మొక్కలు నాటడం విన్నాం, శవాలు నాటడం! ఆ ప్రేతానికి రెండువేల సంవత్సరాలు గడిచినా, క్రిందటి ఏడాదే అనుకుంటున్నాడు. పోయిన ఏడాది నీ పెరట్లో శవాన్ని నాటావు కదా? అది మొలిచిందా? అని అడుగుతున్నాడు! అసలు వాళ్ళు ప్రేతాలేనా? ప్రేతప్రాయులైన ప్రాణులా? అతడు మాట్లాడుతున్నది, ప్యూనిక్ యుద్ధం గురించేనా, లేక గత ఏడాది జరిగిన ప్రపంచయుద్ధమా?
మే 2023
సాంకేతిక విప్లవం సమాజంలోని ఎన్నో రంగాలను చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసింది. సాహిత్యం దీనికి మినహాయింపేం కాదు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇ-రీడింగ్ మునుపెన్నడూ చూడనంత స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టి, ప్రపంచం యథారీతిన కొనసాగుతున్నట్టు కనిపించినా, అప్పటి ఇ-అలవాట్లు ఇప్పుడు మరింత తీవ్రంగా, మరింత బలంగా కొత్త కొత్త ముఖాలతో కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ ఈ ఇ-అవసరాలను మరింత స్పష్టంగా, ఒకింత ముందుగా చెప్పిందన్న మాటే తప్ప, ఇవన్నీ ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చూడవలసిన మార్పులే. మార్పు కొత్త అవసరాల నుండి పుడుతుంది. అనివార్యమవుతుంది. పుస్తకం కొనుగోళ్ళు, అందుబాటు, చదివే అలవాట్లకు సంబంధించి, పాఠకప్రపంచం ఇప్పుడు ఎన్నో కొత్త అవసరాలతో ఉంది. వాటి వైపు దృష్టి సారించకుండా సాహిత్యాన్ని నిలబెట్టుకోగలమనుకోవడం అపోహ. ఆన్లైన్లో తెలుగు పుస్తకాల కొనుగోలు ఇప్పటికీ తెలుగునాట చాలా మంది విద్యావంతులకి కూడా అంతగా అలవాటు కాలేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కాకుండా, నవోదయ పుస్తకాల ఆన్లైన్ షాప్ తప్ప మిగతావి ఎందరికి తెలుసో కూడా అనుమానమే. ఈ సోషల్ మీడియాకు ఆవల కూడా ఒక పాఠక ప్రపంచం ఉందని గుర్తించకపోతే, మన అమ్మకాలు, కొనుగోళ్ళు, ప్రచారాలు అన్నీ ఇక్కడిక్కడికే పరిమితమైతే, మనం కొనుగోళ్ళలో ఆశించే ఊహించే అంకెలు బహుశా మనం చూడలేకపోవచ్చు. పుస్తకాలను ఎటూ ఎక్కడికీ మోసుకుపోవాల్సిన అవసరం లేకుండా, కావలసిన పుస్తకం తీరిక దొరికిన క్షణాల్లో చేతిలో తిప్పుకు పోగల సౌకర్యం నేటికి ఒక అవసరం. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ని తనకంటూ సృష్టించుకుని, పెద్ద ఎత్తున తెలుగు ఇ-రీడింగ్ రంగంలోకి వచ్చిన కినిగె దురదృష్టవశాత్తూ మూతపడింది. పుస్తకాల కొనుగోలుకు సంబంధించి, ఇ-చదువుకు సంబంధించి, కినిగె ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు పాఠకులకు పుస్తకాలు అద్దెకు ఇవ్వడంతో సహా, ఎన్నో హంగులతో మొదలైన అట్లాంటి అప్లికేషన్ మూతపడటం అంటే, తెలుగు సాహిత్య అవసరాలకు సంబంధించి, తెలుగు పాఠకుల వినియోగానికి సంబంధించి, మన లెక్కల్లోనో అంచనాల్లోనో ప్రచారంలోనో ఏదో తప్పుందన్న అనుమానం రాకపోదు. పాఠకుడి నుండి కినిగె ఆశించిన ఆ కాస్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా త్రోసిరాజని, ఇంకా సరళంగా, కంటికి హాయిగా ఉండేలా రూపొందించబడిన ఆప్ చదువు. అన్వీక్షికి ప్రచురణల నుండి వచ్చిన ఈ ఆప్, సహజంగానే ఈ కాలపు ఇ-రీడర్స్ అవసరాల మీద మరింత స్పష్టతతో మొదలై, ఇ-పాఠకులను మరింతగా ఆకర్షించే దిశగా దృష్టి సారించింది. గంటల తరబడి ప్రయాణాల్లోను, తప్పని మిగతా వ్యావహారిక పనులతోనూ నిండి ఉండే మనిషికి, ఇ-బుక్స్, ఆడియో బుక్స్ ఒక వరం లాంటివి. దాసుభాషితం ఆప్ ఆ కొరత తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇంతో కొంతో పేరూ ప్రచారం ఉన్న ఈ సంస్థను కూడా ఆర్థిక కొరత ఇబ్బంది పెడుతోంది. ఇ-పుస్తకాలు, ఆడియో సాహిత్యం నేటి జీవితానికి ఒక అవసరంగా మారుతున్నాయి. తెలుగు అంతర్జాల సాహిత్య పత్రికలు కూడా ఇప్పుడు ఆడియో వీడియో రచనలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈమాట ఎన్నో ఏళ్ళుగా అపురూపమైన ఆడియో ఫైల్స్‌ని పాఠకులకు అందించడం తెలిసిన విషయమే. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా మరిన్ని రచనలు అందుబాటులోకి తెస్తోంది. ఇన్ని మార్గాల ద్వారా ఎందుకు పాఠకుల దృష్టిని ఆకర్షించాలని ప్రశ్నిస్తే దానికి జవాబు ఒక్కటే. పుస్తకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక వాతావరణాన్ని సృష్టించడం. ఎంత విరివిగా విస్తృతంగా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేగలిగితే వారి సాహిత్యాభిరుచి పెంచడానికి అంతలా అవకాశం ఉన్నట్టు. అంతదాకా ప్రయాణమూ పరిశ్రమా తప్పవు.
సెంట్రల్ అమెరికా దేశాలు ప్రపంచంలోకెల్లా అతి తక్కువమంది యాత్రికులు తిరుగాడేవి. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచుకోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్రబిందువులుగా అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది.
తెల్లగా వెలిగేవి, పచ్చగా వెలిగేవి, మినుక్కు మినుక్కుమంటూ వెలిగేవి, అటూ ఇటూ ఊగుతూ వెలిగేవి – ఎన్నెన్ని రకాల దీపాలో! వాటిని చూడొద్దూ! పెద్దవాళ్ళకి ఈ తేడాల దీపాల వెలుగులు కనపడవు కాబోలు! దేవుడి దగ్గర దీపపుసెమ్మలో దీపం వేరు. చెట్టులా ఉన్న దీపాలగుత్తిలో ఉన్న దీపాలు వేరు!
ఎడారి మధ్యలో ఉండటంతో అన్ని కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయని చూస్తే తప్ప, సిటీల్లో ఆకాశాన్ని చూసినప్పుడు తట్టనే తట్టదు! ఎక్కడో చదివాను. యాభై అడుగుల పొడవూ, యాభై అడుగుల వెడల్పూ ఉన్న తెల్ల కాగితం మీద ఎక్కడైనా బాల్ పెన్‌తో ఒక్క చుక్క పెడితే, అంత ఉంటుందిట మన భూమి ఈ విశాల విశ్వంలో! అన్ని వేల గోళాల మధ్య – మనం. ఓహ్! అద్భుతం. పైగా, చల్లటి గాలి. ఎడారిమీద ప్రేమ పుట్టుకొస్తోంది.
విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు.
అమ్మాయిలు ఉద్యానవనంలో పూలు కోస్తున్నారు. కోస్తూ అల్లరి చేస్తున్నారు. చేస్తూ సల్లాపాలాడుతున్నారు. పండిన పళ్ళని వీరు ఆరగిస్తే, పాపం అక్కడి చిలుకలకు ఏం మిగులుతుంది కనుక? అంచేత చిలుక వీరిపై పగబట్టి, వీరి అధరాలపై పడుతుందట, తిందామని. వాతెర అంటే అధరము. స్త్రీ క్రిందిపెదవిని దొండపండుతో పోల్చుతారు. వీరి పెదవులను దొండపళ్ళనుకొని, అవి మిగిలాయి కను వాటిని తినడానికి వస్తుందట చిలుక! వీరి చెక్కిళ్ళపై సాంకవరుచి అట.
నాణేల గురించి మరిచిపోయిన ముప్పై సంవత్సరాల తరువాత, మొక్కలకి నీళ్ళు పడుతున్న నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా మనవడు, “తాతా! ఈ కాయిన్ ఆ చెక్కపెట్టెలో దొరికింది. చూడు దీనిపైన తెలుగు అక్షరాలు ఎంత పెద్దగా ఉన్నాయో!” అంటూ. వాడు ఏడో తరగతిలో చేరి వారం రోజులైందేమో.
బాలమురళి చిన్నగా తనకి ఊరితో సంబంధం, సంగమేశ్వర శాస్త్రిగారి గురించి, నేదునూరి గురించి, కవిగారి గురించి మాట్లాడి వాళ్ళందరికి తన నమస్కృతులు చెప్పి, పక్క వాద్యాలకి సూచన ఇచ్చి హంసధ్వనిలో వాతాపి గణపతిం ఎత్తుకున్నాడు. వయొలిన్ మోగింది. బాలమురళి గొంతు గాడిలో పడింది. శాస్తుర్లు అవసరార్థం మృదంగంతో తాళం వేసేడు. తర్వాత బాలమురళి తన స్వంత కృతి పాడేడు. తాళం మారింది.
హోటల్‌కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు.కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తితో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రి పూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.
ఘోషలు, ఉద్వేగాలు
కథలు, ప్రయాణాలు
ముగింపులన్నీ
తుది అంచులని దాటిన
గాలి తెరలుగా మారి
వీచి వీచి వెళ్ళిపోయాయి.
కిటికీ తెరిచినా మూసినా
చిక్కటి చీకటి నర్తిస్తూ
నరనరాలలో ప్రవహిస్తూ
ముక్కలైన చందమామ
నింగిలో మూలకు చేరి
ముఖం వేళ్ళాడేసినట్టు
ఉద్యోగం ఊరు మారినప్పుడల్లా
అన్ని సామాన్లతో పాటు
అల్లుకున్న అనుబంధాలను
అట్టపెట్టెల్లో సర్దుకొని
అయ్యగారి ఆఫీసుకో
పెద్దోడి ప్రైవేటుకో
చిన్నోడి కాన్వెంటుకో
కాస్త మబ్బు పట్టినా చాలు
సిరా చుక్కలు చినుకులవుతాయి
నీరెండ మెరుపు తాకినా
వేళ్ళ కొసల్లో పూలు పూస్తాయి.
చీకటి ఊయలలో
రాతిరి బిడ్డ నిద్దరోతున్నపుడు కూడా
బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.
సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.
అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.
ఈమాట సర్వర్ ఉన్న హోస్ట్గేటర్లో సమస్యల వల్ల సరైన సమాధానాలతో పంపినవారి ఈమెయిళ్ళు అన్నీ మాకు చేరలేదు. క్రితం సంచికలోని గడినుడి-78కి మొదటి ఇరవై రోజుల్లో మాకు అందిన సరైన సమాధానాలు పదమూడు మంది నుంచి వచ్చాయి. సరైన సమాధానాలు రాసినా పేర్లు ప్రకటించని వారికి మా క్షమాపణలు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-78 సమాధానాలు.
విప్లవం అనేమాట తెలుగుపాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: