సీతాకోకచిలుక పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి. త్యాగము ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా.

ధైర్య సాహసాలు, మొక్కవోని పట్టుదలలూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులు హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారన్నది కఠోర వాస్తవం. వారి కథలు తలచుకుంటే ప్రకృతి ముందు ఎంతటివారైనా తల వంచవలసిందేగదా అనిపిస్తుంది. ‘ఎంత అనుభవం ఉన్నా ప్రతి యాత్రా ఒక నూతన ప్రయత్నం. ప్రమాదభూయిష్టం.

అద్దం ఎదుట నిలబడి ఒకసారి చూసుకొండి! ఏమిటి కనిపించింది? రెండు కళ్ళతో సూటిగా ఎదుటికి చూస్తూన్న ఒక భోక్త విగ్రహం! దరిదాపుగా భోక్తలన్నిటికి రెండు కళ్ళు, ముఖానికి మధ్యస్థంగా ఉండి, ఎట్టఎదుటకు సూటిగా చూస్తూ ఉంటాయి; తద్వారా వాటి ద్విచక్షు దృష్టిని ఉపయోగించి అవి భోజ్యాన్ని వేటాడి తినగలవు!

మల్లేస్వరి వరసగా నాల్రోజులు స్కూలుకి రాపొయ్యేసరికి సారు కొట్టిన దెబ్బలకే అనుకున్నారు అబ్బాయిలంతా. అమ్మాయిలం మాత్రం తలా రెండ్రూపాయిలు యేసుకుని ఒక చిన్న గిఫ్టు కొన్నాం. పదకొండోరోజు మద్యానం పర్మిషనడిగి లంచి టైమ్లో యెల్లి గిఫ్టిచ్చి ఫోటో కూడా దిగాం. మల్లేస్వరి చీర కట్టుకుని కుర్చీలో కూచుంటే మా చిన్నప్పుడూ వాళ్ళ అమ్మ ఉన్నట్టే కనపడింది. తలనిండా కనకాంబరం పూలు పెట్టారు.

“అపచారం! అపచారం! అమ్మ గుడి తగలడిపోతోoదొరేయ్!” గుండెలు బాదుకుంటా వీధిగుమ్మంలోనే సొమ్మసిల్లి పడిపోయింది గణికమ్మ. గణికమ్మ ఇంట్లో కరెంటుబల్బు ఠక్కున వెలిగింది. ఇంట్లో జనం వీధిలోకొచ్చేరు. అందరూ గుడివైపు చూసి గుండెలమీద చరుసుకుంటూ పెడబొబ్బలు పెట్టారు. ఆ అరుపులకు ఊరు ఊరంతా లేచింది. వీధిమొగలో వేణుగోపాలస్వామి గుడిని అనుకుని ఉన్న పుంతరేవమ్మ గుడి వైపు పరుగులు పెట్టారు ఊరిజనం.

చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
పెళపెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటదొట రాళ్ళే పైబడిన
రాలిన పుష్పములనుకొందును!

ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది.

తెలుగు సాహిత్యం రాసే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ. పతంజలిగారు ఎంత బాగా రాస్తారో అంతకు కొన్ని వేలరెట్లు బాగా బాగా చదువుకున్న మనిషి. అదీ ఇదని మాత్రమే కాదు, చదవదగ్గది అనుకున్న ప్రతీదిని ఆయన ఎంత చదువుకున్నాడో లెక్కేయడానికి లెక్కేలేదు.

కకావికలై దారితప్పిన మిత్రులనూ;
రెక్కలు తెగిన ఆప్తులనూ;
మళ్ళీ కలుస్తానో లేదోనన్న బెంగ
కంటి గోళాల్లో ప్రతిఫలిస్తోంటే…
నిన్నటినుంచీ ద్వారం మీద
నిశ్చలంగా వాలినది వాలినట్టే

తెరిచిన పుస్తకంలో
కళ్ళు మూసిన అక్షరాలు
అక్షరాల మధ్య
గగుర్పొడుస్తున్న అర్ధవిన్యాసం

కంఠంలో ఇరుక్కున్న విషం
విషాద మేఘాల కంట తడి

అప్పటి వరకు ఎక్కడో కాపేసిన పిలగాళ్ళు
భయపడుతూనే చుట్టూ చేరతారు
వాళ్లేం మాటలు విసురుతారో-
ఫౌంటేన్‌లోంచి నీళ్ళు చిమ్మినట్టు
చివాల్న ఒకటే నవ్వుతుంది
ఆ పిల్ల, చేయడ్డెట్టుకుని.

నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.

ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.

ఈ నేపథ్యంలో రాసిన కథలు చదివినపుడు ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనవుతాం. అది ఒక మంచి కథ చదివిన సంతోషమా? కాదు. కథాంశంలోని దుఃఖమా? అదీకాదు. ప్రతీకథా చదివిన వెంటనే మరోకథ చదవలేము. కథ చదివిన తర్వాత కొంతసేపు కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోతాం.

విజయ కథలన్నీ దాదాపు నగరాలకు సంబంధించిన మహిళల కథలు. అవి అన్ని తరగతులకు, వర్గాలకు చెందిన స్త్రీల జీవితాలకు ప్రతిబింబాలు. అసమానతలు, వివక్షలు, ఆంక్షలు, సమస్యల మధ్య సతమతమవుతున్న అతివల చిత్రాలు. పితృస్వామ్య ఆధిపత్యాలపై ప్రశ్నలు లేవనెత్తిన అభ్యుదయ రూపాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: