. ఆమె జ్ఞాపకాలను దూరంచేసుకోవడానికి, అతడు ఆ ఊరు కూడా వదిలి మరో చోటికి కదిలిపోయాడు.
5000 మీటర్ల ఎత్తున ఎత్తుపల్లాలను దాటుకుంటూ నడవడం అంటే మాటలు కాదు. వేసే ప్రతి అడుగూ అదనపు సంకల్పశక్తిని కోరే సమయమది. ప్రతి నాలుగు అడుగులకూ ఒకసారి ఆగి, గుక్కతిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చే సమయమది. ఎంత అనుభవం ఉన్న ట్రెకర్లయినా ఆచి తూచి అడుగులు వేసే ప్రాంతమది.
తుఫాన్ వస్తుందని తెలీదు
గాలి సుడిగుండం
మునకేసిన పడవ
ఎనభైసార్లు జీవితంలోకి వెళ్ళొస్తున్నా
కప్పిపుచ్చుకోలేని నా ఆకారాలు
నన్నంటుకున్న నాచేష్టలు
ఈ ప్రక్షేపణ చెరసాల నుంచి తప్పించుకుంటే
ఏమైపోతాను?
ఏమీ కాకుండా మిగిలిపోతానా?
అక్కడికీ వస్తాయా ఆ కళ్ళు?
రెప్పపాటులో అంతా మారిపోయింది. తలలో విపరీతమైన పోటు. నలుగురు మనుషులు దిమ్మ దిమ్మ గుద్దినట్టు. నిలబడలేనితనం ఏదో ఆవహిస్తుండగా ఒక్కసారిగా ముందుకొరగబోయి తమాయించుకున్నాడు.
“నీ పెళ్ళాం గురిచ్చి తెలుసునన్నావుగా సారూ.”
“ఎందుకు తెలీదు?”
“సరే ఒక ప్రశ్న అడగతా వుండాను చెప్పు. నీ పెళ్ళానికి ఇష్టమైన రంగేంది? ఈ ప్రశ్నకు జవాబు చెప్తే నిన్ను వొదిలేస్తాను.”
కథలన్నీ జీవితాలనుంచి నడుచుకుంటూ వచ్చాయి కాబట్టి నిజాయితీగా ఉంటాయి. లోతైన పరిశీలనా దృష్టి ఉండటంతో దాదాపు అన్ని కథలలోనూ తాత్వికత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
బంగారానికి తావి అబ్బినట్టు, ఒక వృక్షశాస్త్రం చదువుకున్న వ్యక్తికి, ఆ శాస్త్రంపట్ల ఇచ్ఛుకత ఉన్న వ్యక్తికి, అదృష్టవశాత్తు వృత్తిపరంగా కూడా తాను చదువుకున్న జ్ఞానాన్ని ఉపయుక్తం చేసుకోగలిగే వెసులుబాటు కలిగి ఉండటం ఒక గొప్ప వరం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు స్వీయ గానం ఆకాశవాణి ప్రసారం
దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో ప్రసంగం1954, కాకినాడ
సంగీతం, గానం: పాలగుమ్మి విశ్వనాధం సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గానం: నూకల చిన సత్యనారాయణ సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: […]
గానం: ఓలేటి వెంకటేశ్వర్లు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఎన్. సిహెచ్. వి. జగన్నాథాచార్యులు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఆర్. ఛాయాదేవి సేకరణ: […]
వేణుకుంజం నాటకం లోని పాటలు – తెలుసా నా గుట్టు రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గాత్రం: వింజమూరి లక్ష్మి వేణుకుంజం […]
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: పి. బి. శ్రీనివాస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
“కృష్ణపక్షం”లో ప్రకృతితో తాదాత్మ్యంతో మొదలై, ఆత్మకీ, స్వేచ్ఛకీ, అద్వైతాన్ని తెలుసుకుని సౌందర్యాన్వేషణలో పండి, ప్రేమకై తపించి, విరహాగ్నిలో కాగి, లోకం చేత నిరసింపబడి, అత్మదైన్యంతో క్రుంగి; తరవాతి కావ్యమైన “ప్రవాసం”లో అన్వేషణ తీవ్రతరం కాగా, దుఃఖంతో నిర్వేదంతో ఐక్యం చెంది, చివరికి “ఊర్వశి” కావ్యంలో సాక్షాత్కరింప చేసుకున్నారు. తనలోని మౌలిక శూన్యాన్నించి కృష్ణశాస్త్రి సాగించిన ఈ అన్వేషణ, దుఃఖమూ, నిర్వేదమూ సాధనాలుగా, చివరికి ఊర్వశీ మూర్తిని అందుకుంది.