ఒకానొక కాలంలో విశ్వాసం ఒక జీవితకాల సాధన. మించి సాధించదగింది లేదు. ఈనాడు ‘నేను విశ్వాసిని’ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు. అది మూఢులకు. మనం మేధావులం. విశ్వాసం నీళ్ళను మద్యంగా మారుస్తుంది. మనకీనాడు మద్యం మంచినీళ్ళు.

“నేను నీకు చేసిన ద్రోహం ఏదీ లేదు. మన బిజినెస్‌లో డబ్బులేమీ నొక్కేయలేదు. అయినా అంతమాత్రానికే కాల్చిపడేయరు కదా ఎవరూ! నీ గురించి చెడు ప్రచారమేదీ చేయలేదు నేను. నీకు రావలసిన దేన్నీ తన్నుకుపోలేదు. మా మధ్య ఏదన్నా నడుస్తుందని అనుమానించడానికి సుజనతో అంత క్లోజ్‌గా ఎప్పుడూ లేను.” ఆగి అన్నాడు, “ఎవడన్నా నా మీదో, సుజన మీదో కోపం పెట్టుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి నీకు పంపుతారంటావా?”

ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం!

ఆవిధంగా నేను బాగా గమనించింది ఏంటంటే, N ఏమాత్రమూ ఏదీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, తన కుర్చీ చేతులను గట్టిగా పట్టుకుని అటూ ఇటూ మెలికలు తిరుగుతున్నాడు, కనీసం ఒక్కసారి కూడా నావైపు తలెత్తి చూళ్ళేదు, అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్నాయి అతని చూపులు, శూన్యంలో దేనికోసమో వెతుకుతున్నట్టు, నేను మాట్లాడేదాంట్లో ఒక్క అక్షరం కాదు కదా అసలు నా ఉనికి కూడా ఆయన ఎఱుక లోకి కూడా వెళ్ళుండదు.

తోటాన్ అందులోకి కనెక్ట్ చేసుకుని రిసీవర్ చెవికీ భుజానికి మధ్య నొక్కి పట్టుకుంటారు. అదే ఒకే తీరున చెవిలో ర్‍ర్‍ర్‍ర్ర్‍ర్‍ మంటూ మోగడం మొదలవుతుంది. తోటాన్ అది వింటూ ఉంటారు. ఆయన తల వేలాడదీసిన లోలకంలా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాసేపటికి ఒక పక్కకు ఒరిగిపోతుంది. కళ్ళు మూసుకుపోయి, నోరు తెరుచుకుని, భుజాలు సడలి పక్కనున్న ఆలివ్ గ్రీన్ బీరువా మీదకు ఒరిగిపోయి కూర్చునుంటారు.

పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!

చీకటిని ఆహ్వానించారు
కరెంట్‌ను తరిమికొట్టి
నక్షత్రాలు వెలిగించారు
ఎక్కడో, ఈ భూగ్రహంపైనే
గాలి చెలరేగిందిట.
ఎవరో సత్యాన్ని కనుగొన్నారట.

పైన పోతున్న పక్షుల గుంపు
పచ్చదనాన్ని పాటగా
గూట్లోకి తీసుకెళ్తున్నాయి
పాటలు వింటున్న పీతలు
బొరియల్లో
మాగన్నుగా కునుకు తీశాయి

పలుగులు పట్టిన
మేధావుల తవ్వకాల్లోనూ
కాలుష్యం పొర్లి ప్రవహిస్తుంటుంది

ఎవరి పల్లకీ ఎవరు
ఎందుకు మోస్తున్నారో
బోయీలకు సైతం బోధ పడదు

ఆ మొక్కలూ మొదళ్ళ చుట్టూ మన్నూ
పచ్చని తోటగా కొత్తరూపులెత్తాక
కొమ్మకొమ్మకూ పిట్టలు చేరికయ్యాయి
వాటిలో యాంగ్రీబర్డ్స్ కొన్నుంటాయని
అవి యుద్ధానికి కాలు దువ్వుతాయని
మాకు తెలీలేదు
మీకూ తెలిసినట్టు లేదు.

కాలం క్షణికమా? శాశ్వతమా? స్థిర రాశా? చర రాశా? మనం పరిశీలిస్తున్న వస్తువులలో వచ్చిన మార్పుని కొలిచే సాధనమా? లేక మార్పుకి మరో పేరే కాలమా? అది మనలో భాగమా? పరిశీలించే హృదయానికే దాని అస్తిత్వం అవగతమౌతుందా? లేక ఇతర అస్తిత్వాలతో సంబంధం లేకుండా తన కొక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదా? రెండువేల సంవత్సరాలకు పైగా ఈ ప్రశ్నలు శాస్త్రజ్ఞులని, తత్త్వవేత్తలనీ సమానంగా సవాలు చేశాయి.

వయసు, అనారోగ్యాల కారణంగా అంబేద్కర్ తన భార్యకి మూడు లక్షణాలు ఉండాలి అనుకున్నాడు. తనకు కాబోయే భార్య విద్యావంతురాలు, వైద్యురాలు, వంటనేర్చిన వ్యక్తి కావాలని ఆయన కోరుకున్నాడు. సవితా అంబేద్కర్ ఆ పాత్రలు అన్నీ ఒక ఆధునిక ఆదర్శ గృహిణిగా పోషించినట్లుగా ఆమె కథనం ఉంది.

శంతనుడికి ఒక అన్నగారు ఉన్నారన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఈ అన్నగారైన దేవాపి – బొల్లి (రోగం) వల్ల రాజ్యార్హతని పోగొట్టుకుని అడవులలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోబట్టే చిన్నవాడైన శంతనుడికి రాజ్యం దక్కింది. తరువాత తరంలో దేవవ్రతుడికి దక్కవలసిన రాజ్యం మరొక విధంగా చెయ్యి జారిపోయింది. పోనీ శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన ప్రథమ సంతానమైన చిత్రాంగదుడికి రాజ్యం దక్కిందా? అదీ లేదు.

అద్భుతమైన కథలు రాసిన భగవంతం, తన కథలలో సంప్రదాయ కథన నిర్మాణాలను ప్రక్కన పెట్టి ఒక కొత్త శైలిలో కథలు రాశాడు. తన కథలు తరచుగా కాల్పనికతకి, వాస్తవికతకు మధ్యన వుండే సరిహద్దులు చెరిపేస్తాయి. అసలు కాల్పనిక సాహిత్య నిర్వచనాలను సవాలు చేస్తాయి.

మొదటి ప్రయోజనం కథను ఆసక్తికరంగా చదివించేట్టు చేయడం. రెండవది, అసలు కథంతా అందుకోసమే రాసినది; ప్రధాన పాత్రలకు, తమకు ఉన్నాయనే తెలియని ప్రశ్నలు, వాటి స్వరూపాలు వాళ్ళకి తెలిసిరావటం. మూడవది వాటికి సమాధానం ఆ మాధ్యమాల ద్వారానే దొరకటం.

ఎక్కడో సుదూరపు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రజల గురించి రాసిన పుస్తకం కాదిది – సమస్త మానవాళి ఆశనిరాశలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ఉత్థానపతనాలను, విజయపరాజయాలను, కరుణాక్రౌర్యాలను, స్వార్థాలూ ఉదారతలను విప్పి చెప్పే రచన ఇది.

హాస్యం, వ్యంగ్యమే తన కతల్లో కూడా ప్రధాన రసాలైనా కరుణ, సానుభూతి, కదాచిత్తుగా ఎత్తిపొడుపు, సాహిత్యపరమైన విశ్లేషణ కూడా కనిపిస్తుంటాయి. రచయిత్రికి ఎవరిమీదైనా గాని, ఏ అంశం మీదైనా గానీ ఖచ్చితమైన అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడో, ఎదుటివారి అభిప్రాయాన్ని ఖండించవలసి వచ్చినప్పుడో గొంతు పెగలకపోతే సంద్రాలు పాత్ర హఠాత్తుగా ప్రత్యక్షమైపోతుంది. కుండబద్దలు కొట్టినట్లు దెబ్బలాడాలన్నా రచయిత్రికి సంద్రాలే దిక్కు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

డిట్రాయిట్‌లో జరగనున్న 24వ తానా మహాసభల సందర్భంగా మరొకసారి తానా నవలల పోటీని ప్రకటిస్తోంది. తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడే నవలలను వెలికి తీసుకురావాలనే తానా ప్రయత్నానికి స్పందించి ఈ పోటీలో పాల్గొనవలసిందిగా తెలుగు రచయితలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

హాయిగా మనమున్న ప్రపంచాల నుండి మనని ఇబ్బందిపెడుతూ పక్కకి లాగేవన్నీ మనకు ఆనందాన్నిచ్చే రచనలు కాకపోవచ్చు, కానీ బలమైన రచనలు. సమాజం నింపాదిగా విస్మరించే సామాజిక బాధ్యత, రకరకాల విశృంఖల రూపాల్లో తిరిగి దానికే తారసపడుతూ ఉంటుంది. వెయ్యి రకాలుగా కుదురుకుంటుంది.