ఇపుడు మేము నడుస్తున్నది దిగువ హిమాలయాలలోని అడవులలో… మర్సియాంగ్దీ నదీలోయలోని పర్వతాల సానువుల్లో ఉన్న అరణ్యాలలో.. ఆ లోయకు అటూ ఇటూ ఎగసి నిలచిన పచ్చని పర్వతచరియల్ని చూస్తోంటే ప్రకృతి తన కళాత్మకతనంతా ఇక్కడే పొందుపరచిందా అనిపించింది. పచ్చని అడవులు, వరి పొలాలు, జలపాతాలు – అన్నీ చక్కగా అమరిపోయి ఉన్న ఆ సుందరసీమ ప్రకృతి గీసిన బృహత్తర వర్ణ చిత్రం కాదూ?!

పిసపిసలాడే మాంసపు ముద్దలని, చీము, నెత్తురులని కనబడకుండా కప్పెట్టి మన కొక బాహ్య సౌందర్యాన్ని కల్పించి, మనకి ఒక ఆకర్షణని, వ్యక్తిత్వాన్ని ఇస్తుంది చర్మం. మన స్పర్శ జ్ఞానానికి మూలాధారం చర్మం.

1752 జూన్ నెల వానా కాలం. కొడుకుని తీసుకొని ఫ్రాంక్లిన్ మైదానానికి వెళ్ళాడు. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. గాలికి పటం అటూ ఇటూ కొట్టుకుంటూ ఎగురుతూ మిన్నంటుకున్నది. ఓ మబ్బు గాలిపటాన్ని రాసుకుంటూ వెళ్ళింది కాని ఏమీ జరగలేదు. ప్రయోగం విఫలమైందని విచారిస్తుండగా మరో మబ్బు పటాన్ని తాకింది. దారానికి గల పోగులు రోమాల్లా నిక్కబొడుచుకున్నాయి – ఒకదానికొకటి దూరంగా, అవన్నీ విద్యుద్వాహకమైన తీగె మీద ఉన్నట్లుగా. ఫ్రాంక్లిన్ తాళం చెవిని మెటికతో తాకాడు. స్పార్క్ వచ్చి షాక్ కొట్టింది. ప్రయోగం సఫలమైంది.

గిడుగు నుంచి గురజాడ వరకు అందరూ వ్యావహారికాన్ని శిష్టతతో ముడివేశారు. ఆంగ్లేయులు, అగ్రవర్ణములవారు, ఇంగ్లీషు దొరలు పాలించే అభివృద్ధి చెందిన ప్రాంతాల నగరీకరణ చెందిన ప్రజలు వ్యావహారిక భాషకు మూలస్థంబాలు ఈ సంస్కర్తల దృష్టిలో. తెలుగు దళితవాదం కూడా వలసవాద భక్తి, ఆంగ్ల పాశ్చాత్య అనురక్తి అనే ఆధునిక అగ్రవర్ణ వలయంలోనే తిరుగుతోంది.

తిలక్ చేయి తిరిగిన కథకుడు కావడం మూలాన తన కవిత్వం మరింత ఆకర్షణీయంగా తయారైంది. అలాగే కవిగా తిలక్ లోని భావుకత్వం, ఊహాశక్తి తన కథల స్థాయిని పెంచింది. వెరసి తిలక్‌లో మెరిసే వ్యంగ్యం – బిగుసుకు పోయిన మనిషికి సైతం జీవం ప్రసాదించ గలదు.

ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలి కేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరు కాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.

స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషనీయం.

పద్యం ఇట్లాగే మొదలవ్వాలన్న నిబంధనను ఇష్టపూర్వకంగా అతిక్రమించటంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. లోలోపల సుడులు తిరిగే ఒక భావధార ఎట్లా ఉబికివస్తే అట్లా ఆ వాక్యపు చిటికెన వేలు పుచ్చుకొని పిల్లాడిలా హాయిగా నడక ప్రారంభిస్తాడు. మనం కూడా ఆ హాయితనంలో బుడుంగున మునిగిపోయి, కవిత పొడవునా పరుగులు తీస్తాం.

రవిశంకర్ మన మధ్యే తిరుగుతున్న మన కవి. ఈయనకు ఏటిపుట్టేడాదీ మనకు దైనందినంగా తోచే సాధారణమైన అనుభవాలు – నిద్ర లేవడం, ఇంట్లో భార్యాబిడ్డలను చూసుకోవడం, బయట ప్రకృతిని గమనించడం వంటివి – పునరాలోచించాల్సిన అనుభవాలై మమత్వం వాటిని పెనవేసి అనుభూతులై మిగిలాయి. ఇలా నిజాయితీగా రాసి తన కవిత్వం మీద తాను నిలబడగలిగిన కవి విన్నకోట రవిశంకర్.

పట్నం వాసనలు తెలియని మారుమూల పల్లెటూరు. మంచు కురుస్తున్నపుడు శరద్వెన్నెల జల్లుల్లో ఎక్కడో దూరాన విరిసిన చుక్కల ఆకాశం రాల్చిన మరీపల్చని కాంతుల్లో, మెత్తని ఇసుక నేల మీద పక్క పరుచుకుని రాత్రికాబోతుందనగానే మాటుమణిగే ఊరు. అటువంటి ఏగ్రామంలోనో ఉన్నామని భావించి ఈ ‘ఊరు’ కథలు చదవాలి.

రాష్ట్ర విభజన జరిగింది కానీ, సాహిత్యచరిత్ర విభజన లో చాలా సమస్యలున్నాయి. విడివిడి సాహిత్య ప్రయాణం ఉన్నది నిజమే కానీ, ఆ దారులు అనేక కూడళ్లలో ఒకదానినొకటి కలవకుండా లేవు. కొంత దూరం కలసి నడవకుండానూ లేవు. ఒకే సమీకరణలోకి రెండు సాహిత్యాలను బలవంతంగా చేర్చడం అనవసరం. అట్లాగని, ఒకరి సాహిత్యం మరొకరికి పూర్తి పరాయిది కూడా కాదు. నన్నయ, శ్రీనాథుడు తెలంగాణకు అవసరం లేనివారు కాదు, సోమన, పోతన లేకుండా ఆంధ్రవారికి గడుస్తుందనీ లేదు.

దాశరథి తెలుగుదేశంలో ఒక భాగమైన స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించాడు. తాను ఉద్యమంలో వీరుడుగా పాల్గొని కష్టనష్టాలకు గురి అయ్యాడు. ప్రజాశక్తులతో కలిసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్యరంగంలో దూకించాడు. విశాలాంధ్రచరిత్రలో తెలంగాణా విషాద గాథను, విప్లవచరిత్రను కలసి చదువుకున్నప్పుడే సమగ్రత వచ్చేది. తెలుగు దేశంలో మూడవవంతు తెలంగాణం, దానిని మేల్కొల్పి యావందార్థంతో చెలిమి కలిపిన కవికిశోరం దాశరథి.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.

“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ కనబడు చెప్తాను. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి. నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.

పెద్ద ఇల్లు, కార్లు, తన స్థాయికి సరిపోయే భర్త, తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు, ఇటువంటి ప్రవాస భూతల స్వర్గంలాంటి తన జీవితంలో తనను తాను మరిచిపోయి వేగంగా పరుగెత్తే జడపదార్థం ఆమె.