ప్రసిద్ధ భౌతికశాస్త్ర చరిత్రకారుడు అబ్రహం పైస్ (Abraham Pais), “ప్లాంక్, ఐన్‌స్టైన్, బోర్ల ప్రసిద్ధ పరిశోధనల తర్వాత, పాత క్వాంటం సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేస్తూ వచ్చిన పరిశోధనా పత్రాలలో నాలుగోది, చివరిది, విప్లవాత్మకమైనది బోస్ రాసినదే” అన్నాడు.
ఆగస్టు 2026
సంస్కృతమ్మున కన్నఁ గష్టమ్ము హెచ్చు
ఒక్క దానఁ పరిశ్రమమున్నజాలు
దాని కిద్దానికో? రెంటఁ దగులవలయు.
ఆదిభాషయందు నంతొ యింతొ ప్రవేశ మబ్బకున్న …
తెలుగునందు మీరు దిగకుడు.
(తిరుపతి వేంకటకవులు, నానారాజసందర్శనము, ఉత్తరార్ధము, 14-16)
తెలుగు భాషాసాహిత్యాలు 20వ శతాబ్దకాలంనుండి చాలా వింతైన పరిస్థితిని ఎదుర్కొంటున్నవి. 20వ శతాబ్దపు ఉత్తరార్ధానికి పూర్వం తెలుగు కవులకు, రచయితలకు విధిగా సంస్కృత వ్యాకరణం చిన్నతనంలోనే నేర్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి, వారికి సంస్కృత వ్యాకరణం క్షుణ్ణంగా వచ్చేది. సాహిత్య సృజన చాలావరకు సంస్కృత కావ్యాల అనువాదంతోనే మొదలయ్యేది, కాబట్టి సంస్కృత వ్యాకరణంలోని ప్రాథమికాంశాలు అన్నీ వారికి కరతలామలకంగా ఉండేవి. విశేషణ విశేష్యాలకు లింగ, వచన విభక్తులు తుల్యంగా ఉండాలన్నది సంస్కృత భాష వ్యాకరణలక్షణాలలో ప్రాథమికమైనది. వివిధ నామవాచకాలకు అష్టవిధ విభక్తి ప్రత్యయాలు, క్రియలకు దశవిధ లకారాలు (లట్, లిట్, లుట్ మొ॥), తిఙ్ ప్రత్యయాలు, కృత్ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు మొదలైన ప్రాథమిక విషయాలు తెలియకుండా ఎవ్వరూ సాహిత్య వ్యవసాయం మొదలుపెట్టలేదు. నన్నయ తిక్కనాదులు సంస్కృత సమాసాలను వాడితే వాటిని సంస్కృతంలోవలె లింగవచనాదుల సామ్యాన్ని విశేషణ విశేష్యాలలో చక్కగా పాటించి సంస్కృత వ్యాకరణానికి భంగం కలగకుండా ఉపయోగించారు. తెలుగు ఆదికావ్యమైన మహాభారత రచనలో మొట్టమొదటి పద్యమే పూర్తిగా సంస్కృతంలో ఉంది. నన్నయ్య ప్రవేశపెట్టిన సంస్కృతసమాస భూయిష్ఠమైన రచనను పాల్కురికి వంటి ఆనాటి దేశీయ కవులు నిరసించారు. ఉభయకవిమిత్రుడైన తిక్కన, దేశి-మార్గ కవితలకు మధ్యేమార్గంగా పయనిస్తూ, చాలా విస్తృతంగా క్రొత్త తెలుగు పదాలను, పదబంధాలను సృష్టించుకొన్నాడు. సంస్కృతం ప్రయోగించినప్పుడు మాత్రం సంస్కృత భాషామర్యాదను పూర్తిగా పాటించాడు. తరువాత వచ్చిన ఎర్రన అరణ్యపర్వశేషాన్ని పూరించి నన్నయ్య ప్రవేశపెట్టిన సంస్కృత సమాసభూయిష్ఠమైన రచనను పునరుద్ధరించాడు. శ్రీనాథుడు సంస్కృత, ప్రాకృత, శౌరసేనీ భాషలను చదవటమేగాక పాతంజల మహాభాష్యాన్ని కూలంకషంగా తరచి చూసినవాడు. ఈయన కాలంలోనే తెలుగుభాషకు తెలుగు ధాతువులనుండి కొత్త పదాలను సృష్టించే సామర్థ్యం పూర్తిగా నశించిందని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ సంస్కృత సమాసాలను యథాతథంగా తెలుగులో వాడటం, అధ్యక్ష- మొదలైన సంస్కృత నామాలకు -ఇంచు తగిలించి వాటిని తెలుగు క్రియలుగా ప్రయోగించి నూతన తత్సమధాతు నిష్పత్తికి ఈయన శ్రీకారం చుట్టాడని చెప్పుకోవచ్చు. పోతన కొంత మధురమైన కవిత్వం తెలుగులో చెప్పినా, సంస్కృత భూయిష్ఠమైన సమాసమార్గాన్నే కొనసాగించాడు. తెలుగు నుడికారాలైన ‘బూడిదలో పన్నీరు’ అన్నదాన్ని భసితక్షిప్తాజ్యము అంటూ, నెమలికన్ను అన్నదాన్ని కేకిపింఛాక్షులు అంటూ సంస్కృతీకరించి తనకు గల సంస్కృత విధేయతను చాటుకొన్నాడు. ఈ రకంగా తెలుగులో సాహిత్యవ్యవసాయం చేయాలంటే, తెలుగు, సంస్కృత భాషలు రెండింటిలోనూ వ్యాకరణం నేర్చుకోవాల్సిన అవసరం తెలుగు సాహిత్య సంప్రదాయంలో భాగంగా మారిపోయింది.
ఆధునిక కాలంలో సంస్కృతం క్షుణ్ణంగా నేర్చుకొన్న తెలుగు కవులు, రచయితలు చాలా తక్కువ. 20వ శతాబ్దపు పూర్వార్ధంలో విశ్వనాథ వంటి కవులు సంస్కృతంలో కవిత్వం రాయగల శక్తిమంతులు. శ్రీశ్రీ ఛందోబందోబస్తుల్ని నిరసించినా సంస్కృతభూయిష్టమైన ఆంధ్రాన్నే ప్రయోగించాడు. మహాప్రస్థానం, భిక్షువర్షీయసి వంటి శీర్షికలే కాకుండా “నిరుపహతి స్థలేత్యాదు లనవసరం. సదా కృతిః ప్రభవతి” అంటూ దీర్ఘసంస్కృత సమాసాలను, సంస్కృత వాక్యాలను ప్రతిభావంతంగా ప్రయోగించాడు. కానీ, ఉత్తరార్ధంలో రచనలు మొదలుపెట్టిన కవులు, రచయితలలో సంస్కృత అధ్యయనం బాగా తగ్గిపోయింది. తెలుగులో క్రొత్త పదజాలం సృష్టించాలన్నా, గంభీరమైన భావాన్ని వ్యక్తం చేయాలన్నా సంస్కృత శబ్దాలను, దీర్ఘసమాసాలను ఉపయోగించే అలవాటు మాత్రం ఆధునిక తెలుగు రచయితలు వీడలేకపోయారు. తెలుగు ధాతువులతో క్రొత్త పదాలను, క్రొత్త పదబంధాలను సృష్టించే ప్రక్రియ దాదాపు 13-14వ శతాబ్దంలోనే ఆగిపోయింది కాబట్టి, కాలానికి ఎదురీది, మోడువారిన తెలుగు కుదురులను తిరిగి వికసింపజేసి అచ్చతెలుగు క్రొన్నుడులను పుట్టించే ప్రయత్నాలు చేసినవారు చాలా తక్కువ. అట్టి ప్రయత్నాలు కొంతవరకు జరిగినా వాటికి ఆదరణ తక్కువ. దాంతో, 20వ శతాబ్దంలో చాలా వింతైన పరిస్థితి ఏర్పడింది. తెలుగులో క్రొత్తగా వ్రాయాలంటే, సంస్కృత శబ్దాలను కలగలిగి క్రొత్త పదబంధాలను తయారుచేయాలి. కానీ, ఇలా తయారుచేసే కవులు, రచయితలు సంస్కృత వ్యాకరణం నేర్చుకోలేదు కాబట్టి, ఆధునిక రచనల్లో ఎన్నో, ఎన్నెన్నో అపప్రయోగాలు, అపాణినీయాలు అసంఖ్యాకంగా దొర్లుతున్నాయి. లింగ విభక్తులకు, విశేషణ, విశేష్యాలకు మధ్యన సామ్యం తరచుగా లోపిస్తోంది. పూర్వపదం అకారేతర అచ్చులకు ఇతర, ఉదయ మొదలైన పదాలు పరంగా ఉన్నపుడు రాదగని గుణసంధి రావడం కనిపిస్తోంది. సంస్కృతంలో సహజమైన కర్మణి ప్రయోగాలు తెలుగులో అసహజం కాబట్టి, తెలుగువారు కర్మణి, కర్తరి ప్రయోగాలకు తికమకపడి పూర్తిగా వ్యతిరేక అర్థం వచ్చే సంస్కృత ప్రయోగాలను చేస్తున్నారు. సంస్కృత సమాసాల మూలార్థాన్ని అవగాహన చేసుకోకుండానే, “పద్మపత్రమివాంభసా(లా) జారిపోయే” అన్న ప్రయోగాలు, భానోదయం-, రఘోత్తమ- వంటి అపసంధులే కాకుండా, శబ్దాలంకారం కోసమో, లేక సంస్కృతశబ్దప్రయోగం వల్ల వచ్చే గొప్పదనం కోసమో, సంస్కృతంలో ఏ రకమైన అర్థమివ్వలేని దీర్ఘసమాసాలను ప్రయోగించడం కోకొల్లలుగా వెలువడుతున్న తెలుగు రచనలలోనూ, అమిత ప్రజాదరణ పొందిన సినిమా పాటలలోనూ కనిపిస్తున్నాయి.
వెయ్యి సంవత్సరాలకు పైగా పెనవేసుకొన్న తెలుగు-సంస్కృత భాషల అనుబంధం విడదీయరానిది. కాబట్టి తెలుగు రచనలలో విస్తృత సంస్కృత ప్రయోగాలు తప్పనిసరి అయినప్పుడు, తెలుగులో సాహితీ వ్యవసాయం చేయాలనుకొనే రచయితలు, కవులు తాము ప్రయోగించే సంస్కృత పదాల మూలరూపం, వ్యాకరణం తెలుసుకొని వాడటం కూడా తప్పనిసరి అవుతుంది. నిజానికి సంస్కృత వ్యాకరణంలో ప్రాథమిక సూత్రాలు, సంస్కృత వ్యాకరణ పరిభాష తెలియకుండా చిన్నయసూరి వ్రాసిన బాలవ్యాకరణం అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. తిరుపతి వేంకటకవులు చెప్పినట్టు, “సంస్కృత భాషయందు అంతో ఇంతో ప్రవేశ మబ్బకున్న, తెలుగునందు రచనకు దిగకుడు,” అని చేసిన హెచ్చరిక నేటి తరానికి కాస్త కఠినంగా అనిపించినా, శబ్దదోషాలు, అపప్రయోగాలు, అన్వయదోషాలు లేని సాహిత్య సృజనకు సంస్కృత వ్యాకరణాన్ని ప్రాథమికస్థాయిలో నైనా అధ్యయనం చేయాలన్న సూచన అనుసరణీయం.
ఈ దృష్టితో చదివినప్పుడు రాధికాసాంత్వనం ఒక శృంగార కావ్యంగా మాత్రమే కనిపించదు. అది ఒక కవి, ఒక కథ, ఒక దైవం, ఒక నాయకురాలు, ఒక సహృదయ పాఠకుడు — వీరందరి మధ్య ఏర్పడే సాహిత్య అనుభవంగా కనిపిస్తుంది.
“అభయుడిమీదా, జీవకుడిమీదా చూపించే అభిమానం నీ తండ్రి ఎప్పుడైనా నీ మీద చూపించాడా? ఇప్పుడు నువ్వు రాజువి కాకపోతే, అభయుడికి బింబిసారుడు రాజ్యం ఇస్తాడనేది తధ్యం. ఆ తర్వాత నీ జీవితం ఏమౌతుంది? నీ ఇష్టం, మరోసారి ఆలోచించుకో,” దేవదత్తుడు లేచి వెళ్తూ చెప్పాడు.
ఈ శాఖకు ఇరవై ఐదేళ్ళు సేవ చేసినందుకు ఒక చిన్న రాయితీ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఎంతమంది దోచుకోవట్లేదు; ఒక్కొక్కళ్ళయితే వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు మింగేశారంటున్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని, బ్యాంకుల్లో పై స్థాయి ఆఫీసర్లను చూళ్ళేదూ?! వాటితో పోలిస్తే ఇదేం పెద్ద తప్పని?
కాలం గడిచే కొద్దీ నేర్చుకున్న విద్య నశించిపోతుంది. బలంగా వేళ్ళూని ఉన్న వృక్షాలూ పడిపోతాయి. చెరువుల్లో చేరిన నీరూ ఇంకిపోతుంది. దేవతలకు ఇచ్చిన ఆహుతి, అర్థులకిచ్చిన దానము శాశ్వతంగా ఉండిపోతాయి.
ఆ సినిమాలో ప్రారంభంనుండి చివరిదాకా వీస్తున్న పొగమంచులోంచి కొట్టుకు వస్తున్న ఎండుటాకుల్లాగా, ఆ రాత్రంతా మల్లిఖార్జున్ మనసులో కూడా ఎడతెగని వాన కురుస్తూనే ఉంది.
గుండెలు అవిసిపోయే దుఃఖంతో క్రిసెస్ మార్గం తోచక తన ఇష్టదైవం అయిన అపోలోకి ప్రార్థన రూపంలో విన్నపం సమర్పించుకున్నాడు. తన ఆప్తుడికి ఎదురయిన కష్టాన్ని చూడగానే అపోలోకి కోపం వచ్చి అగమేమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపించేడు.
“మీరు ఏమీ అనుకోనంటే, ఒక మాట… మీరు నాతో డేట్‌కి వస్తారా?” అని ధైర్యం కూడగట్టుకుని అడిగేశాడు.
వేయబోయిన అడుగు ఆగింది కానీ, ఆమె అతని వైపు తిరగలేదు.
మలిన కౌశేయ వస్త్రము మయిన దాల్చి
తరువు నూతగ నిల్చిన తమ్మికంటి
మచ్చ లెరుగని సొచ్చెపు మెచ్చులాడి
యేల వగచుచుంటి విచట? యెవరు నీవు?
నన్నెవరెట్టిమాట యనినన్ సహియింపవు కస్సుమందు వా
తెన్నునబోక నేను కడు తేలికగా గయికొందు నన్నిటిన్,
నిన్నటిదాక కాచితివి నీవె భరించితి వన్ని, యింకపై
నన్నియు సూటిగా తగులు నాలన డాలగునా? సుమంగళీ!
సాయంత్రపు గగనంలోని రంగుల్లోకి దూకినట్లు
ఆమె చూపుల్లోకి దూకాలని ఉంటుంది
దూకి, మరి పైకి తేలకుండా,
రంగుల లోతుల రహస్యాల్ని పట్టుకోవాలని
కలల పూపొదల జావళులు పాడిన గళము
రవళింపదిది యేమి రమణు గాంచియు నిపుడు
మౌనమే మిగులునా బ్రతుకులో
కన్నీటి చుక్కల్లో కథలు ఎవరికీ వినబడవు
గాలికెగిరిపోతున్న కొత్త కొత్త ఆశలు
విరిగిన స్వప్నాలను దాచుకున్న చిరునవ్వు
మనసులోని మాట కోసం కొట్టుకులాడతాయి
నిన్న బడికి రానోళ్ళంతా
ఒక లైను కట్టుండ్రి అంటే
‘మా అమ్మను మా నాయిన కొట్టిండని’
రెక్కలు ముడుచుకున్న పిచ్చుకపిల్లలెక్క
కండ్లు నలుచుకుంట చేతులు చాపుతది
లక్షల భావాలతో అనునిత్యం చెరచబడ్డ నేను
నువ్వనుకున్న పవిత్రతకు ఓటెయ్యలేను
త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము, చంద్ర తారావళి అన్న మూడు కావ్యాలలోనూ “ఇది రావిపాటి త్రిపురాంతకుని కృతి” అని చెప్పటానికి నికరమైన ఆధారమేమీ లేదు. సంపూర్ణంగా దొరికిన త్రిపురాంతకోదాహరణము లోనూ కృత్యాద్యంతాలలో ఎక్కడా రావిపాటి త్రిపురాంతకుడని కర్తృనామం చెప్పబడలేదు.
సంపూర్ణ సూర్యగ్రహణం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగవచ్చు. చంద్రగ్రహణం కొన్ని గంటలు మాత్రమే కొనసాగవచ్చు. కానీ ఆర్యభట నెలకొల్పిన ఖగోళ సంప్రదాయం పదిహేను శతాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఆ వారసత్వాన్ని మూఢభక్తితో ఆరాధించడం కంటే, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృష్టిని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితులము అవడమే మనం వారికి అందించగల నిజమైన నివాళి.
రత్నాన్ని గమనించండి. రత్నం ఒకటి, దాని మెరుపు మరొకటి అని చెప్పలేము. మెరుపులేని రత్నం సాధారణ రాయిలాగే కనిపిస్తుంది. రత్నత్వాన్ని వ్యక్తపరచేది దాని కాంతి. కాంతిని రత్నం నుండి విడదీయలేము; రత్నాన్ని కాంతి లేకుండా నిర్వచించలేము. రెండుగా చెప్పబడుతున్నా, అవి వాస్తవానికి విడదీయరాని ఏకస్వరూపమే.
గాంధీగారి గురించి చదువుతున్నప్పుడు వచ్చే అనుభూతి కాకుండా, ఆయన నివసించిన సబర్మతీ ఆశ్రమంలో ఆయన రాట్నం వడికిన చోటుని, కూర్చుని రాజకీయ నిర్ణయాలు తీసుకున్న గదిని చూసినప్పుడు కలిగే అనుభవానికి ఒక ప్రత్యేకత తోడవుతుంది.
ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆ భాషలలోని మెలకువలు తెలియవు. లేకుంటే భాషాంతరానుసృజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్ధార్థ స్ఫూర్తిని కూడ కలుగజేస్తుంది. మూలగ్రంథం దీర్ఘంగా ఉన్నప్పుడు దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి. మూలంలోని పదాల్లో అర్థం అస్పష్టంగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్థం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్పడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి.
కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ద్వీపం కార్ నికోబార్. అంతా సమతల ప్రదేశం. పరిణతిగల రహదారి వ్యవస్థ. ఎటు చూసినా బీచ్‌లు. ఆ మారుమూల ద్వీపాలలో మనుషుల్ని ఆకర్షించి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోమని ప్రేరణ కలిగించే శక్తీ వనరులూ కలది కార్ నికోబారే.
ఈ వాస్తవ సంఘటనల సమాహారం, ఒక పెద్ద మాప్ని దగ్గర పెట్టుకుని, ఒకే సమయంలో వేరు వేరు చోట్ల జరిగిన సంఘటనలు, వాటి మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న కారణాకారణ సంబంధం గురించి తెలుసుకున్నట్లు ఉంటుంది. ఇది ఒక దేశచరిత్ర కాదు; మానవుల మనుగడ చరిత్ర.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు: 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.
ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం”కు 2026 సంవత్సరానికిగాను ఇరువురు రచయితలను ఎంపిక చేశాము.