మన తత్వశాస్త్రాన్ని మార్చగలిగే, భౌతికశాస్త్రాన్ని తలకిందులు చేయగలిగే విస్తృతమైన ఆలోచనలు కూడా, చాలా చిన్నదిగా కనిపించే ఒక ప్రయోగ ఫలితం నుంచే పుట్టొచ్చు.
మే 2026
తెలుగు భాష పూర్వకాలంలో రాజభోగాలను చవిచూసింది. “తెలుగొకండ” అన్న కృష్ణదేవరాయలు తనను తాను “కన్నడరాయ” అని అభివర్ణించుకున్నా తెలుగుకే పట్టం కట్టాడు. ఇది చాలామటుకు రాజకీయమైన నిర్ణయమే అయినా తెలుగుకి కలిసొచ్చింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా దక్షిణాదిన తంజావూరు, మధుర నాయక రాజుల కాలంలో తెలుగు సాహిత్యం పొందిన వైభవం అనన్యసామాన్యం. చేమకూర వెంకటకవి, ముద్దుపళని వంటి వారు ఆ నేలమీదే అద్భుతమైన అక్షరసేద్యం చేశారు. నాదబ్రహ్మ త్యాగరాజు కృతులు విని, ఆ కృతుల్లోని భక్తికీ, భావానికీ, భాషలోని మాధుర్యానికీ పరవశించిన తమిళప్రజ ‘సుందర తెలుంగు’ అని కొనియాడారు. 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ తమిళనాట విద్యార్థులకు తెలుగు నేర్పే గురువులుండేవారని స్వామినాథ అయ్యర్ వంటి విశిష్ట పరిశోధకుల ఆత్మకథల ద్వారా మనకు తెలుస్తోంది.
చరిత్రలో తొలి అడుగు వేసేవారికి దక్కే కీర్తి వెనుక, ఎవరూ ఊహించని నష్టాలు, ఆటుపోట్లు కూడా దాగి ఉంటాయి. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రజల పరిస్థితీ అదే. నిజానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలోనే తెలుగువారు పలు ప్రాంతాలను కోల్పోయారు. “బళ్ళారి నుండి బరంపురం దాకా” అన్న నినాదం కేవలం నినాదప్రాయమై మిగిలిపోయింది. అదృష్టాధ్వగమనం ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. విశాలాంధ్ర సృష్టి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చింది కానీ, సరిహద్దుల్లో తెలుగు మాతృభాషగా మాట్లాడే వారెందరినో తెలుగురాష్ట్రానికి పరాయివారిని చేసింది. దక్షిణ ఒడిశాలోని తెలుగు ప్రజకు ఆటపట్టుగా ఉన్న అప్పటి కొరాపుట్, గంజాం జిల్లాలు, ఇతరేతర ప్రాంతాలు ఒడిశాలోనే ఉండిపోయాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడివారిని “ప్రవాసాంధ్రులు” అనడం చారిత్రక అజ్ఞానమే అవుతుంది. అక్కడివారు వలస వెళ్ళినవారు కారు, తొలినుంచీ అక్కడివారే. ఆ మట్టిలోనే పుట్టి పెరిగిన అచ్చమైన తెలుగుబిడ్డలు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులుగారిది పర్లాకిమిడి. అది ఒడిశాలో భాగంగా ఉండిపోవడం వలననే ఆయన పక్కనే ఉన్న పాతపట్నంకి మారాల్సి వచ్చింది. ప్రసిద్ధ రచయిత త్రిపురగారిది ఋషికుల్యా నది ఒడ్డునున్న పురుషోత్తమపురం. మాజీ రాష్ట్రపతి వి.వి.గిరిగారిది బరంపురం. ప్రఖ్యాత కథకులు మంథా వెంకట రమణారావుగారిది రౌర్కెలా. ఈ ప్రాంతాలన్నీ తెలుగు సాహితీ వికాసానికి ఎంతో దోహదం చేశాయి.
అలాగే దక్షిణాదిన తమిళనాట నివాసముంటున్న తెలుగు కథకుల్లో అగ్రగణ్యులు స.వెం. రమేశ్‌గారు. కర్ణాటక సరిహద్దులైన బళ్ళారి, కోలార్, రాయచూరు, బెంగుళూరు ప్రాంతాలలో తెలుగు భాషా సాహిత్యాల ప్రాభవం నాటికీ నేటికీ సజీవమే. నాటక రంగాన్ని శాసించిన బళ్ళారి రాఘవ లాంటి మహామహులు అక్కడివారే. ఆధునిక కాలంలో హొసూరు, కోలార్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల జీవన చిత్రాన్ని రికార్డు చేయడానికి, వారి కష్టసుఖాలను కథలుగా మలచడానికి ఎందరో స్థానిక కథకులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహారాష్ట్ర సరిహద్దులోని షోలాపూర్, గడ్చిరోలి, సిరోంచా ప్రాంతాల్లో తెలుగు నేటికీ మాతృభాషగా వర్ధిల్లుతోంది. అక్కడి దళిత, బహుజన జీవన పోరాటాలను అక్కడి రచయితలు అద్భుతమైన కథలుగా మలుస్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్, దండకారణ్య ప్రాంతాల్లోని గిరిజన, ఆదివాసీల జీవితాలను, బహుళ సంస్కృతుల సంఘర్షణను స్థానిక తెలుగు రచయితలు తమ మాతృభాషలో సామాజిక స్పృహతో అక్షరీకరిస్తున్నారు. ఈ సరిహద్దుల వెలుపల ఉన్న తెలుగువారి అనుభవాలను, ఆచారవ్యవహారాలను భద్రపరచడానికి పూదోట శౌరీలు, సా.వెం. రమేష్ లాంటి వారు “మేరలకావల” పేరిట రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు రచయితల కథలతో తీసుకువచ్చిన సంకలనం గొప్ప కృషి. ఈ పుస్తకం రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల వెలుపల బతుకుతూ, భిన్న సంస్కృతుల మధ్య నలుగుతూనే, తమ మాతృభాషలో వాళ్లు సృష్టిస్తున్న అనన్యమైన సాహిత్యానికి అద్దం పట్టింది.
భౌగోళిక సరిహద్దులు రాజకీయ పటాలను నిర్దేశించగలవేమో కానీ, మాతృభాషతో ముడిపడిన భావోద్వేగాలను, సృజనాత్మకతను కట్టడి చేయలేవు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన రచయితలెంతమందో ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో నివాసమున్నవారు కారు. భౌతికంగా ఈ రచయితలు సరిహద్దులకు ఆవల ఉన్నా, వారి అక్షరాలు మాత్రం ఎప్పటికీ తెలుగు సాహిత్యపు నడిబొడ్డునే నిలిచి ఉంటాయి.
కాఫ్కా రచనల్లో ప్రధానంగా గమనించవలసింది అతని రచనా విధానంలోని మర్మం. జీవిత వాస్తవం బుద్ధికి అందడం లేదు. ఈ అందని అసంబద్ధతను చెప్పడానికి అతడు అవ్యక్తాన్ని ఆశ్రయిస్తాడు. అవ్యక్తం (subconscious) స్వప్నంలో వ్యక్తమయ్యేది. అసంబద్ధ వాస్తవాన్ని వ్యక్తంచేయడానికి ఈ అవ్యక్తాన్ని, స్వాప్నిక వాస్తవాన్ని ఆలంబనం చేసుకుంటాడు. ఈ “తీర్పు” కథలో ముగింపు అటువంటి స్వాప్నిక వాస్తవం.
మహాభారతంలో పాత్రలను వాడుకున్నా ఈ నాటకపు కథ స్వతంత్రమైన కల్పనే. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకును వదులుకోవాల్సిన క్లిష్టపరిస్థితి ఏర్పడ్డప్పుడు తల్లిదండ్రులు రెండవ కొడుకును వదులుకునేందుకు సిద్ధపడడం అనే ఊహకు, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే శునశ్శేఫుడి కథకు సామ్యం కనిపిస్తుంది.
‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.
నేను దేవుణ్ణి కాదు, టెలెమాకస్! నువ్వు ఎవరి కోసం రాత్రి, పగలు కలవరిస్తున్నావో, ఎవరి రాకకోసం ఇరవై ఏళ్ళబట్టి ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేనే. నేను నీ తండ్రిని!
పయనీర్ లాడ్జ్ కాలంతోపాటు ముందుకు వెనక్కు మెల్లగా సాగుతూనే ఉంది. నిజానికి అది ఒక జ్ఞాపకాల దొంతరలా మారింది. కొందరు ఇప్పటికీ దాని ముందు నిలబడి గతంలో ఆ గదుల్లో తాము స్త్రీలతో గడిపిన ఉల్లాస వేడుకల గురించి తలపోసుకుంటూ ఉంటారు.
వెగటు రాతలతోటి,
దురుసు మాటలతోటి,
బతుకులు మార్చగలడు
కాటికి చేర్చగలడు.
యుద్ధమూ, శాంతి
నాణేనికి చెరో పక్కా
ఉంటాయని అనుకోవద్దు
రెండూ రెండుపక్కలా
సింహం బొమ్మలు
దూసిన కత్తులు
గాయపడిన కాకి చుట్టూ
జాతిప్రేమ గొంతు చించుకుంటుంది
తేనెటీగల సమష్టి ప్రేమబంధం
నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది
అప్పటికే నిద్ర లేచిన మా పెద్దది మాత్రం
చిరిగిన యూనిఫామ్ లోనుండి వెక్కిరిస్తున్న పేదరికాన్ని
కిక్కురు మనకుండా పిన్నీసుతో కుట్టేసుకుని
కళ్ళల్లో కాంతిపుంజాల్ని వెలిగించుకుంటుంది!
రేపుమాపను భేదమ్ము లేశమాత్ర
మైనలేక నీజనసమూహాంబురాశి
డస్సిబోని సంద్రపుకెరటముల భంగి
పొంగు నిద్రిల్ల నిమ్మహానగరి నందు
సౌతాఫ్రికాని హరివిల్లు దేశం (Rainbow Nation) అని అభివర్ణించారట. అయితే హరివిల్లులో రంగులకంటే సౌతాఫ్రికాలో జాతులూ తెగలూ ఎక్కువన్నది మాత్రం స్పష్టం! ఉత్తర అమెరికాలో పలు స్వదేశీ తెగలు ఉన్నట్టే ఇక్కడ కనీసం అర డజను పెద్ద తెగలు ఉన్నాయి. వీరిలో ఎవరి భాష వారిదే! సౌతాఫ్రికాలో 12 ఆధికారిక భాషలు ఉన్నాయట.
నీటిలో లీనమై కరగిన పంచదార విశదముగా పానకమునంతా వ్యాపించి రుచికర పేయమౌను. ఆ రుచి నోటికే తప్ప చేతికందదు, కనులకు అగుపడదు. లోకంలో ఆత్మవస్తువును తెలుసుకున్న మనిషి మితమైన దేహప్రకృతిని వదలి, అందరిలో, అన్నిటిలో చక్కెర పానకం కలిసిపోయినట్లు కనబడక, చేతికి చిక్కక, తన తీపిని మాత్రమే నోటికి అందించే విధంగా లోకానికి మిత్రుడవ్వాలి.
ఏ ఆలయంలోకి వెళ్ళినప్పుడైనా నాలో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. ఏది వాస్తవం? ఆలయమా? దైవమా? భక్తులా? వారి మనసుల్లోని ‘భక్తి’ అన్న భావమా? మనిషికి ఉపకరించేది, సాంత్వననిచ్చేది ఏది?
నడక మొదలెట్టీ మొదలెట్టగానే మనస్లు, హిమల్ ఛులి, పీక్ 29 శిఖరాలు చక్కని అర్ధవృత్తాకారపు హిమకుడ్యంగా చేతులు కలిపి మాముందు నిలబడి మురిపించాయి.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.