నిశ్చల స్థితికి గుండె చప్పుడే అడ్డుపడుతూ. అస్తిత్వానికి ఏ అదనపు ప్రాధాన్యతా లేదు. నువ్వూ ఈ ప్రకృతిలో భాగమే అని కణకణంలోనూ ఇంకించుకుంటే గనక సాటిజీవిని అపార కరుణతో చూస్తావు. నేను ప్రత్యేకమనే అతిశయమేదో డ్రైవ్‌ చేయకుండా మనిషనేవాడు ఎట్లా బతకాలి? అందరూ అదే అతిశయంలోకి వచ్చాక అది అతిశయం కాకుండా పోతుంది. అప్పుడు ముందువరసలోని వాళ్ళు ఇంకో అతిశయాన్ని మోస్తూవుంటారు కదా?

ఫోనులు రాజ్యమేలే ఈ రోజుల్లో ఉత్తరాలేమిటండీ అంటే, ‘ఉత్తరమే నా ఆయుధం. చూస్తూ వుండండి రిప్లయ్ వస్తుంది’ అనేవారు. ఆశ్చర్యం! అలాగే సమాధానాలు కూడా వస్తూ వుండేవి. యే పుస్తకం కావాలన్నా ఆ పుస్తకం ఆయన షాపులో వుంటే సరే, లేదంటే యెక్కడుందో వెతికి సాధించి ఆయనకు అందజేసేదాకా ఒంటి కాలిమీద వుండేవారు.

మొదటి రోజు జనం చాలామంది ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు. స్టేడియం వేదిక మీద ఏం జరిగేదీ పెద్ద తెరల మీద అందరికీ కనిపిస్తూంది. అన్ని టీవీ చానెల్స్ లైవ్ కవరేజ్ ఇస్తూ, వచ్చిన వాళ్ళ స్పందనలు కనుక్కుంటూ మధ్యమధ్యలో సగం కాలిన పాప మృతదేహాన్ని చూపుతూ అతను చేసిన ఘాతుకాన్నీ, పోలీసులు ఎంత చాకచక్యంగా రెండ్రోజుల్లోనే ఎలా పట్టుకున్నదీ, అయిదోరోజునే శిక్ష ఎలా అమలు చేస్తున్నదీ వివరిస్తున్నారు.

1820లో మదరాసు స్కూలుబుక్కు సొసయిటీకి సదరు కోర్టు ఇంటర్‌ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది.

అయినా విషాదాన్ని మోశాం అకారణంగానే. నిరంతర దుఃఖితులుగా బతికాం ఆయాచితంగానే. ఇప్పుడీ తటస్థ బిందువు మీద నిశ్చలంగా, ఈ గాలిబుడగలో పదిలంగా ఎదురుచూస్తున్నాం. లోతుగా లోతుగా మెలాంకొలిగ్గా జీబురు జీబురుగా ఏళ్ళకేళ్ళు సాగదీశాక ఒక్కపూట, ఒక్కపూట కావాలనే, అదేంటో చూద్దామనే ఢమఢమ మెరుపుల్ని లౌడ్‌స్పీకర్లో వేసి గదిగోడలతో పిచ్చినాట్యాలు చేయించాం.

గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకి మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు.

మరో రెండు మూడు వారాలు గడిపితే బావుండునన్న ఊహ. నచ్చిన దేశాన్ని వదిలివెళ్తున్నందుకు చిన్నపాటి బెంగ. అమెరికాలూ, ఆస్ట్రేలియాలూ, జర్మనీలూ తిరిగినపుడు తెలియకుండానే పరాయి దేశమన్న స్పృహ నావెంట ఉంటూవచ్చింది. సింగపూరు, ఇండోనేషియాలు వెళ్ళినపుడూ అవి విదేశాలనే అనుకొన్నాను. మరి ఈ థాయ్‌లాండ్‌లో ఎప్పుడూ లేనిది ఈ స్వదేశ భావన ఏమిటీ?

ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి ఈ విశాల విశ్వం అంతానూ ప్రాణికోటితో, వివిధ గ్రహాలపై వివిధ జాతులకు చెందిన వైవిధ్యమైన కంఠధ్వనుల రొదలతో నిండిపోయుండాలి కదా! కానీ దీనికి విరుద్ధంగా ఎటు చూసినా కలవరపరిచేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందుకేనేమో, ఈ సృష్టివైరుధ్యాన్ని మహా నిశ్శబ్దం అని పిలుచుకుంటారు ఈ మనుషులు.

మాట్లాడ్డం మొదలుపెట్టడానికి ముందుగా ఒక సిగరెట్టందించేడు కమిసార్. నేను వెంటనే ఒక రెండు దమ్ముల్లాగి అందులో మూడో వంతు అవగొట్టాను. అప్పటికి కొన్ని రోజులుగా నేను సిగరెట్ మొహం చూళ్ళేదు. అంతకు ముందు వ్రాసిన ఉత్తరంలో సిగరెట్లు పెట్టలేదు మా అమ్మ. కొద్ది రోజుల్లో తనే నన్ను చూడ్డానికి తెల్లగుర్రపు సరస్సుకు వస్తానని వ్రాసింది.

ప్రేమ వర్షం కురిపిస్తుందనుకున్న మేఘం
నిర్దయగా పిడుగుల్ని విసిరినా
వెలుగు నిస్తుందనుకున్న దీపం
వేల మిణుగురులుగా మారి
అనంత శూన్యంలోకి అదృశ్యమయినా
ఆగకు

మనకి చెప్పుకోడానికి చరిత్ర లేదు. అది లేకపోవడమే నా శిరోభారానికి మూలం. అవును ఏం ఉన్నా లేకపోయినా పాలకులకి చరిత్ర ముఖ్యం. అదెంత బాగుంటే… అంత బాగా మనం గుర్తింపు పొందుతాం. అర్ధవయ్యిందా? అందుకని మనం మన చరిత్రని రాయించుకోవాల! అవసరమైతే అసలు చరిత్రలని తిరగ రాయించెయ్యాల. అడ్డొస్తున్నాయనుకుంటే ఆ పాత చరిత్రలని చింపి పారెయ్యాల!

ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్ళతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్ళినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…

ఆటల మైదానాల్లో స్కోరర్‌ని నేను. ఆటతో పాటు జీవితాన్ని రికార్ద్ చేయడం నా పని. ఇప్పుడు ఈ పుస్తకానికి ఒక ‘ముందు మాట’ అంటూ చెప్పాలి కాబట్టి–ఎందుకు ఈ రాతలు ఇప్పుడు? ఇలాగని? పెదాలు బిగించుకుని మోకాళ్ళ మీద కూచుని జుట్టు కళ్ళమీదికి జారుతుంటే చేత్తో తోసుకుంటూ, చాలా చిన్నవాడిగా, ఇంటా బయటా గోడల మీద బొగ్గుతో నల్లబొమ్మలు గీసే నేనే నాకు కనబడతా.

ఆయనంటే అందమైన పుస్తకానికి చిరునామా. పుస్తక ప్రియులకి విజయవాడలో దర్శనీయ స్థలాల్లో నవోదయ ఒకటి. దాని అధిపతి రామమోహనరావంటే సీటు వదలని విక్రమార్కుడు. స్నేహానికి, పుస్తకాల ప్రచురణకి ఆయనొక అగ్ మార్కు. విశిష్ట ప్రచురణకర్తగా రామినేని అవార్డు అందుకున్న నవోదయతో అరమరికలు లేని సంభాషణం!

కార్యమో, కాలక్షేపమో ఏదీ తోచక సగం నిద్రలో ఎడం చేత్తో ఏవో జ్ఞాపకాలు రాసిపడేసిన (మన నెత్తిన) తీరు కథలు కావు… పుస్తకం నిండార వున్న చిన్న చిన్న సంగతులన్నీ మనిషి స్పృహ తాలూకు తేమ ఏ మాత్రం ఎండిపోకుండా వున్నా, దానికి పని కల్పిస్తాయి. పత్రికల్లో వార్త చదవనివాళ్ళకు సైతం వారి ఆలోచనల్లో చిన్నపాటి సుడిగుండమొకటి బయలుదేరి ‘వాట్ మస్ట్ బి డన్?” అని నిలదీస్తుంది.

నవోదయలో అడుగిడిన సాహితీవేత్తలంతా వెలుగుమూర్తులే! ఆ వెలుగే ఇదంతా! మంచి పుస్తకానికి చిరునామా నవోదయ! మహోదయుల సాయంకాలపు సంగమమై 50యేళ్ళు వెలిగింది. పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభంలా నవోదయను నిలపాలన్నది నా కల. నేనింకా ఆ కల కంటూనే ఉన్నాను. నవోదయ పుస్తకాలు తెలుగు భాష ఉన్నంతవరకూ సజీవం. తెలుగు భాష ఉన్నంతవరకూ నవోదయ సజీవం.

సృజనలో అసందర్భంగానైనా, అసంబద్ధంగానైనా తాము చెప్పదల్చుకున్నది చొప్పించే కళాకారులు చుట్టూ ఉన్న ప్రస్తుత కాలంలో, కళ కళ కోసమే అన్న భావనను ఇంత బలంగా చిత్రించిన నవల రావడమే ఆశ్చర్యం. ఒకసారి సృజన నీ నుండి వేరు పడ్డాక, అదిక నీది కాబోదన్న మాటలను, రచయిత పండించుకున్న విధానమిది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

క్రితం సంచికలోని గడినుడి-38కి మొదటి పది రోజుల్లోనే పదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, వైదేహి అక్కిపెద్ది, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, బండారు పద్మ, సరస్వతి పొన్నాడ, విజయాదిత్య, రవిచంద్ర ఇనగంటి.

గడి నుడి-38 సమాధానాలు, వివరణ.

విమల్‌కు చేతులు కాళ్ళు వణకసాగాయి. మిథున్ సంచి, స్సాక్స్, నీళ్ళ సీసా అన్నీ కారులోనే ఉన్నాయి. విమల్ లేప్‌టాప్, పుస్తకాల సంచీ, ఫైళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మిథున్ మాత్రం లేడు. ఏం జరిగింది? బిడ్డ ఎలా తప్పిపోయాడు? అన్నది వాడి బుర్రకు అందలేదు. బయలుదేరే తొందరలో బిడ్డను కారులో ఎక్కించడం మరిచిపోయాడా? వాడికి నమ్మబుద్ధి కాలేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది.